త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Budget | ఇది ఫెయిల్డ్‌ బ‌డ్జెట్, ఓటు బ్యాంకు బ‌డ్జెట్, ఫ్యాన్సీ బ‌డ్జెట్‌, డోస్ లేదు: బీజేపీ చీఫ్ రామచంద‌ర్‌రావు

Telangana Budget | కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ (Budget) పేద‌ల‌కు దూరంగా ఉంద‌ని, ఆరు గ్యారెంటీల‌కు అస‌లు కేటాయింపులే చేయ‌లేద‌ని బీజేపీ చీఫ్ ఎన్ రామ‌చంద‌ర్‌రావు (BJP Ramchandar Rao) అన్నారు. ఇదొక ఫెయిల్ బ‌డ్జెట్‌, ఫ్యాన్సీ బ‌డ్జెట్‌, ఓటు బ్యాంక్‌ బ‌డ్జెట్ అంటూ ఫైర‌య్యారు.

S

News | Published On Mar 20, 2026, 4.35 pm IST

Telangana Budget | ఇది ఫెయిల్డ్‌ బ‌డ్జెట్, ఓటు బ్యాంకు బ‌డ్జెట్, ఫ్యాన్సీ బ‌డ్జెట్‌, డోస్ లేదు: బీజేపీ చీఫ్ రామచంద‌ర్‌రావు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ (Budget) పేద‌ల‌కు దూరంగా ఉంద‌ని, ఆరు గ్యారెంటీల‌(six guarantees) కు అస‌లు కేటాయింపులే చేయ‌లేద‌ని బీజేపీ చీఫ్ ఎన్ రామ‌చంద‌ర్‌రావు (BJP Ramchandar Rao) అన్నారు. ఇదొక ఫెయిల్డ్‌ బ‌డ్జెట్‌, ఫ్యాన్సీ బ‌డ్జెట్‌, ఓటు బ్యాంక్‌ బ‌డ్జెట్ అంటూ ఫైర‌య్యారు. బ‌డ్జెట్ అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. గ‌త‌ బ‌డ్జెట్‌తో పోలిస్తే ఇందులో పెద్ద‌గా మార్పులు లేవ‌న్నారు. రెండున్న‌రేళ్ల త‌ర్వాత ప్ర‌భుత్వం ఏం చేసిందో చెప్పుకుందని, కానీ సాధించిన ఫ‌లితాల గురించి ఎక్క‌డా మాట్ల‌డ‌లేద‌ని మండిప‌డ్డారు. సంజ‌య్ గాంధీ మైండ్ కు త‌గ్గ‌ట్టు బ‌డ్జెట్ త‌యారు చేశారని ఆరోపించారు.

మూడు ముక్క‌ల‌కు ఏమిచ్చారు?

హైద‌రాబాద్ ను మూడు ముక్క‌లు చేశార‌ని, వాటి అభివృద్ధికి నిధులు మాత్రం కేటాయించ‌లేద‌ని ఆరోపించారు. రోడ్ల అభివృద్ధిని గాలికొదిలేసినట్లు చెప్పారు. హైద‌రాబాద్‌కు బ‌డ్జెట్‌లో సున్నా కేటాయింపులు చేసిన‌ట్లు విమ‌ర్శించారు. కేవ‌లం మూసీకి నిధులిస్తే హైద‌రాబాద్ అభివృద్ధి అయిన‌ట్లేనా అని ప్ర‌శ్నించారు. మొత్తానికి ఈ బడ్జెట్‌ ప్ర‌జ‌ల ఆశ‌ల‌ను భంగం చేసింద‌న్నారు.

విద్య‌కు మొండిచెయ్యి..

