త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shobharani | కొత్త‌గా మ‌హిళా బిల్లు అవ‌స‌రమే లేదు: రాష్ట్ర మ‌హిళా కార్పొరేష‌న్ చైర్మ‌న్ శోభారాణి

Women reservation bill | మ‌హిళా బిల్లు (Women's Bill) కొత్త‌గా అవ‌స‌రం లేద‌ని, యూపీఏ (UPA) హ‌యాంలో తెచ్చిన బిల్లునే ఉన్న‌ది ఉన్న‌ట్లుగా అమ‌లు చేయాల‌ని రాష్ట్ర మ‌హిళా కార్పొరేష‌న్ చైర్మ‌న్ శోభారాణి (Shobharani) అన్నారు. పార్ల‌మెంటులో అస‌లు మ‌హిళా బిల్లే పెట్ట‌లేద‌ని.. వీగిపోయే ఆస్కారమే లేద‌న్నారు.

S

News | Published On Apr 18, 2026, 12.51 pm IST

Shobharani | కొత్త‌గా మ‌హిళా బిల్లు అవ‌స‌రమే లేదు: రాష్ట్ర మ‌హిళా కార్పొరేష‌న్ చైర్మ‌న్ శోభారాణి
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: మ‌హిళా బిల్లు (Women's Bill) కొత్త‌గా అవ‌స‌రం లేద‌ని, యూపీఏ (UPA) హ‌యాంలో తెచ్చిన బిల్లునే ఉన్న‌ది ఉన్న‌ట్లుగా అమ‌లు చేయాల‌ని రాష్ట్ర మ‌హిళా కార్పొరేష‌న్ చైర్మ‌న్ శోభారాణి (Shobharani) అన్నారు. పార్ల‌మెంటులో అస‌లు మ‌హిళా బిల్లే పెట్ట‌లేద‌ని.. వీగిపోయే ఆస్కారమే లేద‌న్నారు. శ‌నివారం గాంధీభ‌వ‌న్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. బీజేపీ (BJP) తెచ్చిన బిల్లులో మ‌హిళా బిల్లు అనేది ఎక్క‌డా లేద‌న్నారు. భార‌త‌మాత‌కు వార‌సులుగా ఉన్నామంటూనే పార్ల‌మెంటు సాక్షిగా మ‌హిళ‌ల‌ను ఎందుకు అవ‌మానప‌రుస్తున్న‌ర‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌ధాని మోదీతో పాటు బీజేపీ నాయ‌కులు దేశంలోని మ‌హిళా లోకానికి క్ష‌మాప‌ణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇంకో అవ‌కాశం ఉంది..

ఈరోజు కూడా ఇంకో అవ‌కాశం ఉంది. యూపీఏ పెట్టిన బిల్లును ఉన్న‌ది ఉన్న‌ట్లు అమ‌లు చేయండి. మోదీ, అమిత్‌షా, బీజేపీ నాయ‌కులు రాజ‌కీయ అవ‌స‌రాల కోసం, రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల కోసం మ‌హిళ‌ల‌ను అడ్డం పెట్టుకుంటున్నారు. ఇలా రాజ‌కీయాలు చేస్తే భ‌విష్య‌త్‌లో బీజేపీకి మ‌నుగ‌డ ఉండ‌దు. 2023లో నారీ శ‌క్తి అని ఒక పెద్ద పేరు వెట్టుకొని వ‌చ్చిన వీళ్లు 543 స్థానాల్లో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ తీసుకురావాలి. 1\3 రిజ‌ర్వేష‌న్ మాకు కేటాయించాల‌ని డిమాండ్ చేస్తున్నం అని శోభారాని అన్నారు.

నోటితో చెప్పుకొంటూ నొస‌లుతో ఎక్కిరిచ్చే ప్ర‌య‌త్నమిది...

