త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pochampally Handloom | పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్‌ను పున‌రుద్ధ‌రించాలి: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

Pochampally Handloom | పోచంప‌ల్లి హ్యాండ్లూమ్ (Pochampally Handloom) పార్క్‌ను పున‌రుద్ధ‌రించాల‌ని, దీనికోసం రూ.14 కోట్లు విడుదల చేయాలని కేంద్ర జౌళీ మంత్రిత్వ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌ (Giriraj Sing) ను భువ‌న‌గిరి (Bhuvanagiri) లోక్‌సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) కలిసి విన‌తిప‌త్రం అంద‌జేశారు.

A

News | Published On Dec 18, 2025, 4.27 pm IST

Pochampally Handloom | పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్‌ను పున‌రుద్ధ‌రించాలి: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
Advertisement

Pochampally Handloom | పోచంప‌ల్లి హ్యాండ్లూమ్ (Pochampally Handloom) పార్క్‌ను పున‌రుద్ధ‌రించాల‌ని భువ‌న‌గిరి (Bhuvanagiri) లోక్‌సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) డిమాండ్ చేశారు. పార్కు పునరుద్ధరణకు రూ.14 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఈ మేర‌కు కేంద్ర జౌళీ మంత్రిత్వ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌ (Giriraj Sing) ను కలిసి విన‌తిప‌త్రం అంద‌జేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ పోచంపల్లి ఇక్క‌త్ హ్యాండ్లూమ్ అభివృద్ధి పథకం కింద ఈ నిధులు అవసరమని అన్నారు. గతంలో బ్యాంకుల నుండి తీసుకున్న PMD రుణాల బకాయిల కారణంగా ఈ హ్యాండ్లూమ్ పార్క్ నిర్వీర్యమై వేలానికి వెళ్లిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్లూమ్ పార్క్‌ను కొనుగోలు చేసి, సంప్రదాయ నేత‌ వృత్తిదారుల జీవనోపాధిని కాపాడుతూ హ్యాండ్లూమ్ కార్యకలాపాలను పునరుజ్జీవింపజేయడానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

పోచంపల్లి ఇక్క‌త్‌కు ఉన్న అంతర్జాతీయ గుర్తింపు దృష్ట్యా, ఈ నిధులు విడుదలైతే హ్యాండ్లూమ్ పార్క్ పునరుద్ధరించబడటంతో పాటు స్థానిక నేత‌వృత్తిదారులకు ఉపాధి ల‌భిస్తుంద‌ని చెప్పారు. దీంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమ‌వుతుంద‌ని పేర్కొన్నారు. భారతదేశపు విలువైన హ్యాండ్లూమ్ వారసత్వ పరిరక్షణకు దోహదపడుతుందని అభిప్రాయ‌ప‌డ్డారు. నేత‌వృత్తిదారుల హితాన్ని దృష్టిలో ఉంచుకొని, చారిత్రక పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా, వేగవంతమైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement