త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | పేద‌ల ప్ర‌భుత్వంపై బుర‌ద రాజ‌కీయ‌మా? – ఖ‌మ్మం ప్యాక్స్ గోదాంల ప్రారంభోత్స‌వంలో మంత్రి పొంగులేటి

Ponguleti Srinivas Reddy | ప్ర‌తిపక్ష నాయ‌కుల‌కు అంటిన బురదను అధికార పార్టీకీ, నాయకులకు అంటించాలని చూస్తున్నార‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy)విమ‌ర్శించారు. ఖ‌మ్మం (Khammam) జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మలో 1.52 కోట్లతో నిర్మించిన ప్యాక్స్ గోదాముల‌(facts godaam)ను శుక్ర‌వారం ఆయ‌న ప్రారంభించారు.

S

News | Published On Apr 10, 2026, 6.00 pm IST

Ponguleti Srinivas Reddy | పేద‌ల ప్ర‌భుత్వంపై బుర‌ద రాజ‌కీయ‌మా? – ఖ‌మ్మం ప్యాక్స్ గోదాంల ప్రారంభోత్స‌వంలో మంత్రి పొంగులేటి
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ప్ర‌తిపక్ష నాయ‌కుల‌కు అంటిన బురదను అధికార పార్టీకీ, నాయకులకు అంటించాలని చూస్తున్నార‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy)విమ‌ర్శించారు. ఎవరెన్ని కుట్ర‌లు చేసినా త‌మ‌కు ప్రజల దీవెన‌లు ఎల్ల‌ప్పుడూ ఉంటాయ‌న్నారు. ఖ‌మ్మం (Khammam) జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మలో 1.52 కోట్లతో నిర్మించిన ప్యాక్స్ గోదాముల‌(facts godaam)ను శుక్ర‌వారం ఆయ‌న ప్రారంభించారు. 191 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 58.58 లక్షల విలువైన చెక్కుల(Checks)ను అంద‌జేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడారు. పేదవారికి కాంగ్రెస్ ప్ర‌భుత్వం అండగా ఉంటుంద‌న్నారు.

రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామ‌న్నారు. ధాన్యం కొనుగోలు చేసిన‌ వారం రోజుల్లోనే రైతుల ఖాతాలో నగదు జమ చేస్తున్నామ‌న్నారు. రైతును రాజు చేయడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. కేవలం నాలుగు నెలల్లోనే రూ. 20,670 కోట్ల మేర రుణమాఫీ చేశామ‌ని గుర్తు చేశారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ కూడా ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 3.80 లక్షల మందికి ప‌ట్టా పాస్ పుస్తకాలు అందించామ‌న్నారు. అనంతరం వెంకటాపురంలో దేపంగి శ్రీకాంత్ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్ దత్, మున్సిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత, పాలేరు ప్రత్యేక అధికారి రమేష్, ఆర్డీవో శ్రీనివాస్, వ్యవసాయ అధికారి పుల్లయ్య, తహసీల్దార్ సైదులు, ఎంపీడీవో, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement