Jagityal Jeevan Reddy : ఈ రోజు మధ్యాహ్నమే.. కేసీఆర్, జీవన్ రెడ్డిల భేటీ
జగిత్యాల సీనియర్ నేత జీవన్ రెడ్డి ఈ రోజు (2026 ఏప్రిల్ 10, శుక్రవారం) మధ్యాహ్నమే బీఆర్ ఎస్ దళపతి కేసీఆర్ తో భేటీ కానున్నారు. కేసీఆర్ నివాస స్థలమైన ఎర్రబెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఈ రోజు ఆయన విచ్చేయనున్నారు. అక్కడే లంచ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి అనుచరులైన కాంగ్రెస్ ను వీడిన నాయకులూ పాల్గొంటారు.
ఈ రోజు మధ్యాహ్నమే.. కేసీఆర్, జీవన్ రెడ్డిల భేటీ
ఎర్రబెల్లిలో లంచ్ ప్రోగ్రాం
Jeevan Reddy | త్రినేత్ర.న్యూస్ : కాంగ్రెస్ పార్టీలో రెండున్నరేళ్లుగా తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్న జగిత్యాల సీనియర్ నేత జీవన్ రెడ్డి ఈ రోజు (2026 ఏప్రిల్ 10, శుక్రవారం) మధ్యాహ్నమే బీఆర్ ఎస్ దళపతి కేసీఆర్ తో భేటీ కానున్నారు. కేసీఆర్ నివాస స్థలమైన ఎర్రబెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఈ రోజు ఆయన విచ్చేయనున్నారు. అక్కడే లంచ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి అనుచరులైన కాంగ్రెస్ ను వీడిన నాయకులూ పాల్గొంటారు. గురువారం నాడు జీవన్ రెడ్డిని బీఆర్ ఎస్ లోకి ఆహ్వానించేందుకు వెళ్లిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ దామోదర్ రావు, ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, పాడి కౌశిక్, గంగుల కమలాకర్, కరీంనగర్ సీనియర్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా ఈ లంచ్ కు హాజరుకానున్నారు. గత మార్చి 25న జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తాను బీఆర్ ఎస్ లోకి చేరుతున్నానని జీవన్ రెడ్డి గురువారం అధికారికంగా ప్రకటించారు
సంతోషంగా ఉంది
కేసీఆర్‌తో కలిసి తమ ఇద్దరి స్నేహాన్ని నెమరేసుకుంటానని సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.ఇది తన జీవితంలోనే సంతోషమైన రోజని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే అవకాశం నాకు లభిస్తునందుకు తనకు చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలందరూ కూడా నా పూర్వ సహచరులే. అందరితో కలిసి పని చేశాను. మారిన పరిస్థితులకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీతో కలిసి పని చేస్తే రాష్ట్ర భవిష్యత్ కోసం పాటు పడే అవకాశం లభిస్తుంది. ఈ అవకాశం కల్పించేందుకు ముందుకు వచ్చినందుకు బీఆర్ఎస్ నాయకత్వానికి ధన్యవాదాలు. నాలుగు దశాబ్దాలకు పైగా ఉన్న అనుబంధాన్ని తెంచుకున్నాను. కేసీఆర్ నాయకత్వంలో పని చేసేందుకు అవకాశం లభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం యావత్ కూడా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతాడని ఎవరూ ఊహించి ఉండరు. రాష్ట్ర భవిష్యత్ ప్రధానమని చెప్పి కాంగ్రెస్ పార్టీని వీడానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.
తిరోగమన దిశలో రాష్ట్రం
కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి అందించారు. ఇంకా మెరుగైన పాలన కోసం ప్రజలు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించారు. ఎన్టీఆర్, చెన్నారెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, వైఎస్సార్, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ప్రభుత్వాలను చూశాం. కానీ రెండేండ్ల కాలంలో పదేండ్లలో సాధించిన ఫలాలు తిరోగమనం దశకు చేరిందని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం






