Artificial intelligence | మైండ్‌ని చదవొచ్చు..! మనసులోని మాటలు తెరపై ఆవిష్కృతం
Artificial intelligence | మనసు (Mind) అనేది ఆలోచనల ప్రవాహం. మనిషి మెదడులో ప్రతిక్షణం విద్యుత్ తరంగాల్లా సంకేతాలు ప్రవహిస్తూనే ఉంటాయి. ఈ సంకేతాలను అర్థం చేసుకోవడం ఇప్పటివరకు అత్యంత క్లిష్టంగా భావిస్తూ వచ్చారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో మెదడు సంకేతాలను డీకోడ్ చేసి మాటలుగా, వాక్యాలుగా, చిత్రాలుగా మార్చే సాంకేతికత రూపుదిద్దుకుంటున్నది.
Artificial intelligence | మనసు (Mind) అనేది ఆలోచనల ప్రవాహం. మనిషి మెదడులో ప్రతిక్షణం విద్యుత్ తరంగాల్లా సంకేతాలు ప్రవహిస్తూనే ఉంటాయి. ఈ సంకేతాలను అర్థం చేసుకోవడం ఇప్పటివరకు అత్యంత క్లిష్టంగా భావిస్తూ వచ్చారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో మెదడు సంకేతాలను డీకోడ్ చేసి మాటలుగా, వాక్యాలుగా, చిత్రాలుగా మార్చే సాంకేతికత రూపుదిద్దుకుంటున్నది.
మనసులోని మాటలు తెరపై

అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో 52 ఏళ్ల మహిళపై నిర్వహించిన పరిశోధన ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. 19 సంవత్సరాల క్రితం స్ట్రోక్‌తో పక్షవాతంతో బాధపడుతున్న ఆమె స్పష్టంగా మాట్లాడలేకపోతోంది. శస్త్రచికిత్స ద్వారా మెదడులోని ముందుభాగం (motor cortex)లో మైక్రోఎలక్ట్రోడ్ అరే అమర్చారు. ఈ ఎలక్ట్రోడ్లు న్యూరాన్ల నుంచి వచ్చే విద్యుత్ సంకేతాలను రికార్డ్ చేసి కంప్యూటర్‌కి పంపిస్తాయి. అక్కడ మెషీన్ లర్నింగ్ అల్గారిథంలు ఆ సంకేతాలను విశ్లేషించి, ఆమె ఊహించి మాట్లాడే పదాలను స్క్రీన్‌పై టెక్ట్స్‌గా చూపించాయి. పరిశోధనలో ఆమెతో పాటు ఏఎల్ఎస్ (Amyotrophic Lateral Sclerosis) రోగులు ముగ్గురు కూడా పాల్గొన్నారు. మాటల ద్వారా కమ్యూనికేట్ చేయలేని వారికి సహాయం చేయడం ఈ పరిశోధన ప్రధాన లక్ష్యం. శాస్త్రవేత్తలు దీన్ని ‘మైండ్ రీడింగ్‌కు అత్యంత దగ్గరగా వచ్చిన ప్రయత్నం’గా అభివర్ణించారు.
వాణిజ్య వినియోగం దిశగా..

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, డేవిస్‌కి చెందిన న్యూరో ఇంజినీర్ మైత్రేయీ వైరాగ్కర్ ప్రకారం.. రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఈ సాంకేతికత వాణిజ్య వినియోగానికి సిద్ధమయ్యే అవకాశముంది. ఈ రంగంలో ఎలాన్ మస్క్ స్థాపించిన న్యూరాలింక్ వంటి సంస్థలు ఇప్పటికే బ్రెయిన్ చిప్స్ అభివృద్ధిపై పని చేస్తున్నాయి. బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేసెస్ (Brain-Computer Interfaces – BCIs) కొత్తవి కావు. 1969లో అమెరికన్ న్యూరోసైంటిస్ట్ ఎబెర్హార్డ్ ఫెట్జ్ (Eberhard Fetz) కోతులపై చేసిన ప్రయోగాల్లో ఒకే న్యూరాన్ యాక్టివిటీ ఆధారంగా సూదిని కదిలించడం సాధ్యమని చూపించారు. స్పానిష్ శాస్త్రవేత్త జోస్ డెల్గాడో (Jose Delgado) కోపంతో ఉన్న బుల్ మెదడును రిమోట్ స్టిమ్యులేషన్ ద్వారా నియంత్రించగలిగారు.
మాటలు డీకోడ్..

