NASA | నాసా సరికొత్త చరిత్ర.. అపోలో-13 రికార్డు బద్దలు..
NASA | అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ సరికొత్త రికార్డును సృష్టించింది. నాసా ఆర్టెమిస్-2 మిషన్‌తో మానవులు ఇప్పటి వరకు భూమి నుంచి ప్రయాణించి దూరానికి మించి ప్రయాణించారు. క్రమంలో 1970లో చేపట్టిన అపోలో 13 మిషన్ సెట్ చేసిన రికార్డును సైతం బద్దలు కొట్టింది.
NASA | అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ సరికొత్త రికార్డును సృష్టించింది. నాసా ఆర్టెమిస్-2 మిషన్‌తో మానవులు ఇప్పటి వరకు భూమి నుంచి ప్రయాణించి దూరానికి మించి ప్రయాణించారు. క్రమంలో 1970లో చేపట్టిన అపోలో 13 మిషన్ సెట్ చేసిన రికార్డును సైతం బద్దలు కొట్టింది. నాసా తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రుడికి చేరువవుతున్న సమయంలో వ్యోమగాములకు స్పేస్‌షిప్ విండోస్ నుంచి చంద్రుడు కనువిందు చేశాడు. ఇప్పటి వరకు మనుషులెవరూ ఇంత సమీపంగా చూడని చంద్రుడి ఆవలి భాగాన్ని (ఫార్ సైడ్) వీక్షించే అవకాశం ఈ మిషన్‌తో దక్కింది.
సుమారు ఆరు గంటల పాటు కొనసాగిన ఈ ఫ్లైబై మిషన్‌లో అత్యంత కీలక ఘట్టంగా నాసా వర్గాలు పేర్కొన్నాయి. ఈ చారిత్రాత్మక ప్రయాణంలో ముగ్గురు అమెరికన్ వ్యోమగాములతో పాటు ఒక కెనడియన్ వ్యోమగామి పాలుపంచుకున్నారు. భవిష్యత్తులో మళ్లీ చంద్రుడిపై మనుషులను దింపాలన్న నాసా లక్ష్యంలో భాగంగానే ఈ మిషన్ చేపట్టింది. వచ్చే రెండు సంవత్సరాల్లో చంద్రుడి దక్షిణ ధృవం ప్రాంతంలో మనుషులను దింపడం లక్ష్యంగా పెట్టుకుంది.
రికార్డు విషయానికి వస్తే..
ఆర్టెమిస్-2 మిషన్‌లో పాల్గొంటున్న వ్యోమగాములు భూమి నుంచి అత్యంత దూరం ప్రయాణించిన మానవులుగా నిలిచారు. సోమవారం మధ్యాహ్నం 1:57 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 11:27 గంటలకు) ఈ రికార్డు నమోదైంది. నాసా ‘ఎక్స్’ వేదికపై వెల్లడించిన వివరాల ప్రకారం.. చంద్రుడి ఆవలి వైపు చుట్టూ తిరిగే ఈ ప్రయాణంలో వ్యోమగాములు గరిష్టంగా 2,52,752 మైళ్ల దూరం వరకు వెళ్లనున్నారు. సుమారు 10 రోజుల పాటు కొనసాగిన ఈ మిషన్ అనంతరం.. ఏప్రిల్ 10న అంతరిక్ష నౌక భూమికి తిరిగి వచ్చి పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండింగ్ అవుతుంది. భవిష్యత్తులో శాశ్వత చంద్ర స్థావరం ఏర్పాటు దిశగా ఇది కీలక ముందడుగు అని నాసా పేర్కొంది. 2028 నాటికి చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతానికి సమీపంలో మనుషులను దింపడం లక్ష్యమని వెల్లడించింది.
LIVE: Watch with us as the Artemis II astronauts make their closest approach to the Moon, traveling farther from Earth than ever before. https://t.co/Zpy7GdTqA8
— NASA (@NASA) April 6, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






