Mission Drishti | మిషన్ దృష్టి సక్సెస్.. గెలాక్సీ ఐ శాటిలైట్‌ను కక్ష్యలో ప్రవేశపెట్టిన ఫాల్కన్ రాకెట్..
Mission Drishti | భారతీయ అంతరిక్ష రంగం మరో కీలక మైలురాయిని అధిగమించింది. బెంగళూరుకు చెందిన స్టార్టప్ గెలాక్సీ స్పేస్ రూపొందించిన ‘మిషన్ దృష్టి’ శాటిలైట్‌ను ఆదివారం స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ ద్వారా విజయవంతంగా నింగిలోకి పంపింది.
Mission Drishti | భారతీయ అంతరిక్ష రంగం మరో కీలక మైలురాయిని అధిగమించింది. బెంగళూరుకు చెందిన స్టార్టప్ గెలాక్సీ స్పేస్ రూపొందించిన ‘మిషన్ దృష్టి’ శాటిలైట్‌ను ఆదివారం స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ ద్వారా విజయవంతంగా నింగిలోకి పంపింది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ ఉపగ్రహం గ్లోబల్ లాంచ్ ప్లాట్‌ఫామ్‌పై నుంచి ప్రయోగించడం విశేషం. 190 కిలోల బరువుతో రూపొందిన ‘మిషన్ దృష్టి’ ఉపగ్రహం ప్రైవేట్ రంగంలో భారత్‌లో తయారు చేసిన అతిపెద్ద ఉపగ్రహంగా గుర్తింపు పొందింది.
Liftoff! pic.twitter.com/HmS624ScKO
— SpaceX (@SpaceX) May 3, 2026
అయితే, పరిమాణంలోనే కాకుండా వినూత్న ఇమేజింగ్ సాంకేతికతలోనూ దీనికి ప్రత్యేకత ఉన్నది. ఇందులో ‘ఆప్టోసార్’ (OptoSAR) అనే హైబ్రిడ్ వ్యవస్థను వినియోగించారు. ఇది ఆప్టికల్ ఇమేజింగ్, సింథటిక్ అపర్చర్ రాడార్ (SAR) సాంకేతికతలను ఒకే ప్లాట్‌ఫామ్‌లో సమన్వయం చేస్తుంది. సాధారణంగా ఉపగ్రహాలు ఈ రెండు వ్యవస్థల్లో ఏదో ఒకదానిపై ఆధారపడుతుంటాయి. ఆప్టికల్ వ్యవస్థ ఫొటోల మాదిరిగా స్పష్టమైన, రంగుల చిత్రాలను ఇస్తాయి. కానీ, మేఘాలు.. చీకటి సమయంలో పనిచేయవు.
రాడార్ వ్యవస్థలు మాత్రం మేఘాలను దాటి, రాత్రి వేళల్లో పనిచేస్తాయి. కాని వాటి చిత్రాలు అంత స్పష్టంగా రావు. ఈ లోపాన్ని అధిగమించేలా ఆప్టోసార్ వ్యవస్థ ఒకేసారి ఆప్టికల్, రాడార్ డేటాను సేకరించి, వాటిని సమ్మిళితం చేసి సమగ్ర ఫొటోను పంపుతుంది. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా, పగలు-రాత్రి తేడా లేకుండా స్పష్టమైన సమాచారం అందుతుంది. ఈ సాంకేతికత సాధారణ ఉపగ్రహాల కంటే మూడింతలు ఎక్కువ ఉపయోగకరమైన డేటాను అందిస్తుంది. ప్రకృతి విపత్తుల నిర్వహణ, వ్యవసాయం, సరిహద్దు భద్రత, మౌలిక వసతుల ప్రణాళిక తదితర విభాగాల్లో ఈ ఉపగ్రహం కీలక పాత్ర పోషించనుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మిషన్, దేశ అంతరిక్ష యాత్రలో ఓ కీలక ఘట్టంగా అభివర్ణించారు.
Falcon 9’s first stage has landed on Landing Zone 4 pic.twitter.com/dH1XDKKNRI
— SpaceX (@SpaceX) May 3, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు
- ●Horoscope | ఆగస్టు 20 రాశిఫలాలు.. గురుడి ప్రభావంతో వారికి శుభ ఖర్చులు ఉంటాయి!
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?
- ●Telangana Movie Ticket Prices | సినిమా టికెట్ ధరలపై తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఏసీ, నాన్-ఏసీ థియేటర్లలో కొత్త రేట్లు ఇవే!

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు

Horoscope | ఆగస్టు 20 రాశిఫలాలు.. గురుడి ప్రభావంతో వారికి శుభ ఖర్చులు ఉంటాయి!





