త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Chamala Kiran Kumar Reddy | కేసీఆర్.. అప్డేట్ అవ్వు.. క‌విత వేసిన అబాండాల‌పై నోరు విప్పు: ఎంపీ చామ‌ల

MP Chamala Kiran Kumar Reddy | రాష్ట్రంలో ఏం జ‌రుగుతుందో తెలియ‌ద‌ని కేసీఆర్ (KCR) అంటున్నార‌ని, ముందు ఆయ‌న అప్డేట్ అవ్వాల‌ని, ఆయ‌న కూతురు, వార‌సురాలు కూతురు (Kavitha) వేసిన అబాండాల‌పై నోరు విప్పాల‌ని భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్ రెడ్డి కౌంట‌రిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఇక నుండి వర్ధంతులే చేసుకోవాలని ఎద్దేవా చేశారు.

S

News | Published On Apr 27, 2026, 6.03 pm IST

MP Chamala Kiran Kumar Reddy | కేసీఆర్.. అప్డేట్ అవ్వు.. క‌విత వేసిన అబాండాల‌పై నోరు విప్పు: ఎంపీ చామ‌ల
Advertisement

MP Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో ఏం జ‌రుగుతుందో తెలియ‌ద‌ని కేసీఆర్ (KCR) అంటున్నార‌ని, ముందు ఆయ‌న అప్డేట్ అవ్వాల‌ని, ఆయ‌న కూతురు, వార‌సురాలు కూతురు (Kavitha) వేసిన అబాండాల‌పై నోరు విప్పాల‌ని భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్ రెడ్డి గ‌ట్టి కౌంట‌రిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఇక నుండి వర్ధంతులే చేసుకోవాలని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చావు ఎవ‌రూ కోరుకోవట్లేద‌ని, వారి కుటుంబ సభ్యులే ఆయ‌న చావును కోరుకుంటున్నార‌ని ఆరోపించారు.

మీరు మర మనిషి ఆ..?

కేసీఆర్ కు ఫామ్ హౌస్ పరిపాలన మాత్రమే తెలుసు. రాష్ట్రంలో, దేశంలో ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు. నీ కూతురు వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదు. మౌనం అంగీకారమేనా?? జేబులు చూసి పరిపాలించారు అని క‌విత అన్నారు.. ఆ అబండాలపై కేసీఆర్ మాట్లాడాలి. మీరు మర మనిషి ఆ..? కేసీఆర్ రాడు అని అన్న‌ది.. ముందు దానిపై కేసీఆర్ స్పందించాలి. కవిత వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలి. ఆ ఆరోపణలు నిజమా, అబద్దమా సమాధానం చెప్పి వేరే విషయాలు మాట్లాడాలి అని చామ‌ల నిల‌దీశారు.

నువ్వే బీజేపీ ఎంపీలను గెలిపించుకున్న‌వ్‌..

తేజ‌స్వీ సూర్య తెలంగాణ రాష్ట్ర విభ‌జ‌న‌పై చేసిన వ్యాఖ్య‌ల‌పై ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదని కేసీఆర్ అంటున్నారు. నువ్వే కావాలని బీజేపీ ఎంపీలను గెలిపించుకున్నావ్. పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీలం నిరసన తెలిపాం. మా గళం వినిపించాం. కేసీఆర్ అప్డేట్ కావాలి. ఆయ‌న‌కు ఎక్క‌డేం జ‌రుగుతుందో తెలియ‌డం లేదు. రెండున్నర సంవత్సరాలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో కేసీఆర్ కు సంబంధం లేదు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అన్ని ఎన్నికల్లో ఓడిపోయిన మీరు వర్ధంతులే చేసుకోవాలి. మీరు గతం గురించి మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అందించాల‌ని ముందుకు వెళ్తుంది. ప్రతిపక్ష పాత్ర పోషించి.. మీరు ప్రజా సమస్యలు ముందుకు తీసుకురావాలి. కేసీఆర్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. మీ విజ్ఞతకే వదిలేస్తం అని చామ‌ల విమ‌ర్శించారు.

Advertisement
Advertisement