త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Vaddiraju Ravi Chandra | ఎండ‌లు మండుతుంటే మ‌క్క‌ల్లో తేమెక్క‌డిది?: వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌

MP Vaddiraju Ravi Chandra | రాష్ట్రంలో ఎండలు మండిపోతుంటే మొక్కజొన్నల్లో తేమ ఉందంటూ క్వింటాలుకు 5 కిలోల చొప్పున తరుగు తీయడం విడ్డూరంగా ఉంద‌ని రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎంపీ వ‌ద్దిరాజు ర‌విచంద్ర అన్నారు. రైతాంగ సమస్యల‌ పరిష్కారం కోసం బీఆర్ఎస్ (BRS) ఖమ్మం (Khammam) జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేప‌ట్టిన మ‌హాధ‌ర్నా(Mass protest)లో కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ఆయ‌న పాల్గొన్నారు.

S

News | Published On Apr 24, 2026, 2.02 pm IST

MP Vaddiraju Ravi Chandra | ఎండ‌లు మండుతుంటే మ‌క్క‌ల్లో తేమెక్క‌డిది?: వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌
Advertisement
  • ఆ సాకుతో క్వింటాలుకు 5 కిలోల త‌రుగు తీయ‌డం దారుణం
  • క‌ల్లాలు, రోడ్ల‌పై అంతా ధాన్యమే..
  • ప్ర‌తి గింజ‌నూ త‌క్ష‌ణ‌మే కొనాలి
  • ఇక్క‌డ‌ ముగ్గురు మంత్రులున్నా ఫ‌లితం సున్నా
  • ఖ‌మ్మం క‌లెక్ట‌రేట్ మ‌హాధ‌ర్నాలో ఎంపీ వ‌ద్దిరాజు ర‌విచంద్ర విమ‌ర్శ‌లు

MP Vaddiraju Ravi Chandra | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో ఎండలు మండిపోతుంటే మొక్కజొన్నల్లో తేమ ఉందంటూ క్వింటాలుకు 5 కిలోల చొప్పున తరుగు తీయడం విడ్డూరంగా ఉంద‌ని రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎంపీ వ‌ద్దిరాజు ర‌విచంద్ర అన్నారు. ఈ దద్దమ్మ కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కళ్లాలతో పాటు రోడ్లు కూడా నిండిపోయాయని విమ‌ర్శించారు. రైతాంగ సమస్యల‌ పరిష్కారం కోసం బీఆర్ఎస్ (BRS) ఖమ్మం (Khammam) జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేప‌ట్టిన మ‌హాధ‌ర్నా(Mass protest)లో కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ఆయ‌న పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అధ్యక్షత వహించారు.

ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్ రెడ్డిల‌తో క‌లిసి వ‌ద్దిరాజు ప్ర‌సంగించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైంద‌న్నారు. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ఏ మాత్రం దృష్టి పెట్టకుండా తీవ్ర నిర్లక్ష్యం వహించడం పట్ల రైతన్నలు, ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు.ఈ దద్దమ్మ ప్రభుత్వం ధాన్యం కొన‌క‌పోవ‌డంతో కళ్లాలతో పాటు రోడ్లు కూడా నిండిపోయాయని చెప్పారు.

యాప్‌తో రైతుల‌కు వాపులు..

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రైతుబంధు ప్రవేశపెట్టి క్రమం తప్పకుండా పెట్టుబడి సాయం అందించారు. కాంగ్రెస్ సర్కార్ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుంది. కౌలుదార్లకు కూడా రైతు భరోసా అందిస్తామని కాంగ్రెస్ నాయకులు హామీనిచ్చి ఉల్లంఘించారు. రేవంత్ రెడ్డి పాలనలో సాగునీరందక, కరెంట్ సరఫరా కోతల కారణంగా పంటలు ఎండిపోయాయి. యాప్ పెట్టడంతో యూరియా కోసం తిరిగి తిరిగి రైతున్నల కాళ్లకు వాపులొచ్చాయి. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు అతిరథ మహారథులైన మంత్రులు ఉన్నా కూడా రైతులు పండించిన ధాన్యాన్ని కొంట‌లేరు.

రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి..

బీఆర్ఎస్ శ్రేణులు మహాధర్నాకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి "జై తెలంగాణ.. జైజై తెలంగాణష‌, "జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్.. వ‌ర్ధిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, "రైతు వ్యతిరేక రేవంత్ ప్రభుత్వం నశించాలిష‌, రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి","ఇదేమీ రాజ్యం ఇదేమీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం","రేవంత్ పోవాలి-కేసీఆర్ రావాలి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

హైకోర్టు తీర్పు చెంప‌పెట్టు...

కేసీఆర్ పర్యవేక్షణలో పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేశాం. కాళేశ్వరం బహుళ దశ సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇవ్వడం ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు వంటింది. మహాధర్నా అనంతరం రవిచంద్ర నాగలి మధు, అజయ్, కమల్ రాజ్, వెంకటరమణ తదితర నాయకులు ప్లకార్డులు చేతబూని మండుటెండలో కలెక్టరేట్ లోకి దూసుకెళ్లి నేలపై బైఠాయించారు. మొక్కజొన్న, వడ్లు కొనుగోలు చేసి రైతన్నలకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. అనంత‌రం అడిషనల్ కలెక్టర్ పిన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు లింగాల కమల్ రాజ్, కూరాకుల నాగభూషణం, గుండాల కృష్ణ (ఆర్జేసీ), పగడాల నాగరాజు, బచ్చు విజయ్ కుమార్, ఉప్పల వెంకటరమణ, శీలంశెట్టి వీరభద్రం, తోట రామారావు, బిచ్చాల తిరుమలరావు, పగడాల నరేందర్, బొమ్మెర రాంమూర్తి, బెల్లం వేణు,లింగనబోయిన సతీష్, దుగ్గిదేవర వెంకట్ లాల్, తీగల సతీష్ తదితరులతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement