RS Praveen Kumar | తెలంగాణ మహిళలకు బండి భగీరథ్‌తో ప్రమాదముంది: ఆర్ఎస్ ప్రవీణ్
RS Praveen Kumar | తెలంగాణ మహిళా లోకానికి బండి భగీరథ్ (Bandi Bhagirath) తో ప్రమాదం పొంచి ఉందని, మరోవైపు తనను ఇబ్బంది పెట్టిన వారిని ఏ ఒక్క వ్యక్తి వదిలి పెట్టనని బండి సంజయ్ ను అంటున్నాడు.. దీంతో బాధితురాలి తల్లి భయపడుతోందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి ఫోటోలను సోషల్ మీడియా నుంచి వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
- కవిత బాధితురాలి బాధను ఒకసారి చూడాలి
- ఆమె కాంగ్రెస్, బీజేపీ స్క్రిప్ట్ చదివి మర మనిషిలా మారారు
- సీతక్క, కొండా సురేఖ మీడియా సమావేశం పెట్టి భగీరత్ గురించి తెలియజేయాలి
- సోషల్ మీడియా నుంచి బాలిక ఫొటోలు వెంటనే తొలగించాలి
- బండి సంజయ్ వ్యాఖ్యలతో బాలిక తల్లి భయపడుతోంది
- ఓ సీనియర్ పోలీసు అధికారి సలహాతోనే కరీంనగర్‌లో బాలికపై భగీరథ్ కేసు పెట్టాడు
- బండి సంజయ్ ను కలవాలంటే ముందు బండి భగీరథ్ ను కలవాలట
- మీడియా సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు
RS Praveen Kumar |త్రినేత్ర.న్యూస్: తెలంగాణ మహిళా లోకానికి బండి భగీరథ్ (Bandi Bhagirath) తో ప్రమాదం పొంచి ఉందని, మరోవైపు తనను ఇబ్బంది పెట్టిన వారిని ఏ ఒక్క వ్యక్తి వదిలి పెట్టనని బండి సంజయ్ ను అంటున్నాడు.. దీంతో బాధితురాలి తల్లి భయపడుతోందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సీతక్క మీడియా సమావేశం ఏర్పాటు చేసి బండి భగీరథ్ గురించి మహిళ లోకానికి తెలియజేయాలన్నారు. సీతక్క, కొండ సురేఖ డీజీపీతో మాట్లాడి బాధితురాలి ఫోటోలను సోషల్ మీడియా నుంచి వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన తెలంగాణ భవన్‌లో గురువారం మీడియాతో మాట్లాడారు.
సీతమ్మ కోసం ఆంజనేయుడు లంకను దహనం చేశాడు. ఆంజనేయుడు పేరు తీసే అర్హత బండి సంజయ్ కు లేదు. బండి సంజయ్ ఎవరిని బయపెట్టిస్తున్నాడు, బాధితురాలను బెదిరిస్తున్నారా? మమ్మల్ని బెదిరిస్తున్నారా? బండి సంజయ్ వ్యాఖ్యలతో బాధితురాలు తల్లి భయపడుతుంది అని ఆర్ఎస్‌పీ వాపోయారు.
పోలీసులు మీడియా సమావేశం ఎందుకు పెట్టలేదు?
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన పోక్సో కేసు పై మైనర్ బాలికకు అండగా ఉన్న యావత్ తెలంగాణ ప్రజలకు నమస్కరిస్తున్నాం. ఇంతమంది పోరాటం చెయ్యకుంటే పోక్సో కేసు బయటకు రాకపోతుండే. చట్టానికి వ్యతిరేకంగా బండి భగీరథ్ మామకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. బండి భగీరథ్ కు నేర చరిత్ర ఉంది, ఆ విషయం పోలీసులకు తెలుసు. తెలంగాణ మహిళ లోకానికి బండి భగీరథ్ తో ప్రమాదం పొంచి ఉంది. భగీరథ్ పై నమోదు అయిన పోక్సో కేసుపై పోలీసులు మీడియా సమావేశం ఎందుకు పెట్టలేదు? భగీరథ్ ను రక్షించాలనే ఆలోచన రేవంత్ రెడ్డికి ఉన్నట్లు కనిపిస్తుంది అని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు.
ఐపీఎస్ అధికారిణి రీతురాజ్‌కు ధన్యవాదాలు..
ఈరోజు ఉదయం బాధితురాలు తల్లి నాతో మాట్లాడి ఆవేదనతో కొన్ని విషయాలు చెప్పుకుంది. రీతురాజ్ IPS అధికారికి ధన్యవాదాలు, ఆమె కేసును వేగవంతం చేస్తుంది. బాధితురాలి వ్యక్తిత్వాన్ని అడుగడుగున నాశనం చెయ్యాలని చూస్తున్నారు. ఆమెపై సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రితో బాధితురాలు తల్లి కొట్లాట చేస్తాను అని నాతో చెప్పింది. బాధితురాలి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నాశనం చేస్తున్నారు అని బాధితురాలు తల్లి ఆవేదన చెందుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక అమ్మాయి ఉంది ఆ బాధ ఎలా ఉంటుందో ఆయనకు తెలుస్తుంది. సీతక్క, కొండ సురేఖ డీజీపీతో మాట్లాడి బాధితురాల ఫోటోలను సోషల్ మీడియా నుంచి వెంటనే తీసివేసేలా చర్యలు తీసుకోవాలి అని ఆయన డిమాండ్ చేశారు.
డీజీపీ చెప్పేలోపే భగీరథ్ పారిపోయాడు..
ప్రధానిమంత్రి మోదీ బందోబస్తు ఉండడంతో కేసు విచారణ చేయలేకపోయామని డీజీపీ చెప్పేలోపే బండి భగీరథ్ పారిపోయారు. నిందితుడి తండ్రితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీటింగ్ లో పాల్గొన్న తరువాత కేసు గురించి ఇంకేం విచారణ ఉంటుంది. బీజేపీ నాయకులు బాధిత మహిళను మేజరా, మైనరా అని చర్చ చెయ్యడం బాధాకరం. కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టుకున్నప్పుడు తెలంగాణకు అమ్మలా ఉంటానని చెప్పి మర మనిషిగా ఉంటున్నారు. తెలంగాణ అమ్మలా ఉండాలని అనుకుంటున్న కవిత, బాధితురాల అమ్మ బాధ ఒకసారి చూడాలి. రేవంత్ రెడ్డి, బీజేపీ స్క్రిప్ట్ కవిత చదవి మర మనిషిలా ఉంటున్నారు. బీఆర్ఎస్ నాయకుల వల్లే బాధితురాల వివరాలు బయటకు వచ్చాయి అని కవిత అనడం సరికాదు అని ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు.
పెంపకంలో లోపం ఉంటేనే ఇలాంటివి జరుగుతాయి..
ఒక సీనియర్ పోలీస్ అధికారి సలహా వల్లే బండి భగీరథ్ కరీంనగర్ లో భాదితురాలిపై కేసు పెట్టాడు. యూనివర్సిటీలో బండి భగీరథ్ ఇష్యూ అయినప్పుడే తన తండ్రి భగీరథ్ ను బయటకు పంపించుకోవాలి. బండి సంజయ్ కొడుకు పెంపకంలో తేడా ఉంది. పిల్లలు అందరు ఒకటే. పెంపకంలో లోపం ఉన్నప్పుడే ఇలాంటివి జరుగుతాయి. బండి సంజయ్ ను కలవాలి అంటే ముందు బండి భగీరథ్ ను కలవాలి అని కరీంనగర్ ప్రజలే అంటున్నారు. బండి భగీరథ్ కరీంనగర్ లో భాదితురాలిపై పెట్టిన కేసులో సెక్షన్ ఒకలా ఉన్నాయి. బండి భగీరథ్ పై బాధితురాలు పెట్టిన కేసులో సెక్షన్ 6 , 8 పెట్టకుండా పోలీసులు నిర్లక్ష్యం చేశారు అని ఆయన ఫైరయ్యారు.
పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి..
బాధితురాలిపై సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్న వారి పై చర్యలు తీసుకోవాలి. రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ప్రజలకు రక్షణ లేదు. రిటైర్డ్ డీజీ ర్యాంక్ పోలీస్ అధికారి భార్యను పట్టపగలే నేపాల్ గ్యాంగ్ హత్య చేసింది. దేశం కోసం ధర్మం కోసం పోక్సో కేసుల్లో అత్యధికంగా బీజేపీ నేతల పైనే ఎక్కువ.
బాధితురాలకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేతలు బొమ్మెర రామమూర్తి, ఫయాజ్ పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



