Weekend Drunk and Drive | వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 240 మందిపై కేసులు
Weekend Drunk and Drive | సైబరాబాద్(Saibarabad) పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్(Weekend Drunk and Drive)లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-I రంజన్ రతన్ కుమార్ తెలిపారు. కేసులు నమోదు చేసినట్లు వివరించారు.
త్రినేత్ర.న్యూస్: సైబరాబాద్(Saibarabad) పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్(Weekend Drunk and Drive)లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-I రంజన్ రతన్ కుమార్ తెలిపారు. ఈ డ్రైవ్‌లో భాగంగా 240 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు (Cases filed) చేశారు. 193 ద్విచక్ర వాహనదారులు, 9 ఆటోలు, 38 కార్లు, హెవీ వాహనదారులపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు.
అనంతరం రంజన్ రతన్ కుమార్ మాట్లాడుతూ.. మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం తీవ్రమైన నేరమని పునరుద్ఘాటించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే భారతీయ న్యాయ సంహిత 2023 లోని సెక్షన్ 105 (కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్) కింద కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఈ నేరానికి గరిష్ట శిక్ష 10 ఏళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతునవారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు.
కాగా ఈ డ్రైవ్‌లో బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ (బీఏసీ) ఆధారంగా కేసులను వర్గీకరిస్తే 199 మంది 36 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 200 ఎంజీ/100 ఎంఎల్ మధ్య, 32 మంది 201 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 300 ఎంజీ/100 ఎంఎల్ మధ్య, 9 మంది 301 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 550 ఎంజీ/100 ఎంఎల్ మధ్య ఆల్కహాల్ సేవించి పట్టుబడినట్లు పోలీసులు చెప్పారు. పట్టుబడినవారందరినీ చట్టపరంగా కోర్టులో హాజరుపర్చనున్నట్లు పోలీసులు అధికారులు తెలిపారు.
గత వారం (6.4.2026 -11.4.2026)లో నమోదైన మొత్తం 86 డ్రంక్ డ్రైవింగ్ కేసులు కోర్టలో పరిష్కారమైనట్లు వివరించారు. వీరిలో ఇద్దరికి జరిమానా, జైలు శిక్ష, ఒకరికి జరిమానా, సోషల్ సర్వీస్, 83 మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



