Ghost Galaxy | నాసా ‘హబుల్’కు చిక్కిన మిస్టీరియస్ ఘోస్ట్ గెలాక్సీ..! ఆస్ట్రోఫిజికల్ జర్నల్‌లో కీలక విషయాలు..!
Ghost Galaxy | విశ్వంలో మరో ఆశ్చర్యకరమైన ఆవిష్కరణ వెలుగుచూసింది. నాసా (NASA)కు చెందిన హబుల్ టెలీస్కోప్ (Hubble Space Telescope) సహాయంతో ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటివరకు గుర్తించిన అత్యంత రహస్యమైన నక్షత్ర మండలాల్లో ఒకటైన ‘సీడీజీ-2 (CDG-2) అనే ఘోస్ట్ గెలాక్సీని కనుగొన్నారు.
Ghost Galaxy | విశ్వంలో మరో ఆశ్చర్యకరమైన ఆవిష్కరణ వెలుగుచూసింది. నాసా (NASA)కు చెందిన హబుల్ టెలీస్కోప్ (Hubble Space Telescope) సహాయంతో ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటివరకు గుర్తించిన అత్యంత రహస్యమైన నక్షత్ర మండలాల్లో ఒకటైన ‘సీడీజీ-2 (CDG-2) అనే ఘోస్ట్ గెలాక్సీని కనుగొన్నారు. ఈ గెలాక్సీ దాదాపు మొత్తం ద్రవ్యరాశిలో 99 శాతం డార్క్ మ్యాటర్‌దే ఆధిపత్యం ఉండడం ప్రత్యేకత. భూమికి సుమారు 300 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న పెర్సియస్ గెలాక్సీ క్లస్టర్ (Perseus Galaxy Cluster)లో ఈ అరుదైన గెలాక్సీ గుర్తించారు. సాధారణంగా గెలాక్సీలు బిలియన్ల నక్షత్రాల ప్రకాశంతో మెరిసిపోతాయి. కానీ, సీడీజీ-2 మాత్రం అత్యంత మందమైన కాంతితో మాత్రమే కనిపించింది. ఇందులో సాధారణ నక్షత్రాలు కాకుండా, కేవలం నాలుగు గ్లోబ్యులర్ క్లస్టర్లు మాత్రమే గుర్తించారు. ఈ సంచలన ఆవిష్కరణకు సంబంధించిన పరిశోధన వివరాలు ది ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్ (The Astrophysical Journal Letters)లో ప్రచురితమయ్యాయి.
కృష్ణ పదార్థంతోనే..
శాస్త్రవేత్తల ప్రకారం.. విశ్వంలో కొన్ని గెలాక్సీలు చాలా మందమైన కాంతిని మాత్రమే విడుదల చేస్తాయి. వీటిని ‘లో-సర్ఫేస్-బ్రైట్‌నెస్ గెలాక్సీలు’గా పిలుస్తారు. వీటిలో నక్షత్రాలు చాలా తక్కువగా ఉండటంతో, ఎక్కువ భాగం ద్రవ్యరాశి కాంతిని వెలువరించని, శోషించని డార్క్ మ్యాటర్‌తోనే ఉంటుంది. సీడీజీ-2 ఈ అరుదైన వర్గానికి చెందినదిగా తేలింది. ఇప్పటివరకు గుర్తించిన గెలాక్సీలలో అత్యధిక డార్క్ మ్యాటర్ కలిగిన గెలాక్సీలలో ఇది ఒకటిగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ టొరంటొ (University of Toronto)కు చెందిన డేవిడ్ లీ బృందం సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఆలోచించింది. మందమైన నక్షత్ర కాంతిని వెతకకుండా, గెలాక్సీల చుట్టూ తిరిగే గోళాకార నక్షత్ర సమూహాల సాంద్రతను విశ్లేషించింది. గ్లోబ్యులర్ క్లస్టర్లు సాధారణంగా గెలాక్సీల చుట్టూ పరిభ్రమించే గోళాకార, అత్యంత సాంద్ర నక్షత్ర సమూహాలు. ఇవి సమీపంలో ఒక మందమైన గెలాక్సీ ఉన్నట్లు సూచించే సంకేతాలుగా పనిచేస్తాయి. ఈ విధానంతో బృందం ఇప్పటికే గుర్తించిన పది లో-సర్ఫేస్-బ్రైట్‌నెస్ గెలాక్సీలను ధ్రువీకరించడంతో పాటు మరో రెండు కొత్త డార్క్ గెలాక్సీలను గుర్తించింది.
