Mars | మంచుతో మార్స్‌పై బంగ్లాలు.. అంగారకుడిపై మనుషులు ఉండేందుకు సైంటిస్టుల బ్రిలియంట్ ప్లాన్!
Mars | అంగారకుడిపై మనుషులు ఉండొచ్చా? అక్కడి వాతావరణాన్ని మనుషులు తట్టుకుని ఉండటం సాధ్యమేనా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం లేకపోయినప్పటికీ.. మన శాస్త్రవేత్తల పరిశోధనలు చూస్తుంటే ఏదో ఓ రోజు అది సాధ్యమవుతుందనే ఆశలు మాత్రం ఉన్నాయి.
Mars | అంగారకుడిపై మనుషులు ఉండొచ్చా? అక్కడి వాతావరణాన్ని మనుషులు తట్టుకుని ఉండటం సాధ్యమేనా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం లేకపోయినప్పటికీ.. మన శాస్త్రవేత్తల పరిశోధనలు చూస్తుంటే ఏదో ఓ రోజు అది సాధ్యమవుతుందనే ఆశలు మాత్రం ఉన్నాయి. ఈ క్రమంలోనే మార్స్ ఉపరితలంపై భారీగా ఉన్న మంచును ఉపయోగించి అద్భుతమైన ఇండ్లను నిర్మించవచ్చని తాజా పరిశోధనలో వెల్లడైంది. మంచుతో నిర్మించిన ఈ ఇండ్లు అంగారకుడిపై ఉన్న వాతావరణాన్ని తట్టుకుని స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి దోహదపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మేరకు వారు చేసిన పరిశోధనను ఇటీవల జరిగిన అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ వార్షిక సదస్సులో ప్రదర్శించారు.
శాస్త్రవేత్తల అంచనా ప్రకారం అంగారకుడి ఉపరితలం పైన, కింద దాదాపు 50 లక్షల క్యూబిక్ కిలోమీటర్లకు పైగా నీరు ఘనీభవించి ఉంది. దీనిని వనరుగా ఉపయోగించుకుంటే మానవులు ఉండేందుకు వీలుగా అద్భుతమైన నిర్మాణాలు చేపట్టవచ్చు. పైగా భూమి నుంచి భారీగా నిర్మాణ సామగ్రిని తీసుకెళ్లాల్సిన అవసరం కూడా తప్పుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
చలిని తగ్గించి.. ఉష్ణోగ్రతలు పెంచి..
మార్స్‌పై ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా -120 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయి. అలాంటి వాతావరణాన్ని తట్టుకోవాలంటే మంచుతో నిర్మించిన ఇండ్లే శ్రేయస్కరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మంచును ఉపయోగించి మందమైన గోడలతో అందమైన ఇంటిని నిర్మించినప్పుడు, ఆ నివాసాల్లో ఉష్ణోగ్రతలు -120 డిగ్రీల సెల్సియస్ నుంచి -20 డిగ్రీల సెల్సియన్ వరకు పెరుగుతాయని వివరించారు. ఈ మేరకు అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ వార్షిక సదస్సులో ఒక మోడల్‌ను ప్రదర్శించారు. అంతరిక్ష కాలనీల్లో అతిపెద్ద సవాలు భూమిపై ఆధారపడటాన్ని తగ్గించడమే అని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన హార్వర్డ్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి రఫీద్ ఖయూమ్ తెలిపారు. మార్స్‌పై ఉన్న మంచును ఉపయోగిస్తే మన నివాసాలు, పరిశోధనా కేంద్రాలను అక్కడే నిర్మించుకోవచ్చని పేర్కొన్నారు.
రేడియేషన్ నుంచి రక్షణ
భూమిపై ఉన్నట్లుగా అంగారకుడిపై దట్టమైన వాతావరణం లేదు. దీంతో సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత (UV) కిరణాలు, కాస్మిక్ రేడియేషన్‌కు బహిర్గతమవుతుంది. ఇది మనుషుల ఆరోగ్యానికి హానికరం. ఈ నేపథ్యంలో మంచుతో ఆవాసాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల హానికరమైన అతనీలలోహిత కిరణాలను అడ్డుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదే సమయంలో ఇన్‌ఫ్రారెడ్ కాంతిని ఇంటి లోపలికి అనుమతిస్తాయి. దీంతో మంచుతో నిర్మించిన నివాసాల్లో హానికరమైన అతినీలలోహిత కిరణాల ప్రభావం తగ్గడమే కాకుండా సహజ వెలుతురు, వేడి లభిస్తుందని పేర్కొన్నారు. మానసిక ఆరోగ్యానికి, వ్యవసాయానికి కాంతి స్థాయిలను సరిగ్గా మెయింటైన్ చేయడం చాలా అవసరం. ఇది మంచుతో నిర్మించిన ఇండ్లతో వీలవుతుంది కాబట్టి ఇది మానవులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి అనువుగా ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
సమస్యలు కూడా..
అంగారకుడిపై మంచుతో నిర్మించే నివాసాలతో ప్రయోజనాలతో పాటు పలు సమస్యలు కూడా ఉన్నాయి. వాటిలో ప్రధాన అడ్డంకి శక్తి. ఒక నివాసాన్ని నిర్మించాలంటే రోజుకు దాదాపు 15 చదరపు మీటర్ల మంచును ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. దీనికి భారీ మొత్తంలో శక్తి అవసరం. అది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) రోజూ వినియోగించే శక్తితో సమానం.
మరో సమస్య ఏంటంటే.. మార్స్‌పై ఉన్న వాతావరణం కారణంగా తరచూ ధూళి తుపానులు వస్తుంటాయి. దానివల్ల ఎగిరొచ్చిన దుమ్ము మంచుతో నిర్మించిన ఇండ్లపై పొరగా పరుచుకుని ఉండిపోతుంది. అది సూర్యరశ్మి ఇండ్ల లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా ఉష్ణోగ్రతలు నియంత్రించే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. దీనిని నిరోధించడంతో పాటు మంచు తొందరగా ఆవిరికాకుండా అడ్డుకోవాలంటే వాటికి ప్రత్యేకమైన కోటింగ్ వేయాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ కోటింగ్‌ను భూమిపై నుంచి అంగారకుడిపైకి తీసుకెళ్లడం కూడా సవాలుతో కూడుకున్నదే.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






