త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS Australia | నిన్న.. నేడు.. రేపు.. కేసీఆర్ వెంటే.. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా స‌రికొత్త నినాదం

BRS Australia | ‘నిన్న‌.. నేడు, రేపు.. కేసీఆర్ (KCR) వెంటే’ అనే నినాదంతో కేసీఆర్ మూడోసారి ముఖ్య‌మంత్రి అయ్యేవ‌ర‌కు క‌ష్ట‌ప‌డ‌తామ‌ని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయ‌కులు ప్ర‌క‌టించారు. నాగేందర్ రెడ్డి కాసర్ల (Nagendar Reddy Kasarla) మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో గోస పడుతున్నారన్నారు.

S

News | Published On May 3, 2026, 6.35 pm IST

BRS Australia | నిన్న.. నేడు.. రేపు.. కేసీఆర్ వెంటే.. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా స‌రికొత్త నినాదం
Advertisement
  • మూడోసారి సీఎం అయ్యేదాకా క‌ష్ట‌ప‌డ‌తాం
  • అది మా బాధ్య‌త‌గా భావిస్తం
  • తెలంగాణ ప్ర‌జ‌ల అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉంటం
  • బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకుడు నాగేందర్ రెడ్డి కాసర్ల వెల్ల‌డి

BRS Australia | త్రినేత్ర‌.న్యూస్‌: ‘నిన్న‌.. నేడు, రేపు.. కేసీఆర్ (KCR) వెంటే’ అనే నినాదంతో కేసీఆర్ మూడోసారి ముఖ్య‌మంత్రి అయ్యేవ‌ర‌కు క‌ష్ట‌ప‌డ‌తామ‌ని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయ‌కులు ప్ర‌క‌టించారు. ఈ కార్యక్రమం ద్వారా కేసీఆర్, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీకి తమ అచంచల మద్దతును తెలియ‌జేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకుడు నాగేందర్ రెడ్డి కాసర్ల (Nagendar Reddy Kasarla) మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో గోస పడుతున్నారన్నారు.

పార్టీ సిద్ధాంతాల‌ను ప్ర‌జల్లోకి తీసుకెళ్తం..

కాంగ్రెస్ ప్ర‌భుత్వ పాల‌నలో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌న్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు తాము నిరంతరం కష్టపడతామని స్పష్టం చేశారు. నాటి ఉద్యమం నుండి మా మా ప్రస్థానం మొద‌లైంద‌ని, పార్టీ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. బీఆర్ఎస్‌ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం బాధ్యతగా భావిస్తామ‌ని చెప్పారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల నుంచి సాధారణ ఎన్నికల వరకు ప్రతి ఎన్నికలోనూ చురుకుగా ప్రచారం నిర్వహించామ‌ని తెలిపారు. తాము భవిష్యత్తులో కూడా అదే ఉత్సాహంతో ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు.

పార్టీ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్‌ ఆస్ట్రేలియా బృందం ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సాయిరాం ఉప్పు, వినయ్ చెలుపాటి, ఉదయ్ సింహా రెడ్డి, సూర్య రావు, సనిల్ రెడ్డి, సతీష్ పులిపాక, అశోక్ ఈగ, నితీష్ గౌడ్, వెంకట్, భాస్కర్, విశ్వనాథ్‌, సంజూ రెడ్డి, తెలంగాణ సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement