MP Chamala Kirankumar Reddy | తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరు.. రేవంత్‌ను తిడితే మీకు మార్కులు పడవు: కవిత కొత్త పార్టీపై ఎంపీ చామల రియాక్షన్
MP Chamala Kirankumar Reddy | కవిత తెల్ల కాగితం కాదని.. ప్రజలు ఆమెను నమ్మే పరిస్థితిలో లేరని.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కర్కోటకుడు, హిట్లర్ అంటే ఆమెకు మార్కులు పడవని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సేన (TRS) పార్టీ పెట్టినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.
MP Chamala Kirankumar Reddy | త్రినేత్ర.న్యూస్: కవిత తెల్ల కాగితం కాదని.. ప్రజలు ఆమెను నమ్మే పరిస్థితిలో లేరని.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కర్కోటకుడు, హిట్లర్ అంటే ఆమెకు మార్కులు పడవని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఇదే సమయంలో కవిత (Kavitha) నిర్మాణాత్మక రాజకీయాలు చేస్తే స్వాగతిస్తామని చెప్పారు. శనివారం ఏర్పాటైన కవిత కొత్త పార్టీపై ఆయన స్పందించారు. తెలంగాణ రాష్ట్ర సేన (TRS) పార్టీ పెట్టినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.
అప్పుడే బయటకొస్తే ఆదరణ ఉండేది...
అమ్మగా జేబులు చూసి కాదు, కడుపు చూసి పాలిస్తానని కవిత చెప్పారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు జేబులు చూసి పరిపాలించారని అంటున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో గతంలో టీఆర్ఎస్ పుట్టింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కవిత బయటకు వచ్చి పార్టీ పెట్టి ఉంటే ప్రజల్లో మంచి ఆదరణ వచ్చేది. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణను దోపిడీ చేశారు. పదేళ్లు కవిత మౌనంగా ఉన్నారు. పంచుకునే వాటాల్లో తేడాలు వచ్చి బయటకు వచ్చారని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడు బయటకు వచ్చి సీఎం, సీఎం అని నినాదాలు చేపించుకుంటున్నారు. ఆమె తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అని చామల ధ్వజమెత్తారు.
రేవంత్ రెడ్డి కర్కోటకుడు అయ్యారా?
రేవంత్ రెడ్డి రుణమాఫీ, ఫ్యూచర్ సిటీ, ఉద్యోగాలు, మూసీ ప్రక్షాళన చేస్తున్నందుకు కర్కోటకుడు అయ్యారా? కవిత పార్టీ పెట్టుకోవచ్చు, పోరాటం చేయొచ్చు, ప్రజల్లోకి వెళ్లొచ్చు. తెలంగాణను దోచుకోవడానికే కవిత సీఎం కావాలని అంటున్నారా? కవిత తెల్ల కాగితం కాదు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంపీగా, ఎమ్మెల్సీగా పని చేశారు అని ఎంపీ చామల చెప్పారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