నాలుగు గెలాక్సీల నుంచే 60లక్షల సూర్యుల కాంతి..
ప్రాథమిక గణాంకాల అంచనా ప్రకారం.. ఈ గెలాక్సీ మొత్తం వెలుగు సుమారు 60 లక్షల సూర్యులు వెలువరించే కాంతికి సమానంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. సాధారణ నక్షత్ర మండలాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. సాధారణంగా ఒక గెలాక్సీలో కోట్ల నుంచి వందల కోట్ల నక్షత్రాలతో ప్రకాశిస్తుంటే.. సీడీజీ-2 మాత్రం అత్యంత డార్క్ గెలాక్సీగా గుర్తించారు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇందులో కనిపించిన కేవలం నాలుగు గోళాకార నక్షత్ర సమూహాలే గెలాక్సీలో మొత్తం కనిపించే కాంతిలో దాదాపు 16 శాతం అందిస్తున్నాయి. అంటే గెలాక్సీ వెలుగులో గణనీయమైన వాటా ఈ నాలుగు సమూహాలదే కావడం విశేషం. అయితే అత్యంత సంచలన అంశం దాని ద్రవ్యరాశి. కనిపించే పదార్థం, కనిపించని పదార్థం రెండింటినీ కలిపి లెక్కించినప్పుడు, సీడీజీ-2 మొత్తం ద్రవ్యరాశిలో సుమారు 99 శాతం కృష్ణ పదార్థందేనని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అంటే నక్షత్రాలు, వాయువులు వంటి సాధారణ పదార్థం కేవలం ఒక శాతం మాత్రమే ఉండి.. మిగతా భాగం మొత్తం కనిపించని డార్క్ మ్యాటర్‌తో నిండి ఉన్నట్లు తేలింది.
హైడ్రోజన్ తగ్గడం వల్లే..
డెన్స్ గెలాక్సీ సమూహాల్లో చోటుచేసుకునే గురుత్వాకర్షణ ప్రభావాలే సీడీజీ-2 ప్రస్తుత పరిస్థితికి కారణమై ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ముఖ్యంగా పెర్సియస్ గెలాక్సీ క్లస్టర్ (Perseus Galaxy Cluster) వంటి భారీ గెలాక్సీ సమూహాల్లో సమూహాల్లో ఇతర గెలాక్సీలతో జరిగే గురుత్వ పరస్పర చర్యలతో నక్షత్రాల ఏర్పాటుకు అవసరమైన హైడ్రోజన్ వాయువు సీడీజీ-2 నుంచి తొలగిపోయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. హైడ్రోజన్ వాయువు లేకపోతే కొత్త నక్షత్రాలు ఏర్పడవు. దాంతో గెలాక్సీ క్రమంగా మసకబారుతూ నక్షత్రాల సంఖ్య తగ్గిపోతుంది. ఇదే కారణంగా సీడీజీ-2 ప్రస్తుతం అత్యంత మందమైన కాంతితో కనిపిస్తున్న ‘ఘోస్ట్ గెలాక్సీ’గా మారి ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. అయితే గ్లోబ్యులర్ క్లస్టర్లు మాత్రం అత్యంత సాంద్రత, బలమైన గురుత్వాకర్షణ బంధంతో ఉంటాయి. అందువల్ల ఇలాంటి టైడల్ ప్రభావాలను తట్టుకుని నిలబడగలుగుతాయి. డార్క్ మ్యాటర్ స్వభావంపై మరింత అవగాహనకు ఈ ఆవిష్కరణ కీలకంగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. విశ్వంలోని గూఢరహస్యాలను ఛేదించే దిశగా ఇది మరో ముందడుగుగా పేర్కొంటున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






