SP Balu | ఎస్పీ బాలు విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
SP Balu | రవీంద్రభారతి (Ravindra Bharati)లో ఏర్పాటు చేసిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balu) విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) ఆవిష్కరించారు. తెలంగాణవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ భారీ భద్రత నడుమ విగ్రహ ఆవిష్కరణ చేపట్టారు.
SP Balu | రవీంద్రభారతి (Ravindra Bharati)లో ఏర్పాటు చేసిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balu) విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుడు స్వార్థపరుడని, ముందు ఘంటసాలను తీసుకెళ్లారని, ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యంను తీసుకెళ్లారని అన్నారు. బాలసుబ్రహ్మణ్యం స్వరసార్వభౌమత్వానికి నిదర్శనమని కొనియాడారు. సంగీత దర్శకుడు కోరుకున్నది ఇచ్చే అక్షయపాత్రలాంటిది ఆయన గళమని కీర్తించారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్‌బాబు, ఎస్పీ శైలజ, శుభలేఖ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
విగ్రహ ఏర్పాటుపై తీవ్ర వివాదం
రవీంద్రభారతిలో ఎస్పీబీ విగ్రహ ఏర్పాటుపై తీవ్ర వివాదం నెలకొంది. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడేందుకు నిరాకరించారని ఆరోపిస్తూ తెలంగాణవాదులు, ఉద్యమకారులు విగ్రహ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి, తెలంగాణ గురించి పాట పాడను అని చెప్పిన వ్యక్తి విగ్రహాన్ని తెలంగాణ సాంస్కృతిక కేంద్రమైన రవీంద్రభారతిలో ఎలా పెడతారని అభ్యంతరం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కూలగొడతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణవాదులను గృహనిర్బంధంలో ఉంచి, భారీ పోలీసు బందోబస్తు నడుమ విగ్రహావిష్కరణ చేపట్టారు.
ఎమోహనల్ అయిన ఎస్పీ శైలజ
బాలు విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన సోదరి, ప్రముఖ గాయని ఎస్పీ శైలజ ఎమోషనల్ అయ్యారు. రవీంద్రభారతిలో తన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేది బాలు కోరిక అని చెప్పిన ఆమె ఆ కోరిక ఇప్పుడు నెరవేరిందని భావోద్వేగానికి గురయ్యారు. ఆయన సంగీతంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించారని, తమకు మంచి బాట వేశారని అన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Telugu University | తెలుగు విశవ్విద్యాలయం-2026 ప్రతిభా పురస్కారాలు
సెప్టెంబర్ 26, 2026

Pain and Palliative Care | క్యాన్సర్ రోగులకు స్టార్ హాస్పిటల్స్ భరోసా: నొప్పుల ఉపశమనం కోసం సరికొత్త ‘పాలియేటివ్ కేర్’ సేవలు
జులై 24, 2026

Karnataka | కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
ఏప్రిల్ 17, 2026
తాజావార్తలు
- ●NASA | అంగారకుడిపై నీటి ఆనవాళ్లు.. మూడుసార్లు నీటితో తడిసినట్లు ఆధారాలు..
- ●Uttam Kumar Reddy | నవంబర్ రెండోవారంలో కాళేశ్వరం బ్యారేజీల రిపేర్ పనులు
- ●CEC Removal Process | సీఈసీని తొలగించడం అంత ఈజీ కాదు.. అసలు ప్రక్రియ ఏమిటి? రాజ్యాంగం ఏం చెబుతోంది!
- ●Indiramma Illu | కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు
- ●Web Series | డేటింగ్ యాప్ కల్చర్‌పై రజనీకాంత్ కూతురు రొమాంటిక్ వెబ్‌సిరీస్ - లిప్‌లాక్, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ట్రైలర్
- ●Kunal Ghosh | దీదీ సభకు వెళ్తుండగా.. ఎమ్మెల్యేపై రాళ్ల దాడి

NASA | అంగారకుడిపై నీటి ఆనవాళ్లు.. మూడుసార్లు నీటితో తడిసినట్లు ఆధారాలు..

Uttam Kumar Reddy | నవంబర్ రెండోవారంలో కాళేశ్వరం బ్యారేజీల రిపేర్ పనులు

CEC Removal Process | సీఈసీని తొలగించడం అంత ఈజీ కాదు.. అసలు ప్రక్రియ ఏమిటి? రాజ్యాంగం ఏం చెబుతోంది!

Indiramma Illu | కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు



