Telangana Budget | మాది ప్రజా బడ్జెట్.. ప్రజల అభివృద్ధే లక్ష్యం: మంత్రి వాకిటి శ్రీహరి
Telangana Budget | ప్రజల అభివృద్ధే తమ లక్ష్యమని.. సమగ్ర తెలంగాణే తమ దిశ అని మంత్రి వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari) అన్నారు. ఈ బడ్జెట్ (Budget) తెలంగాణను మరింత శక్తివంతమైన, సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్తుందని చెప్పారు. ప్రజల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
త్రినేత్ర.న్యూస్: ప్రజల అభివృద్ధే తమ లక్ష్యమని.. సమగ్ర తెలంగాణే తమ దిశ అని మంత్రి వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari) అన్నారు. ఈ బడ్జెట్ (Budget) తెలంగాణను మరింత శక్తివంతమైన, సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్తుందని చెప్పారు. ప్రజల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బడ్జెట్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతూ, సమగ్ర అభివృద్ధికి మార్గదర్శకం తమ ప్రభుత్వ బడ్జెట్ ఉందన్నారు. పశుసంవర్ధక, క్రీడలు, యువజన శాఖలకు అధిక నిధులు కేటాయించిన సీఎం, డిప్యూటీ సీఎంలకు కృతజ్ఞతలు-తెలిపారు.
రైతు నుంచి విద్యార్థి వరకు, యువత నుంచి మహిళల వరకు ప్రతి వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ బడ్జెట్ కేవలం సంఖ్యల సమాహారం కాకుండా సామాజిక న్యాయం, అభివృద్ధి, సంక్షేమం కలిసిన ప్రజా బడ్జెట్ అని స్పష్టం చేశారు. గతంలో అభివృద్ధి అసమానంగా ఉండటం వల్ల కొన్ని వర్గాలు వెనుకబడిన పరిస్థితి కనిపించిందని, ఆ సమస్యను దృష్టిలో ఉంచుకుని ఈసారి ప్రభుత్వం సమతుల అభివృద్ధి లక్ష్యంగా కేటాయింపులు చేసినట్లు మంత్రి వివరించారు.
వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తూ రైతు సంక్షేమానికి విస్తృత నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాల్లో నాణ్యత పెంపునకు ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. యువతకు ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధికి కొత్త అవకాశాలు కల్పించడం వంటి అంశాలు ఈ బడ్జెట్ ప్రత్యేకతగా నిలుస్తాయన్నారు. క్రీడా రంగ అభివృద్ధికి ఆధునిక సదుపాయాల ఏర్పాటు, మహిళల ఆర్థిక సాధికారతకు మరిన్ని అవకాశాలు కల్పించడం ద్వారా సమాజంలోని ప్రతి వర్గం బలోపేతం కావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని మంత్రి తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం స్థిరంగా ఎదుగుతుందనే దృక్పథంతో ఈ బడ్జెట్ రూపొందించినట్లు ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
- ●Telangana Activists Identification | ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి 250 గజాల స్థలం, ఆసరా పెన్షన్, హెల్త్ కార్డు, ఉచిత ఆర్టీసీ ప్రయాణం
- ●Taapsee | నాలుగేళ్ల తర్వాత తెలుగు సినిమాలో తాప్సీ - బాలీవుడ్లో ఆఫర్లు తగ్గడమే కారణమా?
- ●Subhash Chandra | సుభాష్ చంద్రకు బ్యాంకుల షాక్.. అప్పీలేట్కి వెళ్లనున్న ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలు..
- ●బయటపడ్డ బయోలాజికల్ వార్.. మహిళా క్రికెట్లో ట్రాన్స్జెండర్ల ఎంట్రీపై భగ్గుమంటున్న నిరసనలు!
- ●Harish Rao | రేవంత్! దివ్యాంగులపై మానవత్వం లేదా? వారికిస్తానన్న రూ.6,000 పెన్షన్ ఏది?
- ●realme C100i | రూ.14,999కే రియల్మి కొత్త ఫోన్.. 6500 ఎంఏహెచ్ బ్యాటరీ..

Telangana Activists Identification | ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి 250 గజాల స్థలం, ఆసరా పెన్షన్, హెల్త్ కార్డు, ఉచిత ఆర్టీసీ ప్రయాణం

Taapsee | నాలుగేళ్ల తర్వాత తెలుగు సినిమాలో తాప్సీ - బాలీవుడ్లో ఆఫర్లు తగ్గడమే కారణమా?

Subhash Chandra | సుభాష్ చంద్రకు బ్యాంకుల షాక్.. అప్పీలేట్కి వెళ్లనున్న ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలు..

బయటపడ్డ బయోలాజికల్ వార్.. మహిళా క్రికెట్లో ట్రాన్స్జెండర్ల ఎంట్రీపై భగ్గుమంటున్న నిరసనలు!





