త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | గోడ‌లు కూలుస్తుంటే పోలీసులు ప‌క్క‌న‌ టిఫిన్ తింటున్న‌రు: కేటీఆర్‌

KTR | వ‌ట్టినాగుల‌ప‌ల్లి (Vattinagulapally)లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు అక్రమాలకు పోలీసులు వ‌త్తాసు ప‌లుకుతున్నార‌ని బీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ (KTR) ఫైర‌య్యారు. పొంగులేటికి సహకరించే పోలీసు అధికారుల పేర్లు డైరీలో రాసుకుంటున్నామ‌ని, ఎవ‌రినీ వ‌దిలిపెట్ట‌మ‌ని హెచ్చరించారు. సోమ‌వారం ఎమ్మెల్యేల బృందంతో క‌లిసి ఆయ‌న వ‌ట్టినాగుల‌ప‌ల్లిలో సంద‌ర్శించారు.

S

News | Published On Mar 30, 2026, 1.19 pm IST

KTR | గోడ‌లు కూలుస్తుంటే పోలీసులు ప‌క్క‌న‌ టిఫిన్ తింటున్న‌రు: కేటీఆర్‌
Advertisement

త్రినేత్ర.న్యూస్‌: వ‌ట్టినాగుల‌ప‌ల్లి (Vattinagulapally)లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు అక్రమాలకు పోలీసులు వ‌త్తాసు ప‌లుకుతున్నార‌ని బీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ (KTR) ఫైర‌య్యారు. పొంగులేటికి సహకరించే పోలీసు అధికారుల పేర్లు డైరీలో రాసుకుంటున్నామ‌ని, ఎవ‌రినీ వ‌దిలిపెట్ట‌మ‌ని హెచ్చరించారు. సోమ‌వారం ఎమ్మెల్యేల బృందంతో క‌లిసి ఆయ‌న వ‌ట్టినాగుల‌ప‌ల్లిలో సంద‌ర్శించారు. బాధితులను క‌లిసి వారితో మాట్లాడి వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు.

పొంగులేటి అనుచరులు ప్రహరీ గోడ కూలుస్తుంటే పోలీసులు పక్కన కూర్చొని టిఫిన్ తింటున్నారట.. ఎదెక్క‌డి ధ‌ర్మం అని ప్ర‌శ్నించారు. ఏకంగా 27 ఎక‌రాల భూమిని క‌బ్జా పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆరోపించారు. స‌ర్వే నోటీసును రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేసిన‌ట్లు బాధితులు త‌న దృష్టికి తెచ్చారని కేటీఆర్ చెప్పారు. రాత్రిళ్లు జేసీబీలు తెచ్చి ధ్వంసం చేస్తున్నార‌ని చెప్పిన‌ట్లు పేర్కొన్నారు. దాదాపు 1400 వంద‌ల కోట్ల విలువ చేసే భూమిపై ప‌డ్డార‌ని మండిప‌డ్డారు. మంత్రి స్వ‌యంగా త‌మ ఇంటికి వ‌చ్చి బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారని బాధితులు ఆరోపించారు. ఓ స‌ర్వేయ‌ర్‌ను అడ్డం పెట్టుకొని బెదిరించిన‌ట్లు బాధితులు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు.

నంబ‌ర్‌పేట్లు లేని జేసీబీల‌తో వ‌చ్చి బాధితులు క‌ట్టుకున్న గోశాల‌ను, ప్ర‌హ‌రీని కూల‌గొట్టార‌ని కేటీఆర్ చెప్పారు. భూమి ఇయ్య‌కుంటే స‌జీవంగా పాతిపెడ‌తామ‌ని బెదిరించిన‌ట్లు నా దృష్టికి తెచ్చార‌ని కేటీఆర్ అన్నారు. బాధితుల‌కు శాస‌న‌స‌భా బృందం మొత్తం అండ‌గా ఉంటుంద‌ని, న్యాయ‌బ‌ద్దంగా పోరాడేందుకు స‌హ‌క‌రిస్తామ‌ని కేటీఆర్ భ‌రోసా ఇచ్చారు. సీబీసీఐడీ అని చెప్పి ప్ర‌భుత్వం మంత్రిని కాపాడే ప్ర‌యత్నం చేస్తుంద‌ని ఆరోపించారు. రెండున్నరేళ్లలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని.. అక్రమాలకు సహకరించే వారిని ఎట్టిప‌రిస్థితుల్లో వ‌దిలిపెట్ట‌మ‌ని కేటీఆర్ హెచ్చ‌రించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement