త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sridhar babu | సీబీసీఐడీపై నమ్మకం లేకపోతే ఎలా? : మంత్రి శ్రీధర్ బాబు

Sridhar babu | హౌస్ క‌మిటీ(House committee) పై బీఆర్ఎస్ సభ్యులు లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేశామ‌ని.. సీబీసీఐడీ విచారణ (CBCID Enquiry) చేయిస్తామని హౌజ్ లోనే ప్రకటించామ‌ని మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు (Minister Sridhar babu) అన్నారు. అసెంబ్లీలో దీనిపై బీజేపీ స‌భ్యులు పాయ‌ల్ శంక‌ర్ అడిగిన‌ ప్ర‌శ్న‌ల‌కు మంత్రి కౌంట‌ర్ గా స‌మాధాన‌మిచ్చారు. బీఆర్ఎస్ సభ్యులకు సీబీసీఐడీపై నమ్మకం లేకపోతే తాము ఏం చేయ‌లేమ‌న్నారు.

S

News | Published On Mar 29, 2026, 12.16 pm IST

Sridhar babu | సీబీసీఐడీపై నమ్మకం లేకపోతే ఎలా? : మంత్రి శ్రీధర్ బాబు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: హౌస్ క‌మిటీ(House committee) పై బీఆర్ఎస్ సభ్యులు లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేశామ‌ని.. సీబీసీఐడీ విచారణ (CBCID Enquiry) చేయిస్తామని హౌజ్ లోనే ప్రకటించామ‌ని మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు (Minister Sridhar babu) అన్నారు. అసెంబ్లీలో దీనిపై బీజేపీ స‌భ్యులు పాయ‌ల్ శంక‌ర్ అడిగిన‌ ప్ర‌శ్న‌ల‌కు మంత్రి కౌంట‌ర్ గా స‌మాధాన‌మిచ్చారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై బీఆర్ఎస్‌, బీజేపీ, సీపీఐ నేత‌లంద‌రూ మాట్లాడాల‌న్నారు. హౌస్ కమిటీకి సంబంధించిన నివేదిక‌లు గత బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఎందుకు భ‌య‌ట‌పెట్ట‌లేద‌ని ప్ర‌శ్నించారు. పదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపిన బీఆర్ఎస్ సభ్యులకు సీబీసీఐడీపై నమ్మకం లేకపోతే తాము ఏం చేయ‌లేమ‌న్నారు.

స‌భ‌ను అడ్డుకోవ‌డమే వారి అస‌లు అజెండా..

సభా కార్యకలాపాలను అడ్డుకోవద్దని ప్రభుత్వం తరఫున అనేక సార్లు విజ్ఞప్తి చేశాం. సభను అడ్డుకోవద్దని మీరు కూడా మీ తోటి సభ్యులకు విజ్ఞప్తి చేయండి. సభను అడ్డుకోవాలన్నదే బీఆర్ఎస్ సభ్యుల అసలు అజెండా. సభలో ఎలాంటి బిజినెస్ నడవొద్దు. ద్రవ్య వినిమయ బిల్లు (Appropriation Bill) ఆమోదం పొందకూడదనే బీఆర్ఎస్ సభ్యులు స‌భ‌కు ఆటంకం కలిగిస్తున్నారు. ఇది ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదు అని మంత్రి ఫైర‌య్యారు.

జ‌వాబుదారీతనం ఉండేలా...

హౌజ్ క‌మిటీ ప్ర‌భుత్వానికి సూచ‌న‌లు చేస్తుంద‌న్నారు. ఆయా విభాగాల్లో ప‌లు ర‌కాల అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని, వాటిపై తీసుకునే చ‌ర్య‌ల‌ను ఆ క‌మిటీ సూచిస్తుంద‌ని తెలిపారు. బీఆర్ఎస్ నేత‌లు డిమాండ్ చేయ‌డం త‌ప్పులేద‌ని, అంత‌కు ప‌దింత‌లు జ‌వాబుదారీత‌నం ఉండేలా సీబీసీఐడీ విచార‌ణ చేయిస్తామ‌ని చెబుతున్నామ‌న్నారు. అయినా మీరు స‌సేమిరా అంటే ఎలా అని ప్ర‌శ్నించారు. ఎటువంటి జాప్యం జ‌ర‌గ‌కూడ‌ద‌నే సీఎం విచార‌ణ క‌మిటీ వేశార‌ని.. ఇంత‌కంటే ఇంకేముంటుంద‌న్నారు. పిల్ల‌ల‌కు, త‌ల్లిదండ్రుల‌కు సంబంధించి ప్ర‌భుత్వం కొత్త చ‌ట్టాలు తీస‌కొస్తుంద‌ని, ఈ ప్ర‌య‌త్నంలో ప్ర‌తిప‌క్ష నాయ‌కులు సూచ‌న‌లు చేయాల‌ని పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement