Climate Change | పెరుగుతున్న వేడి.. కరుగుతోన్న మంచు..! పర్వత ప్రాంతాల్లో వాతావరణ మార్పులు..!
Climate Change | ప్రపంచవ్యాప్తంగా వేగంగా వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పర్వతాలు వేడెక్కుతున్నాయి.. మంచు కరుగుతోంది.. నదుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది.. ప్రస్తుతం ఈ సంక్షోభం పర్వత ప్రాంతాల్లోనూ కనిపిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితో కోట్లాది మంది జీవనంపై పెను ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
Climate Change | ప్రపంచవ్యాప్తంగా వేగంగా వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పర్వతాలు వేడెక్కుతున్నాయి.. మంచు కరుగుతోంది.. నదుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది.. ప్రస్తుతం ఈ సంక్షోభం పర్వత ప్రాంతాల్లోనూ కనిపిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితో కోట్లాది మంది జీవనంపై పెను ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇటీవల శాస్త్రవేత్తలు చేసిన ఓ అధ్యయనం ప్రకారం.. మైదాన ప్రాంతాల కంటే పర్వత ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. ఎత్తైన ప్రాంతాల్లో ప్రతి పదేళ్లకు సగటున 0.21 డిగ్రీల సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతోంది. దీనితో పాటు మంచు కురువడం తగ్గిపోతోంది. ఫలితంగా వర్షాల సమతుల్యత దెబ్బతింటోంది. ఎత్తు పెరిగే కొద్దీ వాతావరణ మార్పుల ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని ఈ పరిశోధన పేర్కొంటోంది. దీన్నే ‘ఎలివేషన్ డిపెండెంట్ క్లైమేట్ చేంజ్’గా పిలుస్తున్నారు.
కరుగుతున్న హిమనీదాలు.. నీటి సంక్షోభం ముప్పు..
రాకీ పర్వతాలు, ఆల్ప్స్, ఆండీస్, టిబెటన్ పీఠభూమి వంటి ప్రధాన పర్వత శ్రేణుల్లోని డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. 1980 నుంచి 2020 మధ్యకాలంలో పర్వత ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు వేగంగా పెరిగినట్టు వెల్లడైంది. ఒకప్పుడు మంచు పడే ప్రాంతాల్లో ఇప్పుడు వర్షం పడుతోంది. దాంతో మంచు నిల్వలు తగ్గి, హిమనదాలు వేగంగా కరుగుతున్నాయి. హిమనదాలు పూర్తిగా కరిగే ముందు కొంతకాలం నదుల్లో నీరు పెరిగే అవకాశం ఉన్నా.. తర్వాతి రోజుల్లో నీటి లభ్యత తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
వర్షపాతం అస్తవ్యస్తం..
పర్వత ప్రాంతాల్లో వర్షాల చక్రం పూర్తిగా మారిపోయింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో దీర్ఘకాలిక వర్షాభావం ఏర్పడుతోంది. అకస్మాత్తుగా కురిసే భారీ వర్షాలు, క్లౌడ్ బరస్ట్, ఆకస్మిక వరదలు పెరిగాయి. ఇటీవలి సంవత్సరాల్లో ఆసియాలోని అనేక పర్వత ప్రాంతాల్లో జరిగిన వరదలు, కొండచరియలు విరిగిపడే ఘటనలకు ఇదే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వాతావరణ అసమతుల్యత స్థానిక ప్రజలు, వ్యవసాయం, మౌలిక సదుపాయాలకు పెద్ద ముప్పుగా మారింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు జీవ వైవిధ్యంపై కూడా ప్రభావం చూపుతున్నాయి. చల్లని వాతావరణంపై ఆధారపడే మొక్కల మనుడగ ఇబ్బందికరంగా మారగా.. జంతువులు ఎత్తైన ప్రాంతాల వైపు తరలిపోతున్నాయి. కానీ, పర్వత శిఖరాలకు చేరుకున్న తర్వాత వాటికి వెళ్లేందుకు మరో దారి కనిపించడం లేదు. దీంతో అనేక జాతులు అంతరించే ప్రమాదం పెరిగింది. పర్వత ప్రాంతాలు, ఆర్కిటిక్ ప్రాంతాలు వాతావరణ మార్పులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అక్కడ మంచు, పర్యావరణ వ్యవస్థలు రెండూ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు.
భారత్‌కు హెచ్చరికలు..
హిమాలయ ప్రాంతంలో పెరుగుతున్న వేడి భారత్‌కు తీవ్ర ప్రమాదంగా మారుతోంది. గంగా, యమునా, బ్రహ్మపుత్ర, సింధు వంటి ప్రధాన నదులు హిమనదాలు, మంచుపై ఆధారపడి ఉన్నాయి. హిమనదాలు వేగంగా కరిగిపోతే దీర్ఘకాలంలో నదుల్లో నీటి ప్రవాహం తగ్గే అవకాశం ఉంది. ఇది వ్యవసాయం, తాగునీరు, జలవిద్యుత్ ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పర్వత ప్రాంతాల్లో జరుగుతున్న వాతావరణ మార్పులను ఇకపై ప్రపంచ విధానాలు.. స్థానిక ప్రణాళికల్లో కేంద్రబిందువుగా మార్చాలని అవసరం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