మ‌హిళా బిల్లును అమలు చేయాల‌ని లేద‌న్న‌ది బీజేపీ తీరును చేస్తూ స్ప‌ష్ట‌మ‌వుతుంది. ఎందుకంటే వాళ్ల ఆలోచ‌న ఒక‌లా, మాట్లాడే విధానం మ‌రోలా ఉంది. నోటితో చెప్పుకొంటూ నొస‌లుతో ఎక్కిరిచ్చే ప్ర‌యత్నం చేస్తున్న‌రు. ఇదంతా మ‌హిళ‌లు గ‌మ‌నిస్తున్న‌రు. కాంగ్రెస్ పార్టీ భాజ‌పాకు అనేకమార్లు ఒక విష‌యం చెప్పింది. ఉమెన్ రిజ‌ర్వేష‌న్ బిల్లు కొత్తగా తెచ్చే అవ‌స‌రం లేదు. గ‌తంలో 2010లో కాంగ్రెస్ తెచ్చిన బిల్లు ఏదైతే ఉందో అది రాజ్య‌స‌భ‌లో పూర్తిగా ఆమోదం పొందింది. ఆ బిల్లును ఇంప్లిమెంటేష‌న్ చేయ‌డానికి చర్య‌లు తీసుకోండి. డీలిమిటేష‌న్ అని భాజ‌పా కొత్త నాట‌కానికి తెర తీసింది అని ఆమె ఆరోపించారు.

ఉత్త‌ర భార‌తంలో సీట్లు పెంచుకునే కుట్ర‌..

పార్ల‌మెంటులో అన్నీ దొంగ మాట‌లే చెప్పారు. వారు తీసుకొచ్చిన మూడు బిల్లుల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది ఏంటంటే ఎక్క‌డా కూడా మ‌హిళా బిల్లు లేదు. ఒక‌టి 131 రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లు.. రెండోది డీలిమిటేష‌న్-2026, మూడోది కేంద్ర పాలిత ప్రాంతాల చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు-2026. ఇందులో మ‌హిళా బిల్లు ఎక్క‌డ ఉంది? మ‌హిళా బిల్లు అనే ప‌ద‌మే లేదు క‌దా. ఏదో రకంగా డొంక‌తిరుగుడు మాట‌లు చెప్పి ఉత్త‌ర భార‌త్‌లో సీట్లు పెంచుకునే ప్ర‌యత్నం చేస్తున్న‌రు. మ‌ళ్లీ అధికారం పొందాలని ప్ర‌యత్నం చేస్తున్న‌రు.

అమిత్ షా, కిష‌న్‌రెడ్డి, బీజేపీ నాయ‌కులంతా 50 సీట్లు పెంచుతున్నామ‌ని చెప్పారు. ఇది కూడా బిల్లు లేదు. కేవ‌లం జ‌నాభా ప్రాతిప‌దిక‌నే సీట్లు పెంచుకోవాల‌నేది బీజేపీ ప్ర‌ధాన‌ ఎజెండా. దీని ప్ర‌కారం ఉత్త‌రంలో సీట్లు పెరుగుత‌య్‌. దీని వ‌ల్ల బీజేపీకి లాభం జ‌రుగుత‌ది. మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌నేది వీరి కోరిక‌. బ‌ట్ట‌కాల్చి మీదేయడం కాదు. ప్ర‌తిప‌క్షాల‌ను బ‌ద్నాం చేయ‌డం కాదు. పొద్దున లేస్తే కాంగ్రెస్ పార్టీ ఉమెన్ రిజ‌ర్వేష‌న్ బిల్లుకు స‌హ‌క‌రిస్త‌లేదని మాట్లాడుతున్న‌రు. అందుకే పార్ల‌మెంటులో బిల్లు వీగిపోయింద‌ని చెబుతున్న‌రు. అస‌లు బిల్లే పెట్ట‌లేదు. వీగిపోయే ఆస్కారమే లేదు. వాళ్లు తెచ్చిన బిల్లు కూడా ప‌క్క‌కు పోయి జ‌నాభా ప్రాతిప‌దిక‌న సీట్లు పెంచుకోవాల‌నే కుట్ర అది అని శోభారాణి మండిప‌డ్డారు.

Advertisement
Advertisement