త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MAPS comet | తోక చుక్క వ‌స్తోంది..! రేపు సూర్యాస్త‌మ‌యం త‌ర్వాత ఆకాశం వైపు లుక్కేయండి..!

MAPS comet | స్కైవాచ‌ర్ల‌కు గుడ్‌న్యూస్‌. ఇటీవ‌ల కొత్త‌గా గుర్తించిన కామెట్ (C/2026 A1 (MAPS) ఈ నెల 4న సూర్యుడి వ‌ద్ద‌కు చేరి.. మ‌ళ్లీ ఆకాశంలో ద‌ర్శ‌న‌మిస్తుంది. ఈ సన్‌గ్రేజింగ్ కామెట్ సూర్యుడి దగ్గరకు వెళ్లే క్రమంలో ప్రకాశించే వెలుగు రేఖలతో ఆకట్టుకునే అవకాశం ఉంద‌ని ఖ‌గోళ‌శాస్త్ర‌వేత్త‌లు పేర్కొంటున్నారు.

P

Science | Published On Apr 3, 2026, 6.42 pm IST

MAPS comet | తోక చుక్క వ‌స్తోంది..! రేపు సూర్యాస్త‌మ‌యం త‌ర్వాత ఆకాశం వైపు లుక్కేయండి..!
Advertisement

MAPS comet | స్కైవాచ‌ర్ల‌కు గుడ్‌న్యూస్‌. ఇటీవ‌ల కొత్త‌గా గుర్తించిన కామెట్ (C/2026 A1 (MAPS) ఈ నెల 4న సూర్యుడి వ‌ద్ద‌కు చేరి.. మ‌ళ్లీ ఆకాశంలో ద‌ర్శ‌న‌మిస్తుంది. ఈ సన్‌గ్రేజింగ్ కామెట్ సూర్యుడి దగ్గరకు వెళ్లే క్రమంలో ప్రకాశించే వెలుగు రేఖలతో ఆకట్టుకునే అవకాశం ఉంద‌ని ఖ‌గోళ‌శాస్త్ర‌వేత్త‌లు పేర్కొంటున్నారు. అయితే, భార‌త్‌లో క‌నిపిస్తుందా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. భార‌త్‌లో దీన్ని చూడటం సులభం కాదని పేర్కొంటున్నారు. సూర్యుడికి అత్యంత సమీపమైన పెరిహీలియన్‌ను ఇది సురక్షితంగా దాట‌గ‌లిగితే.. ఏప్రిల్ 5 నుంచి 10 మధ్య సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పడమర దిశలో కనిపించే అవ‌కాశాలున్నాయి. ముఖ్యంగా ఉత్తర, పడమర భారత ప్రాంతాల్లో స్పష్టమైన ఆకాశం ఉంటే చూసేందుకు వీలుంటుంది. న‌గ‌రాల్లోని వెలుతురుసూర్యుడికి అత్యంత సమీపమైన పెరిహీలియన్‌ను ఇది సురక్షితంగా దాటితే, ఏప్రిల్ 5 నుంచి 10 మధ్య సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పడమర దిశలో కనిపించే అవకాశం ఉంది. స్ప‌ష్టంగా చీక‌టి ఉండే ప్రాంతాల నుంచి చూస్తే ఈ తోక‌చుక్క క‌నిపించే అవ‌కాశాలున్నాయి.

భార‌త్‌లో ఎక్క‌డ క‌నిపిస్తుంది?

  • తోకచుక్కను చూసేందుకు అవ‌కాశాలున్నాయి. అయితే, ఇది ప్రాంతంపై ఆధార‌ప‌డి ఉంటుంది.
  • ద‌క్షిణ భార‌త‌దేశంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గోవా క‌నిపిస్తుంది.
  • సూర్యాస్తమయం తర్వాత దక్షిణ-పశ్చిమ ప్రాంతంలో ఆకాశంలో తక్కువ ఎత్తులో ద‌ర్శ‌న‌మిస్తుంది.
  • ఉత్తర భారతదేశంలో ప్రత్యేకంగా నగరాల్లో వెలుతురు త‌క్కువ ఉండే ప్రాంతాల్లో క‌నిపిస్తుంది.
  • అదే స‌మ‌యంలో ఆకాశం స్ప‌ష్టంగా క‌నిపించాలి. క‌నిపించేందుకు ఆస్కారం లేదు.

చూసేందుకు స‌రైన స‌మ‌యం..

  • ఏప్రిల్ 4న సూర్యుడికి అత్యంత స‌మీప దూరానికి చేరుతుంది.
  • భార‌త్‌లో సూర్యాస్తమయం తర్వాత 30–45 నిమిషాల త‌ర్వాత ఆకాశాన్ని గ‌మ‌నిస్తూనే ఉండాలి.
  • పశ్చిమ-దక్షిణం వైపు ఆకాశంలో చూస్తుండాలి.
  • ఈ తోకచుక్క ప్రకాశవంతమైన శుక్ర గ్రహానికి దగ్గరలో క‌నిపిస్తుంది
  • చిన్న టెలిస్కోప్ ఉప‌యోగించాలి.
  • వెలుగు తక్కువగా ఉన్న ప్ర‌దేశాల నుంచి చూస్తే ఇంకాస్త బాగా క‌నిపిస్తుంది.
  • ఆస్ట్రోనమీ యాప్‌లతో ఖచ్చిత స్థానంతో తెలుసుకోవ‌చ్చు.
Advertisement
Advertisement