realme C100i | రూ.14,999కే రియల్‌మి కొత్త ఫోన్.. 6500 ఎంఏహెచ్ బ్యాటరీ..
realme C100i | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మి తాజాగా భారత్‌లో సి సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇటీవల సి100ఎక్స్ మోడల్‌ను తీసుకొచ్చిన సంస్థ ఇప్పుడు రియల్‌మి సి100ఐ పేరుతో కొత్త 4జి స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్‌లో 6.8 ఇంచుల హెచ్‌డీ ప్లస్ 120 హెడ్జ్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు.
Technology | Published On Aug 29, 2026, 4.49 pm IST
realme C100i | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మి తాజాగా భారత్‌లో సి సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇటీవల సి100ఎక్స్ మోడల్‌ను తీసుకొచ్చిన సంస్థ ఇప్పుడు రియల్‌మి సి100ఐ పేరుతో కొత్త 4జి స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్‌లో 6.8 ఇంచుల హెచ్‌డీ ప్లస్ 120 హెడ్జ్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. యూనిసాక్ టి7250 ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 4జీబీ ర్యామ్‌తో పాటు 12జీబీ వరకు వర్చువల్ ర్యామ్‌ను ఇచ్చారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మి యూఐ 6.0తో పనిచేస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా, ముందు భాగంలో 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. దుమ్ము, నీటి తుంపర్ల నుంచి రక్షణ కోసం ఐపీ64 రేటింగ్‌ను అందించారు. హారిజన్ కెమెరా డెకో, గుండ్రని మూలలతో ఫోన్ డిజైన్‌ను రూపొందించారు.
భారీ బ్యాటరీ..
మన్నిక విషయంలోనూ ఈ ఫోన్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు రియల్‌మి తెలిపింది. ఆర్మర్‌షెల్ ప్రొటెక్షన్‌ను కలిగిన ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ డ్రాప్, కంప్రెషన్ పరీక్షల్లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించిందని కంపెనీ పేర్కొంది. రెండు మీటర్ల ఎత్తు నుంచి పడే పరీక్షను కూడా ఫోన్ తట్టుకున్నట్లు తెలిపింది. తీవ్ర పరిస్థితుల్లోనూ ఫోన్ మన్నికగా ఉండేలా రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది. ఇందులో 6500 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. దీనికి 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సదుపాయం కూడా అందించారు. సాధారణంగా 700 నిట్స్, హెచ్‌బీఎం మోడ్‌లో 900 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. డిస్‌ప్లేకు పాండా ఎంఎన్228 గ్లాస్ రక్షణ ఉంది. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ను అందించారు. మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 2 టీబీ వరకు పెంచుకోవచ్చు. డ్యుయల్ నానో సిమ్‌లతోపాటు ప్రత్యేక మైక్రోఎస్‌డీ స్లాట్ కూడా ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ను ఇచ్చారు.3.5 ఎంఎం ఆడియో జాక్, అల్ట్రా లీనియర్ బాటమ్-పోర్టెడ్ స్పీకర్ కూడా ఉన్నాయి. డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 5.2, యూఎస్‌బీ టైప్ సి పోర్ట్ ఉన్నాయి.
ధర వివరాలు..
రియల్‌మి సి100ఐ స్కైలైన్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లాక్ రంగుల్లో లభిస్తోంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ కలిగిన ఏకైక వేరియంట్ ధరను రూ.14,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ ప్రస్తుతం రియల్‌మి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. త్వరలో ఇతర ఆన్‌లైన్ రిటైలర్లతో పాటు ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్



