త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Earthquake | ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో భూకంపం.. పరుగులు పెట్టిన జనం

Earthquake | ఢిల్లీ నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ ప్రాంతంలో శుక్రవారం రాత్రి భూకంపం సంభవించింది. ఒక్కసారిగా వచ్చిన ప్రకంపనలతో జనం భయాందోళనకు గురయ్యారు. దాంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. పంజాబ్‌, హర్యానా, జమ్మూ కశ్మీర్‌లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి.

P

National | Published On Apr 3, 2026, 10.25 pm IST

Earthquake | ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో భూకంపం.. పరుగులు పెట్టిన జనం
Advertisement

Earthquake | ఢిల్లీ నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ ప్రాంతంలో శుక్రవారం రాత్రి భూకంపం సంభవించింది. ఒక్కసారిగా వచ్చిన ప్రకంపనలతో జనం భయాందోళనకు గురయ్యారు. దాంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. పంజాబ్‌, హర్యానా, జమ్మూ కశ్మీర్‌లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. రాత్రి 8.12 గంటల ప్రాంతంలో టిబెట్‌లో రిక్టర్‌ స్కేల్‌పై 3.8 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్‌ సిస్మొలజీ సెంటర్‌ తెలిపింది. సిక్కీంకు వంద కిలోమీటర్ల దూరంలో భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు తెలిపింది. భూకంపం కారణంగా నష్టం జరిగినట్లుగా సమాచారం ఏదీ అందలేదు.


ఇదిలా ఉండగా.. భూమి అంతర్గత నిర్మాణం మొత్తం ఏడు ప్రధాన పలకలతో (ప్లేట్లు) ఏర్పడి ఉంటుంది. ఇవి నిరంతరం కదులుతూనే ఉంటాయి. ఈ పలకలు తరచూ ఢీకొనే ప్రాంతాన్ని ‘ఫాల్ట్ లైన్’ అంటారు. పలుమార్లు ఢీకొనడం వల్ల పలకల అంచులు వంగిపోతాయి. ఒక దశలో ఒత్తిడి ఎక్కువై పలకలు విరిగిపోతాయి. ఆ సమయంలో భూమిలోని శక్తి ఒక్కసారిగా బయటకు విడుదల కావడంతో భూకంపం సంభవిస్తుంది. భూకంపం సంభవించే సమయంలో భూమి లోపల శక్తి విడుదల అయ్యే కేంద్రానికి నేరుగా పైభాగంలో ఉన్న ప్రాంతాన్ని ‘ఎపిసెంటర్’ అంటారు. ఈ ప్రాంతంలో కంపనలు అత్యధికంగా ఉంటాయి. అక్కడి నుంచి దూరం పెరుగుతున్న కొద్దీ ప్రభావం తగ్గుతూ ఉంటుంది. అయితే రిక్టర్ స్కేల్‌పై 7, అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవిస్తే, దాని ప్రభావం సుమారు 40 కిలోమీటర్ల పరిధిలో భారీగా కనిపిస్తుంది. ప్రకంపనల స్వభావం, తీవ్రతపై ఆధారపడి ప్రభావిత ప్రాంతం మారే ఛాన్స్‌ ఉంటుంది.

భూకంపాల తీవ్రతను ‘రిక్టర్ స్కేల్’ ద్వారా కొలుస్తారు. దీన్ని రిక్టర్ మాగ్నిట్యూడ్ స్కేల్ అని పిలుస్తారు. ఈ స్కేల్‌లో 1 నుంచి 9 వరకు భూకంపాల తీవ్రతను అంచనా వేస్తారు. భూకంపం కేంద్రబిందువు (ఎపిసెంటర్) నుంచి విడుదలైన శక్తిని ఆధారంగా తీసుకుని తీవ్రతను నిర్ణయిస్తారు. ఈ తీవ్రత ఆధారంగానే భూకంపం తీవ్రత, దాని ప్రభావాన్ని అంచనా వేస్తారు.

Advertisement
Advertisement