త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | ఈ అమ్మ ప్ర‌భుత్వం వ‌స్త‌ది.. పేద బిడ్డలంద‌రినీ చ‌దివిస్తా: క‌విత‌

Kavitha | రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తాను మాట ఇస్తున్నాన‌ని.. మ‌న ప్ర‌భుత్వం క‌చ్చితంగా వ‌స్త‌ద‌ని.. పేద బిడ్డ‌ల చ‌దువు (Education) బాధ్య‌త(Responsibility) తానే తీసుకుంటాన‌ని క‌విత అన్నారు. ఎంత వ‌ర‌కు చ‌దివినా త‌ల్లిదండ్రుల మీద ఒక్క రూపాయి భారం ప‌డ‌కుండా చ‌దివించే బాధ్య‌త త‌న‌ద‌ని ప్ర‌క‌టించారు.

S

News | Published On Apr 25, 2026, 12.40 pm IST

Kavitha | ఈ అమ్మ ప్ర‌భుత్వం వ‌స్త‌ది.. పేద బిడ్డలంద‌రినీ చ‌దివిస్తా: క‌విత‌
Advertisement

Kavitha | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తాను మాట ఇస్తున్నాన‌ని.. మ‌న ప్ర‌భుత్వం క‌చ్చితంగా వ‌స్త‌ద‌ని.. పేద బిడ్డ‌ల చ‌దువు (Education) బాధ్య‌త(Responsibility) తానే తీసుకుంటాన‌ని క‌విత అన్నారు. ఎందుకంటే ప్ర‌భుత్వంలో వ‌చ్చేది మీ అమ్మ కాబ‌ట్టి.. అమ్మ జేబు చూడ‌ద‌ని, క‌డుపు చూస్త‌ద‌ని చెప్పారు. మీ పిల్ల‌లు ప్రైవేట్ పాఠ‌శాల‌ల్లో చ‌దువుతున్నా.. ఎంత వ‌ర‌కు చ‌దివినా త‌ల్లిదండ్రుల మీద ఒక్క రూపాయి భారం ప‌డ‌కుండా చ‌దివించే బాధ్య‌త త‌న‌ద‌ని ప్ర‌క‌టించారు.

ప్రైవేట్ పాఠ‌శాల గాని, డాక్ట‌ర్ గాని, ఇంజినీర్ గాని, రాకెట్ సైంటిస్ట్ గానీ తెలంగాణ బిడ్డ‌లు చ‌దువుకుంటే మొత్తం ఉచిత విద్య‌నందించే బాధ్య‌త నాదే. నా తెలంగాణ బిడ్డ‌ల కోసం ఈ బాధ్య‌త‌నెత్తుకుంటా. మీరు ఎంత చ‌దువుకుంట‌రో చదువుకోండి. ఒక్క రూపాయి కూడా మీ మీద భారం ప‌డ‌నియ్యా. ఈ భారం అంతా తెలంగాణ రాష్ట్ర సేన మోస్తది. ప్రైవేట్ పాఠ‌శాల‌లు బాగుంట‌యి.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు బాగుంట‌యి.. కానీ భారం త‌ల్లిదండ్రుల మీద ప‌డ‌దు. ఇది మీ అమ్మ ప్ర‌భుత్వంలో జ‌ర‌గ‌బోతోంది. ఈ త‌ల్లి ప్ర‌భుత్వంలో జ‌ర‌గ‌బోతుంద‌ని మీకు మాటిస్తున్నా అని క‌విత అన్నారు.

Advertisement
Advertisement