త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Chamala Kiran Kumar Reddy | బీఆర్ఎస్ దోచుకుంటే బీజేపీ మౌనవ్ర‌తం చేసింది.. కిష‌న్‌రెడ్డి వ్యాఖ్య‌ల‌కు ఎంపీ చామ‌ల కౌంట‌ర్‌

MP Chamala Kiran Kumar Reddy | మూసీ పునరుజ్జీవనం (Musi restoration) కోసం 500 మిలియన్ డాలర్ల ప్రపంచ బ్యాంకు (World Bank) రుణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామని భువ‌న‌గిరి కాంగ్రెస్‌ ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, కేంద్రం పదేళ్లు ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. లోక్‌సభ(Loksabha) లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై చామ‌ల‌ కౌంటర్ ఇచ్చారు.

S

News | Published On Apr 2, 2026, 4.11 pm IST

MP Chamala Kiran Kumar Reddy | బీఆర్ఎస్ దోచుకుంటే బీజేపీ మౌనవ్ర‌తం చేసింది.. కిష‌న్‌రెడ్డి వ్యాఖ్య‌ల‌కు ఎంపీ చామ‌ల కౌంట‌ర్‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: మూసీ పునరుజ్జీవనం (Musi restoration) కోసం 500 మిలియన్ డాలర్ల ప్రపంచ బ్యాంకు (World Bank) రుణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామని భువ‌న‌గిరి కాంగ్రెస్‌ ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, కేంద్రం పదేళ్లు ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. లోక్‌సభ(Loksabha) లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై చామ‌ల‌ కౌంటర్ ఇచ్చారు. మూసీ ప్రక్షాళన, మెట్రో రెండో దశ, RRR ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాలని కోరారు. తెలంగాణ అప్పులు, మూసీ అభివృద్ధిపై ఆయ‌న మాట్లాడారు.

హైదరాబాద్ లో మూసీ నది ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం కంక‌ణం క‌ట్టుకుంద‌న్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అడ్డుపడొద్దన్నారు. ప్రపంచ బ్యాంకులో 500 మిలియన్ డాలర్ల రుణం కోసం ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేశామ‌ని చెప్పారు. ఈ నివేదిక‌ను కేంద్ర ప్రభుత్వ సంబంధిత శాఖా మంత్రికి, నీతి ఆయోగ్ కు అంద‌జేసిన‌ట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో తెలంగాణ‌ను నిలువునా దోచుకుంద‌ని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ ఎలాంటి చర్యలు తీసుకోలెదని ప్ర‌శ్నించారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అప్పులపాలైంద‌ని విమ‌ర్శించారు.

Advertisement
Advertisement