త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Weekend Drunk and Drive | వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్‌ డ్రైవ్‌.. 245 మందిపై కేసులు

Weekend Drunk and Drive | సైబ‌రాబాద్ (Cyberabad) లో వీకెండ్ స్పెష‌ల్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేప‌ట్టి ప‌ట్టుబ‌డిన‌ 245 మందిపై కేసులు (Cases) న‌మోదు చేసిన‌ట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-I రంజన్ రతన్ కుమార్ (Traffic DCP Ranjan Rathan Kumar) తెలిపారు. మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయటం తీవ్రమైన నేరమ‌న్నారు.

S

News | Published On Apr 26, 2026, 12.58 pm IST

Weekend Drunk and Drive | వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్‌ డ్రైవ్‌.. 245 మందిపై కేసులు
Advertisement

Weekend Drunk and Drive | త్రినేత్ర‌.న్యూస్‌: సైబ‌రాబాద్ (Cyberabad) లో వీకెండ్ స్పెష‌ల్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేప‌ట్టి ప‌ట్టుబ‌డిన‌ 245 మందిపై కేసులు (Cases) న‌మోదు చేసిన‌ట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-I రంజన్ రతన్ కుమార్ (Traffic DCP Ranjan Rathan Kumar) తెలిపారు. హెల్మెట్ పెట్టుకోకుండా వాహనాలు నడుపుతునవారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక దృష్టి సారించిన‌ట్లు చెప్పారు. మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయటం తీవ్రమైన నేరమని.. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే, భారతీయ న్యాయ సంహిత-2023లోని సెక్షన్‌ 105 కింద కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఈ నేరానికి గరిష్ట శిక్ష 10 ఏళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉంద‌ని పేర్కొన్నారు.

ఏవేవి ఎన్నంటే..

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్‌ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ డ్రైవ్‌లో భాగంగా 245 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. 197 ద్విచక్ర వాహనదారులు, 12 ఆటోలు, 36 కార్లు, వాహనదారులపై కేసులు నమోదయ్యాయి అని పోలీసులు చెప్పారు.

బ్లడ్‌ ఆల్కహాల్‌ కాన్సన్ట్రేషన్ (బీఏసీ) ఆధారంగా కేసులను వర్గీకరిస్తే 196 మంది 36 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 200 ఎంజీ/100 ఎంఎల్ మధ్య, 28 మంది 201 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 300 ఎంజీ/100 ఎంఎల్ మధ్య, 21 మంది 301 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 550 ఎంజీ/100 ఎంఎల్ మధ్య ఆల్కహాల్ తీసుకొని పట్టుబడ్డారు. వీరందరినీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ర‌త‌న్ కుమార్‌ తెలిపారు.

గ‌త వారం కేసులు ఇలా..

గత వారం (20 నుంచి 25 తేదీ మ‌ధ్య‌) లో మొత్తం189 డ్రంక్‌ డ్రైవింగ్‌ కేసుల‌కు కోర్టులో ప‌రిష్కారం ల‌భించింద‌న్నారు. వీరిలో ఇద్ద‌రికి జరిమానా, సోషల్‌ సర్వీస్, 187 మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్‌ పోలీస్ అధికారులు వెల్ల‌డించారు.

Advertisement
Advertisement