2021లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో పరిశోధకులు క్వాడ్రిప్లీజిక్ (Quadriplegic) కోసం ఒక కొత్త ప్రయత్నం చేశారు. ఆ వ్యక్తి చేతి చలనం బట్టి ఏం చెప్పదలచుకున్నారో తెలుసుకోగలిగారు. నిమిషంలో 18 పదాలను రాయగలిగారు. 2024లో 45 ఏళ్ల ఏఎల్ఎస్ రోగి అటెంప్టెడ్ స్పీచ్ ఆధారంగా నిమిషానికి 32 పదాలను 97.5 శాతం ఖచ్చితత్వంతో డీకోడ్ చేయగలిగారు. 2025లో మైత్రేయీ వైరాగ్కర్ బృందం మాటలతో పాటు పిచ్ (Pitch), లయ (Rhythm), వేగం (Speed) వంటి నాన్-వర్బల్ అంశాలను కూడా డీకోడ్ చేయగలిగింది. రోగి స్వరంలో క్వశ్చన్ నోట్, సాంగ్ పాడడం వంటి అంశాలను కూడా వ్యవస్థ గుర్తించింది.
ఇన్నర్ స్పీచ్..

ఇటీవలి పరిశోధనల్లో ఇన్నర్ స్పీచ్, అంటే మనసులోనే మాటలను రియల్ టైమ్లో డీకోడ్ చేయగలమా అని పరీక్షించారు. రంగుల ఆకారాలను లెక్కించమని చెప్పినప్పుడు, వ్యక్తి మనసులో లెక్కపెట్టే సంఖ్య పదాలను మోటార్ కార్టెక్స్‌లో గుర్తించి సుమారు 74 శాతం ఖచ్చితత్వంతో రియల్ టైమ్లో డీకోడ్ చేయగలిగారు. అయితే, పూర్తిగా స్వేచ్ఛగా ఆలోచించినప్పుడు డీకోడ్ చేసిన వాక్యాలు కొన్నిసార్లు అర్థరహితంగా మారాయి. పూర్తి స్థాయి మైండ్ రీడింగ్ సాధ్యపడలేదు. అలాగే, జపాన్‌లోని యూ టకాగి (Yu Takagi) మరియు ఇతర పరిశోధకులు ఎఫ్ఎంఆర్ఐ స్కాన్ల ఆధారంగా వ్యక్తి చూసిన చిత్రాలను ఏఐతో పునర్నిర్మించారు. జనరేటివ్ ఏఐ మోడల్ స్టేబుల్ డిఫ్యూజన్ సహాయంతో మెదడులో నమోదైన డేటాను ఇమేజ్లుగా మళ్లీ సృష్టించారు. ఆక్సిపిటల్ లోబ్ మనం చూసే రంగులు, ఆకారాలు, లైట్లను గుర్తిస్తుంది. ఇది మెదడు వెనుక భాగంలో ఉంటుంది. మనం చూసే దృశ్యాలను మొదటగా ప్రాసెస్ చేస్తుంది.
మనం చూసే రంగు ఏంటీ, ఆకారం ఏంటీ, కాంతి ఎలా ఉంది, ఇలా అన్ని అంశాలను ప్రాసెస్ చేయడం దీని ప్రత్యేకత. టెంపోరల్ లోబ్ చెవి దగ్గరలో ఉంటుంది. ‘ఇది ఆపిల్. ఇది ఒక పండు. ఇది తినేందుకు పనికి వస్తుంది’ అని గుర్తిస్తుంది. శాస్త్రవేత్తలు తాజా పరిశోధనల్లో మనిషి మెదడులో చూసిన దృశ్యాన్ని కూడా పునర్నిర్మించగలిగే సాంకేతికతను అభివృద్ధి చేశారు. జపాన్లో జరిపిన ఒక పరిశోధనలో శాస్త్రవేత్తలు ఎఫ్ఎంఆర్ఐ స్కాన్లను ఉపయోగించి వారు చూసిన చిత్రాలను ఏఐతో తిరిగి సృష్టించగలిగారు. మరో అధ్యయనంలో సంగీతాన్ని గుర్తించడానికి కూడా ప్రయత్నించారు. 2025లో యూ టకాగి బృందం ఎఫ్ఎంఆర్ఐ స్కాన్ల ద్వారా వ్యక్తి విన్న సంగీతాన్ని ఏఐతో పునర్మించేందుకు ప్రయత్నించింది. చిత్రాల కంటే ఇది క్లిష్టమైన ప్రక్రియ అయినప్పటికీ, మ్యూజిక ప్రాథమిక లక్షణాలను గుర్తించగలిగారు. ఇది సంగీత ప్రాసెసింగ్ మెదడులో చిత్రాల కంటే భిన్నంగా జరుగుతుందని వెల్లడించారు.
భవిష్యత్ అవకాశాలు, నైతిక ప్రశ్నలు..
