Tummala Nageswara Rao | వర్షాలకు తడిసిన ధాన్యాన్ని రక్షించేందుకు చర్యలు తీసుకోండి.. అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
Tummala Nageswara Rao | మంచిర్యాల (Mancherial) జిల్లాలో ఈదురుగాలులతో (Strong Winds) కూడిన వర్షం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. మంగళవారం అర్ధరాత్రి జిల్లాలోని లక్షేటిపేట మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.
Tummala Nageswara Rao | త్రినేత్ర.న్యూస్: మంచిర్యాల (Mancherial) జిల్లాలో ఈదురుగాలులతో (Strong Winds) కూడిన వర్షం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. మంగళవారం అర్ధరాత్రి జిల్లాలోని లక్షేటిపేట మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్ధయింది. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్‌తో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) టెలిఫోన్‌లో మాట్లాడారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అవసరమైన డ్రైయర్స్, టార్పాలిన్లు తక్షణం అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. తడిసిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలన్నారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు మార్కెటింగ్ అధికారులను వెంటనే మంచిర్యాల్‌కు వెళ్లాలని ఆదేశించారు.
ఈదురుగాలులకు నలుగురు బలి
మరోవైపు లక్షెట్టిపేట మండలంలో ప్రకృతి ప్రకోపానికి రెండు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మతిచెందారు. మృతుల్లో తండ్రీకొడుకులు కూడా ఉన్నారు.
లక్షెట్టిపేట మండలం కొత్తూరు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం (IKP Center) వద్ద రైతులు ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. దీంతో రక్షణ కోసం సమీపంలో ఉన్న ఒక గోడ పక్కన నిల్చున్నారు. అదే సమయంలో దండేపల్లి మండలం ముత్యంపేటకు చెందిన నీలికి లచ్చన్న (55) అనే వ్యక్తి తన కుమారుడిని హైదరాబాద్ బస్సు ఎక్కించేందుకు లక్షెట్టిపేటకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో గాలి వాన మొదలవ్వడంతో, ఆయన కూడా కొత్తూరు కొనుగోలు కేంద్రం వద్దకు చేరుకుని ఆ గోడ చెంతనే ఆశ్రయం పొందారు.
దురదృష్టవశాత్తూ, గాలి తీవ్రతకు ఆ గోడ ఒక్కసారిగా కుప్పకూలి అక్కడున్న వారిపై పడిపోయింది. దీంతో నీలికి లచ్చన్నతో పాటు, గుండారపు వెంకటేశ్ (40) అనే రైతు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో నలుగురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
సంబంధిత వార్తలు

Minister Vivek | సింగరేణికి పూర్వ వైభవం : మంత్రి వివేక్ వెంకటస్వామి
మే 14, 2026

Mancherial | లక్షెట్టిపేటలో ఈదురుగాలి బీభత్సం.. తండ్రీకొడుకులు సహా నలుగురు దుర్మరణం
మే 6, 2026

El Nino impact Telangana | రైతులకు అలర్ట్: ఎల్ నినో ఎఫెక్ట్‌పై మంత్రి తుమ్మల ముందస్తు సమీక్ష.. ఆ వరి రకాలకే ప్రాధాన్యం ఇవ్వాలని కీలక ఆదేశాలు
ఏప్రిల్ 25, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