గ‌త బ‌డ్జెట్ కంటే ఈసారి విద్యా రంగానికి వెయ్యి కోట్లు పెంచార‌ని, ఓవ‌రాల్ బడ్జెట్‌లో కేవ‌లం 8. 6 శాతం విద్య‌కు కేటాయించ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ఇత‌ర రాష్ట్రాల‌తో పోలిస్తే చాలా త‌క్కువ అని చెప్పారు. ప‌క్క రాష్ట్రం ఏపీ 13 శాతం, బీహార్ 21 శాతం నిధులు కేటాయించి విద్య‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయ‌ని గుర్తు చేశారు. ఇంటిగ్రేటెడ్ కాలేజీలు అదీ ఇదీ అని చెప్పుకోవ‌డం త‌ప్ప విద్య‌ను మెరుగుప‌రిచే ఆలోచ‌న‌లు ఈ ప్ర‌భుత్వానికి లేవ‌న్నారు.

ఆరోగ్య‌శ్రీ‌కే దిక్కు లేదు.. ఇంకా లింకులేంది?

ఆరోగ్య రంగంపై పెద్ద ప్ర‌య‌త్నం చేయ‌లేదని ఎద్దేవా చేశారు. సంక్షేమ ప‌థ‌కాలకు స‌రిప‌డా నిధుల కేటాయింపులు లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మ‌న్నారు. ఆరోగ్య‌శ్రీకే నిధులు దిక్కు లేవంటే అందులో ప్ర‌భుత్వ ఉద్యోగులు, పెన్ష‌న‌ర్ల‌కు లింకు పెట్ట‌డం విడ్డూరమ‌న్నారు. లింకు పెట్టి వాటిని కూడా దివాలా తీసేలా ప్ర‌భుత్వం ప్ర‌యత్నం చేస్తోంద‌ని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ నీరుగారిన‌ట్లే ఉద్యోగ‌లు ఇబ్బంది ప‌డాలా అని ప్ర‌శ్నించారు.

ఫ్యూచ‌ర్ సిటీ పెట్టినం అంటున్నార‌ని కానీ మాటల్లో ఉన్న ప‌ని చేత‌ల్లో లేద‌ని ఎద్దేవా చేశారు. ఏరో స్పేస్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కింద వ‌చ్చిందే త‌ప్ప కాంగ్రెస్ చేసిందేం లేద‌ని విమ‌ర్శించారు. అందులో మీ ఘ‌న‌త ఏమాత్రం లేదన్నారు. రీజిన‌ల్ రింగ్ రోడ్డుకు కేంద్రమే నిధులు ఇస్తోంద‌ని కేవ‌లం భూమి మాత్ర‌మే మీరిచ్చార‌ని కాంగ్రెస్ ను ఉద్దేశించి అన్నారు. రింగ్ రోడ్డుకు ద‌గ్గ‌ర్లో గోడౌన్స్ నిర్మాణం, స‌ర‌కుల‌ను ఇత‌ర ప్రాంతాల‌కు పంపించ‌డం. ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లోపేతం కోసం కేంద్రం ఎంతో స‌హ‌క‌రిస్తుంద‌ని చెప్పారు. మొత్తం కేంద్రం ఫండింగ్ వీబీ జీ రామ్ జీ లో రాష్ట్రాల భాగ‌స్వామ్యం అవ‌స‌ర‌మ‌న్నారు. ఎందుకంటే ఈ ప‌థ‌కంలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయ‌ని, దేశానికి కోట్ల రూపాయ‌ల న‌ష్టం వాటిళ్లుతున్న‌ట్లు వివ‌రించారు. దీన్ని అరిక‌ట్టేందుకు రాష్ట్రాలు భాగం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు. ప్ర‌జ‌ల సొమ్మును కాపాడే బాధ్య‌త ప్ర‌తిఒక్క‌రిపై ఉంద‌న్నారు. ఇందులో మోదీ రూపాయి పెడితే రూపాయి ప్ర‌జ‌ల‌కు చేరుతుంద‌ని, ఇంత‌కు ముందు అలా జ‌ర‌గ‌లేదని పేర్కొన్నారు.

