Chamala Kiran Kumar Reddy | కేటీఆర్ వల్లే..కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు పరిమితం: చామల కిరణ్ కుమార్ రెడ్డి
Chamala Kiran Kumar Reddy | కేటీఆర్ (KTR) లాగా రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పారాచ్యూట్ లీడర్ కాదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) ఎద్దేవా చేశారు. రేవంత్ కు రాజకీయాల్లో గాడ్ ఫాదర్ (Godfather) ఎవరూ లేరని చెప్పారు.
Chamala Kiran Kumar Reddy | బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) లాగా ముఖ్యమంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పారాచ్యూట్ లీడర్ కాదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి రాజకీయాల్లో గాడ్ ఫాదర్ (Godfather) ఎవరూ లేరని చెప్పారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండిపెండెంట్‌గా జెడ్పిటిసీగా గెలిచి సీఎం స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. కేటీఆర్ లాగా అమెరికా నుంచి పారాచ్యూట్ లో సిరిసిల్లకు రాలేదని పేర్కొన్నారు. కేసీఆర్ పిలిచారని వచ్చి సిరిసిల్లలో ఉన్న నాయకులను కాదని కేటీఆర్ పోటీ చేసి వంద ఓట్లతో గెలిచారని చెప్పారు.
ఇప్పటికే కేటీఆర్‌తో రేవంత్ రాజకీయాల్లో ఫుట్‌బాల్ ఆడుతున్నారని ఎద్దేవా
కేటీఆర్ మెస్సిలా భావించి రేవంత్ రెడ్డితో ఫుట్ బాల్ ఆడాలని తహతహలాడుతున్నారని చామల అన్నారు. కేటీఆర్‌తో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడరని, ఆయనను ఆల్ రెడీ రాజకీయాల్లో ఫుట్ బాల్ ఆడుకుంటున్నారని చెప్పారు. కేటీఆర్ ఆడాల్సిన రాజకీయం ఆడటంలేదని, ఇంకా ఫుట్ బాల్ ఏం ఆడతారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ తో కేటీఆర్ లో ఫ్రస్టేషన్ పెరిగిపోయిందన్నారు.
కేటీఆర్‌ది ఐరన్ లెగ్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శిఖరాగ్రం చేరుకున్నానని తన గురించి కేటీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌ది ఐరెన్ లెగ్ అని ఆయన బావ, చెల్లె బయట మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేటీఆర్ పుణ్యం వలనే కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారని, రాజకీయాల్లో క్రియాశీలకంగా లేకుండా అయ్యారని వ్యాఖ్యానించారు. ఆయన పుణ్యం వల్లనే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుండు సున్నా సాధించిందని, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోయిందని గుర్తు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలతో బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్ ఖతం అయిందని అన్నారు. కేటీఆర్, హరీశ్‌లు రోజుకో ప్రెస్ మీట్ పడితే ప్రజలు పట్టించుకోరని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో వెళ్లే ప్రతి రూపాయిని రేవంత్ రెడ్డి వెనక్కు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే ఢిల్లీ టూర్ లకు వెళ్తున్నారని వివరించారు. తెలంగాణలో బిఆర్ఎస్ మనుగడ కోల్పోయిందని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన తర్వాత తెలంగాణకు సంబంధం లేకుండా అయిందని చెప్పారు. కేటీఆర్ ప్రాక్టికల్ గా ఆలోచించాలని హితవు పలికారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



