CM Revanth Reddy | దేశంలోనే తెలంగాణ మోడల్ ను ప్రకటించి నెంబర్ 1 గా నిలబెడతాం: రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | దేశంలోనే తెలంగాణను ఎన్నో రంగాల్లో అగ్రగామిగా నిలిపామని, విద్య, వైద్యంలోనూ నెంబర్ వన్‌గా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. దేవరకొండ (Devarakonda)లో జరిగిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవసభలో పాల్గొని ఆయన ప్రసంగించారు.
CM Revanth Reddy | దేశంలోనే తెలంగాణ (Telangana) మోడల్‌ను ప్రకటించి, నెంబర్ వన్‌గా నిలబెడతామని ముఖ్యమంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రకటించారు. దేవరకొండ (Devarakonda)లో జరిగిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit)ను ఏర్పాటు చేస్తున్నామని, దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు వస్తారని చెప్పారు. వరి ఉత్పత్తిలో తెలంగాణను దేశంలో నెంబర్ వన్ చేశామని పేర్కొన్నారు. గంజాయి నిర్మూలనలో సైతం తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ చేశామన్నారు. విద్య, వైద్యంలోనూ తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 చేస్తామని ప్రకటించారు.
కాంగ్రెస్ పాలనలోనే తెలంగాణకు మంచి రోజులు వచ్చాయని స్పష్టీకరణ
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాతే తెలంగాణకు మంచి రోజులు వచ్చాయని స్పష్టం చేశారు. తెలంగాణలోని కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణి చేస్తామని చెప్పారు. మంచి పాలనలో ప్రజలకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, సన్న బియ్యం, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్లు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు వచ్చాయని వివరించారు. ఏదిఏమైనా ఎస్ఎల్‌బీసీని పూర్తి చేస్తామన్నారు.
దేవరకొండ అభివృద్ధి తమ బాధ్యతేనన్న సీఎం
దేవరకొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. దేవరకొండ గడ్డ కాంగ్రెస్ పార్టీ కి అడ్డా అని కార్యకర్తలు నిరూపించారని చెప్పారు. నల్గొండ జిల్లాకు చైతన్యం ఉందని, ఇక్కడి గాలి, నీరుకు పోరాట పౌరుషం ఉందని పేర్కొన్నారు. నిజాం నవాబుకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి తరిమికొట్టిన ప్రాంతం ఇదని గుర్తు చేశారు. దేవరకొండలో జైపాల్ రెడ్డి చదువుకున్న పాఠశాలకు రూ. ఆరు కోట్ల నిధులు ఇస్తానని తెలిపారు. వెంకటేశ్వరస్వామి టెంపుల్ ను పూర్తి చేసే బాధ్యత తనదేనని, దేవరకొండ కు నర్సింగ్ కాలేజీ మంజూరు చేస్తామని, రోడ్ల నిర్మాణంపైన దృష్టి సారిస్తామని, నెలాఖరులోపు మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ , సీతక్కను పంపిస్తానని, మద్దిమడుగు లో సేవాలాల్ మహరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తానని, పుణ్యక్షేత్రం గా మద్దిమడుగును అభివృద్ధి చేస్తామని వరాల జల్లు కురిపించారు. రాబోయే పది ఏళ్లు అధికారంలో ఉంటామని, ధైర్యంగా ఉండాలని, అభివృద్ధి పథంలో నడిపిస్తామని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్‌పై ధ్వజం
రెండేళ్ల క్రితం ఓటునే ఆయుధంగా మార్చి పదేళ్లు తెలంగాణ ను పట్టి పీడించిన నాయకుల గడీలను ప్రజలు కుప్పకూల్చి ఇందిరమ్మ రాజ్యం తెచ్చారని అన్నారు. తెలంగాణ వస్తే డబల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ఒకాయన నమ్మబలికాడని, కానీ తాను మాత్రం రూ. 2000 కోట్లు ఖర్చు పెట్టి పదెకరాలలో 150 గదుల గడీని నిర్మించుకున్నాడని ధ్వజమెత్తారు. లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని కేసీఆర్ రైతు నెత్తి మీద అప్పు పెట్టి ఫామ్ హౌస్ లో పడుకున్నాడని నిప్పలు చెరిగారు. రైతులకు కాదు కేసీఆర్ ఇంట్లో కరెంటు లేదని, జనం ఫీజులు పీకేశారని, కాని రాష్ట్రంలో రైతులకు మాత్రం కరెంటు ఉందన్నారు. ఇద్దరు సర్పంచ్ లు, నలుగురు వార్డు మెంబర్లను కూర్చోబెట్టుకుని కేసీఆర్ మాట్లాడుతూ మంచి రోజులు వస్తాయని చెబుతున్నారని అన్నారు. కేసీఆర్‌కు అవకాశం వస్తే ముంచే రోజులు వస్తాయని ఎద్దేవా చేశారు. కొడుకు, బిడ్డ, అల్లుడు తెలంగాణ ను నాలుగు వైపుల నుంచి పీక్కు తిన్నారని దుయ్యబట్టారు. రూ. ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసినా కేసీఆర్ ఆశ తీరలేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అధికారం పోయిందని, పార్లమెంటు లో గుండు సున్నా వచ్చిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు దొరకలేదని అన్నారు. జూబ్లీహిల్స్ లో రెఫరెండం అంటే బోరబండ దగ్గర బీఆర్ఎస్ ను బండకేసి కొట్టారని వ్యాఖ్యానించారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