ఈ సాంకేతికత భవిష్యత్లో విస్తృత ప్రయోజనాలకు ఉపయోగపడవచ్చని నిపుణులు భావిస్తున్నారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న రోగుల హాల్యూసినేషన్స్‌ని అర్థం చేసుకోవడం, జంతువుల అనుభవాలను విశ్లేషించడం, మనుషుల కలలను పునర్నిర్మించడం వంటి వాటికి ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. అంతేకాకుండా, నేరుగా బ్రెయిన్-టు-బ్రెయిన్ కమ్యూనికేషన్ సాధ్యమయ్యే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే, వ్యక్తిగత గోప్యత, డేటా భద్రత, మానవ హక్కులు వంటి కీలక నైతిక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మెదడు సమాచారాన్ని ఉపయోగించే ఈ విధానాలపై స్పష్టమైన నియంత్రణ అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వినోదం కోసం నేరుగా మెదడులో విజువల్, ఆడిటరీ అనుభవాలను సృష్టించడం సిద్ధాంతపరంగా సాధ్యమే అయినా, సాంకేతిక పరిమితుల వల్ల ఇంకా 10–20 సంవత్సరాల సమయం పట్టవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి మెదడును అర్థం చేసుకునే దిశగా కొత్త యుగానికి నాంది పలుకబోతోంది. ఈ శక్తివంతమైన సాంకేతికతను మానవ ప్రయోజనాల కోసం బాధ్యతాయుతంగా ఉపయోగించడం సమాజానికి ముందున్న పెద్ద సవాల్‌గా మారుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల
జులై 26, 2026

Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ
జులై 26, 2026

CWG 2026 | గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్.. వెయిట్లిఫ్ట్లో భారత్‌కు సిల్వర్..!
జులై 26, 2026
తాజావార్తలు
- ●Rice Business Success | టీసీఎస్ జాబ్ రిజెక్ట్ చేసి.. బియ్యం అమ్మి ఏటా రూ.25 లక్షలు సంపాదిస్తున్నాడు!
- ●Mumbai Cop Vinod Kalukhe | సీజేపీ ఆందోళనల్లో స్పెషల్ అట్రాక్షన్: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ముంబై 'పూకీ' కాప్.. ఇతని స్టోరీ ఇదే!
- ●Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల
- ●Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా
- ●PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!
- ●Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ

Rice Business Success | టీసీఎస్ జాబ్ రిజెక్ట్ చేసి.. బియ్యం అమ్మి ఏటా రూ.25 లక్షలు సంపాదిస్తున్నాడు!

Mumbai Cop Vinod Kalukhe | సీజేపీ ఆందోళనల్లో స్పెషల్ అట్రాక్షన్: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ముంబై 'పూకీ' కాప్.. ఇతని స్టోరీ ఇదే!

Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల

Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా



