త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Deputy CM Bhatti | వెలుగుమట్లలో మోడల్ కాలనీ నిర్మిస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

వెలుగుమట్ల (Velugumatla) లో పేదల కోసం మోడల్ కాలనీ (Model colony) నిర్మిస్తామ‌ని, దేశానికే ఆద‌ర్శంగా ఉండేలా నిర్మాణం చేస్తామ‌ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) అన్నారు. ఖమ్మం (Khammam) జిల్లా కేంద్రంలో వెలుగుమ‌ట్ల బుధ‌వారం పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాల పంపిణీ (Land titles distribution) చేసిన సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు.

S

News | Published On Mar 11, 2026, 7.03 pm IST

Deputy CM Bhatti | వెలుగుమట్లలో మోడల్ కాలనీ నిర్మిస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Advertisement

- రేప‌టి నుంచే ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలి
- డిసెంబర్ 9న సీఎం చేతుల మీదుగా గృహ‌ ప్రవేశం
- నాలుగున్నర లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ. 22,500 కోట్లు మంజూరు
- వెలుగుమట్ల పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

 

త్రినేత్ర‌.న్యూస్‌: వెలుగుమట్ల (Velugumatla) లో పేదల కోసం మోడల్ కాలనీ (Model colony) నిర్మిస్తామ‌ని, దేశానికే ఆద‌ర్శంగా ఉండేలా నిర్మాణం చేస్తామ‌ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) అన్నారు. ఖమ్మం (Khammam) జిల్లా కేంద్రంలో వెలుగుమ‌ట్ల బుధ‌వారం పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాల పంపిణీ (Land titles distribution) చేసిన సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. వెలుగుమట్లలో పేదలకు పంచగా మిగిలిన 16 ఎకరాల (16 acre) భూమిని తెలంగాణ పబ్లిక్ స్కూల్, ఇతర ప్రభుత్వ విద్యా సంస్థల నిర్మాణానికి ఉపయోగిస్తామ‌న్నారు. భూదాన్ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామ‌ని చెప్పారు. కరెంటు, నీళ్లు, రోడ్లు, ఆసుపత్రి, కమ్యూనిటీ హాల్, షాపింగ్ కాంప్లెక్స్ అన్ని సౌకర్యాలు కల్పిస్తామని స్ప‌ష్టం చేశారు. రేపటి నుంచే (గురువారం) ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాల‌ని.. వ‌చ్చే డిసెంబర్ 9 కల్లా మోడల్ కాలనీలో ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు.

పాలు పొంగాలే..

ముగ్గురు మంత్రులం కలిసి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) ని ఆహ్వానిస్తామ‌ని, అప్పుడే పాలు పొంగించాలని చెప్పారు. ఇల్లు కట్టిస్తామని చెప్పి 10 సంవత్సరాలపాటు బీఆర్ఎస్ కాలయాప‌న చేసింద‌న్నారు. అలాంటి వారికి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు. రాష్ట్రంలో ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించాల‌నేది సీఎం రేవంత్ నాయకత్వంలోని క్యాబినెట్ (Cabinet) ఆలోచన అని అన్నారు. నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇల్లు నిర్మించేందుకు రూ.22,500 కోట్లు ఒకేసారి మంజూరు చేసి చరిత్రలో రికార్డు సృష్టించిన ప్రభుత్వం తమదే అని భ‌ట్టి తెలిపారు.

వారిని ద‌రిదాపుల్లోకి రానివ్వొద్దు...

పేదలకు మేలు జరగొద్దని కొద్దిమంది బురద జల్లుతున్నారని విమ‌ర్శించారు. వెలుగుమట్లలో పేదల నుంచి మాఫియా డబ్బులు వసూలు చేసిందని ఆరోపించారు. పేదలు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ఆత్మ గౌరవంగా బతికేందుకు ఎన్ని కోట్లయినా ఖర్చు చేసేందుకు ప్రజా ప్రభుత్వం వెనుకాడదని పేర్కొన్నారు. వెలుగుమట్లలో అర్హత కలిగిన 412 మందిని గుర్తించి ఏ భేదం లేకుండా పట్టాలు పంపిణీ చేసి ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. వివిధ జిల్లాల్లో ఉన్న 101 మంది పేదలకు వారి గ్రామాల్లో ఉన్న స్థలాల్లో ఇందిరమ్మ నిర్మాణానికి అనుమతి పత్రాలు మంజూరు చేసినట్టు వివ‌రించారు. పేదల నిస్స‌హాయతను అడ్డుపెట్టుకొని బతికే మాఫియా శక్తులను దరిదాపుల్లోకి రానివ్వద్దని పేదలకు, అధికారులకు భ‌ట్టి సూచించారు.

Advertisement
Advertisement