ఐదు ద‌ఫాలు రైతు భ‌రోసా ఇవ్వాలే..

ఏటా రైతుభ‌రోసా కింద రూ.15000 వేల రూపాలు ఇస్త‌మ‌ని ప్ర‌క‌టించినా ఇప్ప‌టికీ మూడు ద‌ఫాలే ఇచ్చార‌ని గుర్తు చేశారు. ఒక్కో రైతుకు ఇంకా 45 వేలు ఎగ్గొట్టారన్నారు. క్యూర్‌, ప్యూర్ అంటే పేద‌వాళ్ల ఇండ్లు కూల‌గొట్టి అభివృద్ధి చేయ‌డ‌మా అని ప్ర‌శ్నించారు. గాంధీది పెద్ద విగ్ర‌హం వ‌ద్ద‌ని స్వ‌యంగా తుషార్ గాంధీ చెప్పార‌ని, అయినా ఈ ప్ర‌భుత్వంలో చ‌ల‌నం లేద‌ని మండిప‌డ్డారు. మూసీ ప‌వ‌ర్ ప్ర‌జెంటేష‌న్ కు ముందు రూ.5వేల కోట్లు అని, త‌ర్వాత 7 వేల కోట్లు అని చెప్ప‌డం చూస్తే మీ ప‌నిత‌నం అర్థ‌మ‌వుతుంద‌న్నారు. అస‌లు ప్ర‌ణాళిక లేకుండా ప‌నులెలా చేస్తార‌ని ప్ర‌శ్నించారు. బ‌డ్జెట్ ఫీజు రీయంబర్స్‌మెంట్ ప్ర‌స్తావ‌న లేక‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు. నిరుద్యోగుల ఊసే ఎత్త‌లేద‌ని ఫైర‌య్యారు.

రూ.500 గ్యాస్ చేర‌ల్లేదు..

గ్యాస్ విష‌యంలో చాలా ఫిర్యాదులు వ‌స్తున్నాయ‌ని బీజేపీ చీఫ్ అన్నారు. రూ.500 గ్యాస్ ఎవ‌రికిస్తున్నారో కాంగ్రెస్ నాయ‌కులే చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఫించ‌న్లు కూడా ఇచ్చే దిక్కు లేద‌న్నారు.

అర్చ‌కుల‌కు వేత‌నాలివ్వాలి...

ప్ర‌భుత్వ‌మే అర్చ‌కుల‌కు వేత‌నాలు ఇవ్వాల‌ని కోరారు. ఇందుకు బ‌డ్జెట్ పెంచాల‌ని సూచించారు. దాడుల‌కు గురైన ఆల‌యాల మ‌రమ్మ‌తులు చేయాల‌న్నారు. దేశంలో ఎక్క‌డా లేని ఆల‌యాలు తెలంగాణ‌లో ఉన్న‌యాని, కానీ వాటి ర‌క్ష‌ణ ప్ర‌శ్నార్థ‌కంగా త‌యారైంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మైనారీటి బడ్జెట్ పెంచారని.. మిగతా మ‌తాలు ఏం పాపం చేశాయ‌ని ప్ర‌శ్నించారు. వారికి ఎందుకు పెంచ‌లేద‌న్నారు.

ఇండ్లు ఎవ‌రికిచ్చారు?

ఇది ఏదీ అమ‌లు ప‌రిచే బ‌డ్జెట్ కాద‌న్నారు. ఇందిర‌మ్మ ఇల్లు ఎంత‌మందికి ఇచ్చారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. బ‌డ్జెట్‌లో చాలా అంశాలున్నాయ‌ని కానీ అందులో డోస్ లేదన్నారు. ట్రిలియ‌న్ల ఎకాన‌మీ అని చెప్తున్నార‌ని కానీ అది సాధ్య‌మేనా అని నిల‌దీశారు.

 

 

 

Advertisement

తాజావార్తలు

Advertisement