Kishan Reddy | త్వరలో సమ్మక్క-సారలమ్మ గిరిజన యూనివర్సిటీ పనులు చేపడతాం: కిషన్‌రెడ్డి
Kishan Reddy | త్వరలో సమ్మక్క-సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయ క్యాంపస్ (Sammakka Sarakka Central Tribal University) నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. వచ్చే నెల 10న ప్రధాని మోదీ (PM Modi) హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారని, రూ.7,823 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని తెలిపారు.
Kishan Reddy | త్రినేత్ర.న్యూస్: త్వరలో సమ్మక్క-సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయ క్యాంపస్ (Sammakka Sarakka Central Tribal University) నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. వచ్చే నెల 10న ప్రధాని మోదీ (PM Modi) హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారని, రూ.7,823 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని తెలిపారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ నేతలతో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
పెట్రోలియం టెర్మినల్ ప్రారంభం..
హైదరాబాద్‌లో పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి టెర్మినల్‌ను ప్రధాని ప్రారంభిస్తారు. మహబూబ్‌నగర్‌లో రూ.3,175 కోట్ల విలువైన జాతీయ రహదారి పనులకు వర్చువల్‌గా శ్రీకారం చుడతారు. హఫీజ్‌పేట, జోగులాంబ రైల్వేస్టేషన్లను, కాజీపేట- విజయవాడ మధ్య మూడో రైల్వే లైన్‌ను ప్రారంభిస్తారు. రాష్ట్రంలో రూ.85 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్-యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ పనులు ప్రారంభమై కొనసాగుతున్నాయి. వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం. 2030 నాటికి రూ.9 లక్షల కోట్ల విలువైన టెక్స్‌టైల్ ఉత్పత్తుల ఎగుమతే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నం అని కిషన్‌రెడ్డి వివరించారు.
కొత్త రాజకీయ తరం వచ్చేది..
మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఫార్మా, పరిశోధన, టెక్నాలజీ రంగాల్లో ముందుకెళ్లాలి. డీలిమిటేషన్ జరిగితే ఈరోజు కొత్త రాజకీయ తరం దేశ రాజకీయాల్లోకి వచ్చేది. కుటుంబ పాలన పోయేది. దక్షిణ భారతానికి అన్యాయం జరగదు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం ఉంటది. బంగారం లాంటి అవకాశాన్ని కాంగ్రెస్ అడ్డుకుంది. దక్షిణ భారత్‌లో లోక్‌సభ సీట్లు 129 ఉన్నాయి. అవి 195కు పెరిగేవి. ఆంధ్రప్రదేశ్‌లో 38, తెలంగాణలో 26, తమిళనాడులో 59, కర్ణాటకలో 42, కేరళలో 30 ఈ రకంగా పెంచాలనుకున్నం. టీమిండియాగా కలిసి మెలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అందరం కలిసి ఉండాలి అని కిషన్‌రెడ్డి కోరారు.
తాజావార్తలు
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!





