త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు విశ్వాసం కోల్పోయారు : కేసీఆర్‌

KCR | కేసీఆర్ విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు విశ్వాసం కోల్పోయార‌ని చెప్పారు. ఫార్మాసిటీ వ‌చ్చిన తీరును వివ‌రించారు.

A

News | Published On Dec 21, 2025, 7.32 pm IST

KCR | ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు విశ్వాసం కోల్పోయారు : కేసీఆర్‌
Advertisement

KCR | తెలంగాణ భ‌వ‌న్‌ (Telangana Bhavan)లో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) మాట్లాడుతూ..... ప్ర‌జ‌లు గోల్ మాల్ అయిపోయారు.. ఓట్లేసి ఇవాళ భ‌యంక‌ర‌మైన తిట్లు తిడుతున్నారు. మ‌ళ్లీ మ‌న‌మే రావాలి అని అంటున్న‌రు. అది దేనికి సంకేతం.. మీ మీద ప్ర‌జ‌లు విశ్వాసం కోల్పోతున్నారు మీ పిచ్చి ప‌నుల వ‌ల్ల‌. మీరు చేసే చ‌ర్య‌లు ఎట్ల ఉన్న‌య్.. రియ‌ల్ ఎస్టేట్ మొత్తం బ్రోక‌ర్ దందానే.

ఫార్మా సిటీ మా ప్ర‌భుత్వంలో ఎందుకు వ‌చ్చింది. అనుకోకుండా కొన్ని రాష్ట్రాల‌కు క‌లిసి వ‌స్తాయి. ఆనాటి నెహ్రూ ప్ర‌భుత్వంలో క‌ల‌రా వ్యాధితో ఇబ్బ‌డిముబ్బ‌డిగా ప్ర‌జ‌లు చ‌నిపోయారు. ఐడీపీఎల్స్ అని కొన్ని రాష్ట్రాల్లో పెట్టారు. హైద‌రాబాద్‌కు కూడా ఐడీపీఎల్ పెట్టారు. దాని పుణ్య‌మా అని కొంద‌రు బ‌య‌ట‌కు వ‌చ్చి విస్త‌రించారు. హైద‌రాబాద్ మెడిక‌ల్ హ‌బ్‌గా త‌యారైంది. ప‌రిశ్ర‌మ‌లు ఎక్క‌డంటే అక్క‌డ పెడితే న‌డ‌వ‌దు. ఫార్మా ఎకో బిల్డ్ అయింది హైద‌రాబాద్‌లో.. చాలా ఇబ్బ‌డిముబ్బ‌డిగా కంపెనీలు వ‌చ్చాయి. ప్ర‌పంచంలో మూడింట ఒక‌వంతు వ్యాక్సిన్‌లు హైద‌రాబాద్ జీనోమ్ వ్యాలీ నుంచి స‌ర‌ఫ‌రా అవుతున్నాయి. ర‌సాయ‌నిక వ్య‌ర్థాలు ఇబ్బందులు క‌లిగిస్తాయి. హుస్సేన్ సాగ‌ర్ కాలుష్య‌మైంది.. దీన్ని నుంచి హైద‌రాబాద్ బ‌య‌ట‌ప‌డాల‌ని చెప్పి న‌లుగురు ఐఏఎస్‌ల‌తో బృందాల‌ను చాలా దేశాల‌కు పంపించాం. మందుల్లేని ప్ర‌పంచాన్ని ఊహించ‌లేం. ఇవి త‌యారు చేసే క్ర‌మంలో వెస్టేజ్‌ను నియంత్రించాలి. దాన్ని ఎలా నియంత్రించాల‌నే దానిపై దృష్టి సారించాం. ఫార్మా కంపెనీ ముందు నుంచి పోతే వాస‌న వ‌స్తుంది. కొన్ని దేశాల్లో వాస‌న రాదు. ఆ మాదిరిగా ఫ్యూచ‌ర్ దృష్ట్యా మ‌నం ఫార్మా సిటీ ఏర్పాటు చేయాల‌నుకున్నాం. ఫార్మాను కాపాడుకోవాలి.. కాలుష్యం బారి నుంచి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించుకోవాల‌ని ఆలోచించాం. జ‌డ్ ఎల్ బీ జీరో లిక్విడ్ బేస్ ద్వారా కాలుష్యం ఉత్ప‌న్నం కాదు.. ఇంట‌ర్నేష‌న‌ల్ వ్యాప్తంగా ఇది అమ‌ల‌వుతుంది. దీన్ని ఇక్క‌డ అమ‌లు చేయాల‌ని ముచ్చ‌ర్ల‌కు తీసుకుపోయి.. దాన్ని ఫైన‌ల్ చేసి.. రైతుల‌తో మాట్లాడి 14 వేల ఎక‌రాలు సేక‌రించాం. జీడిమెట్ల‌, చ‌ర్ల‌ప‌ల్లిలో ఉన్న కంపెనీల‌ వారు మాకు ప్ర‌త్యామ్నయం ప్లేస్ ఇస్తే అక్క‌డ పెట్టుకుంటామ‌ని చెప్పారు. కేంద్రాన్ని ఒప్పించి ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు తెచ్చుకున్నాం. అలా ఫార్మా సిటీ ఏర్పాటుకు నిర్ణ‌యం తీసుకున్నాం. వీట‌న్నింటిని దృష్టిలో ఉంచుకుని మ‌హేశ్వ‌రంలో మెడిక‌ల్ కాలేజీ మంజూరు చేశాం.

కానీ ఇప్పుడు దందా చేస్తున్నారు. ఫ్యూచ‌ర్ సిటీ పేరిట దందా చేస్తున్నారు. అమ్మ‌క‌దొబ్బాల‌ని చూస్తున్నారు.. ఎవ‌రికి కావాలి ఫ్యూచ‌ర్ సిటీ. నీవు హైద‌రాబాద్‌ను పెంచావా..? ఏం జ‌రుగుతుంది రాష్ట్రంలో. ఇంత వైబ్రంట్ సిటీ 400 సంవ‌త్స‌రాల చ‌రిత్ర‌తో వ‌చ్చింది. బెంగాల్‌కు క‌ల‌క‌త్తా, మ‌హారాష్ట‌కు ముంబై, త‌మిళ‌నాడుకు మ‌ద్రాస్, క‌ర్ణాట‌క‌కు బెంగ‌ళూరు ఉంది. మ‌న‌కు హైద‌రాబాద్ ఉంది. ఈ న‌గ‌రం భ‌విష్య‌త్‌ను దృష్టిలో ఉంచుకుని ఫార్మా సిటీ పెట్టాం. దిక్కుమాలిన పాల‌సీలు, రియ‌ల్ ఎస్టేట్ బ్రోక‌ర్ దందాలు త‌ప్ప ఏం క‌నిపించ‌డం లేదు. చివ‌ర‌కు గురుకుల పాఠ‌శాల విద్యార్థులు చ‌నిపోతారా..? ఇప్ప‌టికి 120 మంది విద్యార్థులు చ‌నిపోయారు. గ‌ట్టి అధికారిని పెట్టి చ‌ర్య తీసుకోరాదా..? పొర‌గాండ్ల‌ను సాక‌డం చేత‌కావ‌డం లేదు.. కానీ ఫ్యూచ‌ర్ సిటీ తోక సిటీ అని అంటున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement