త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thalasani Srinivas Yadav | కేసీఆర్ అంటే కాంగ్రెస్‌కు భ‌య‌మెందుకు: మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Thalasani Srinivas Yadav | కేసీఆర్ (KCR) అంటే కాంగ్రెస్‌ (Congress)కు అంత భ‌య‌మెందుక‌ని.. కేసీఆర్ జగిత్యాల సభ రోజే రైతు బంధు నిధులు విడుదల చేయడం, మేడిగడ్డ రిజర్వాయర్ సందర్శన ఎందుకు? అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Thalasani Srinivas Yadav) ప్ర‌శ్నించారు. జగిత్యాల (Jagtial) సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళుతూ మార్గమధ్యలో కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఆయ‌న కాసేపు ఆగారు.

S

News | Published On Apr 19, 2026, 3.08 pm IST

Thalasani Srinivas Yadav | కేసీఆర్ అంటే కాంగ్రెస్‌కు భ‌య‌మెందుకు: మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
Advertisement

Thalasani Srinivas Yadav: త్రినేత్ర‌.న్యూస్‌: కేసీఆర్ (KCR) అంటే కాంగ్రెస్‌ (Congress)కు అంత భ‌య‌మెందుక‌ని.. కేసీఆర్ జగిత్యాల సభ రోజే రైతు బంధు నిధులు విడుదల చేయడం, మేడిగడ్డ రిజర్వాయర్ సందర్శన ఎందుకు? అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్ర‌శ్నించారు. జగిత్యాల (Jagtial) సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళుతూ మార్గమధ్యలో కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఆయ‌న కాసేపు ఆగారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు.

జ‌గిత్యాలలో రేప‌టి కేసీఆర్ సభ ఘనంగా జరుగుతుంద‌న్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావ‌ట్లేద‌ని, ప్రజల్లోకి రావడం లేదని పదేపదే ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నార‌ని.. మ‌రి ఇప్పుడు కేసీఆర్ బయటకు వస్తుంటే ఎందుకు వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. పదేండ్ల కేసీఆర్ పాలన దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన‌ద‌న్నారు. రైతులకు పంట పెట్టుబడి కింద ఎకరానికి 10 వేలు చొప్పున రైతుబంధు సాయం అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.

మీరు అప్పు చేసి ప్ర‌జ‌ల‌కు ఏం చేశారు?

ఆడబిడ్డ పెండ్లికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్ లు కేసీఆర్ ప్రభుత్వం అందించింది. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టి లో ఉంచుకొని కేసీఆర్ ప్ర‌భుత్వం పని చేసింది. కేసీఆర్ అప్పులు చేశారని కాంగ్రెస్‌ విమర్శిస్తోంది. అదే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాలలో 3.50 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజలకు ఏం చేశారో చెప్పాలి అని డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ వంటి రిజర్వాయర్ల‌ను నిర్మించి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించాం. జిల్లాకు ఒక కలెక్టరేట్ భవన సముదాయం, జిల్లాకో మెడికల్ కాలేజీ నిర్మించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చాక హామీల అమలును మరిచింది. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇస్తామన్నారు. కానీ ఏ ఒక్కరికైనా ఇచ్చారా? మహిళలకు నెలకు 2500 ఆర్థిక సహాయం ఇస్తామన్నారు.. ఏమైంది? అని త‌ల‌సాని ప్ర‌శ్నించారు.

 

Advertisement
Advertisement