త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Murdered | నాన్‌వెజ్ వండ‌లేద‌న్నందుకు కొడ‌వ‌లి విసిరిన భార్య‌.. మెడ న‌రం తెగి భ‌ర్త మృతి

Murdered | నాన్‌వెజ్ విష‌యంలో మొద‌లైన చిన్నపాటి గొడ‌వ ఏకంగా భ‌ర్త ప్రాణాల మీద‌కి తెచ్చింది. భార్య కొడ‌వ‌లి (Sickle) విస‌ర‌డంతో అది భ‌ర్త మెడ న‌రానికి తాకి తీవ్ర రక్త‌స్రావ‌మైంది. విల‌విల్లాడుతూ 15 నిమిషాల వ్య‌వ‌ధిలోనే భర్త ప్రాణాలు కోల్పోయిన విషాద ఘ‌ట‌న ఇది.

S

News | Published On Apr 27, 2026, 1.23 pm IST

Murdered | నాన్‌వెజ్ వండ‌లేద‌న్నందుకు కొడ‌వ‌లి విసిరిన భార్య‌.. మెడ న‌రం తెగి భ‌ర్త మృతి
Advertisement

Murdered | త్రినేత్ర‌.న్యూస్‌: నాన్‌వెజ్ విష‌యంలో మొద‌లైన చిన్నపాటి గొడ‌వ ఏకంగా భ‌ర్త ప్రాణాల మీద‌కి తెచ్చింది. భార్య కొడ‌వ‌లి (Sickle) విస‌ర‌డంతో అది భ‌ర్త మెడ న‌రానికి తాకి తీవ్ర రక్త‌స్రావ‌మైంది. విల‌విల్లాడుతూ 15 నిమిషాల వ్య‌వ‌ధిలోనే భర్త ప్రాణాలు కోల్పోయిన విషాద ఘ‌ట‌న ఇది. కామారెడ్డి (Kamareddy) జిల్లా కేంద్రంలో శనివారం అర్ధరాత్రి ఈ ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది.

కామారెడ్డి పట్టణ సీఐ నరహరి వివరాల ప్రకారం.. గోసంగికాలనీకి చెందిన కోదండం శివాజీ (Shivaji) (28), లక్ష్మి (Lakshmi)కి 2017లో వివాహం జ‌రిగింది. వీరికి ఐదేళ్లు, రెండేళ్ల లోపు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లక్ష్మి ఇళ్లలో పనికి వెళ్తుండగా శివాజీ పాత సామాన్ల వ్యాపారం చేస్తుండేవాడు. ఈ క్ర‌మంలో ప‌ని ముగించుకొని శనివారం రాత్రి శివాజీ ఇంటికి చేరుకున్నాడు. వ‌చ్చిరాగానే నాన్‌వెజ్‌ ఎందుకు వండలేదని భార్యపై ఆగ్ర‌హించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడ‌వ తారాస్థాయికి చేర‌గా చుట్టుపక్కల వారు వచ్చి సముదాయించారు. మళ్లీ తనను తిట్టడంతో కోపోద్రిక్తురాలైన లక్ష్మి కొడవలిని శివాజీపైకి విసిరింది. అది అతని మెడ నరానికి తగిలి తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయాడు.

భార్య క‌న్నీటి ప‌ర్యంతం..

క్షణికావేశంలో భర్తనే చంపుకొన్నానని.. తాను జైలుకు వెళితే పిల్లలను ఎవరు చూసుకుంటారని ల‌క్ష్మి బోరున విల‌పించింది. ఇద్దరు బిడ్డలను హ‌త్తుకొని కన్నీటిపర్యంతమయ్యారు. ఘటనా స్థలానికి చేరురుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. శివాజీ సోదరుడు సూరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

Advertisement
Advertisement