త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchandar Rao | మైనారిటీల చేరిక మోదీ విశ్వాసానికి ప్ర‌తీక‌: బీజేపీ చీఫ్ రాంచంద‌ర్‌రావు

Ramchandar Rao | మైనారిటీ (Minorities) స‌మాజానికి చెందిన స‌భ్యులు బీజేపీ (BJP)లో పెద్ద సంఖ్య‌లో చేర‌డం ప్ర‌ధాని మోదీ (PM Modi) “సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్” దృక్పథంపై ఉన్న‌ వారి విశ్వాసానికి నిదర్శనమ‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచంద‌ర్‌రావు అన్నారు. బీజేపీలో చేరిన మైనారిటీల‌కు కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

S

News | Published On May 4, 2026, 2.25 pm IST

Ramchandar Rao | మైనారిటీల చేరిక మోదీ విశ్వాసానికి ప్ర‌తీక‌: బీజేపీ చీఫ్ రాంచంద‌ర్‌రావు
Advertisement

Ramchandar Rao | త్రినేత్ర‌.న్యూస్‌: మైనారిటీ (Minorities) స‌మాజానికి చెందిన స‌భ్యులు బీజేపీ (BJP)లో పెద్ద సంఖ్య‌లో చేర‌డం ప్ర‌ధాని మోదీ (PM Modi) “సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్” దృక్పథంపై ఉన్న‌ వారి విశ్వాసానికి నిదర్శనమ‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచంద‌ర్‌రావు అన్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సోమ‌వారం మైనారిటీ ప్రముఖులు, సభ్యులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా వారికి బీజేపీ చీఫ్‌ కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. మైనారిటీల చేరిక‌లో వారికి కండువాలు క‌ప్పే అవకాశం నాకు లభించడం సంతోష‌క‌ర‌మ‌న్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధి, దేశ నిర్మాణం అనే మహాయజ్ఞంలో భాగస్వాములు కావడానికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ముందుకు వస్తున్నార‌ని చెప్పారు. బీజేపీలో చేరిన కొత్త సభ్యులందరికీ పార్టీలోకి స్వాగతం ప‌లికారు. దేశ సేవలో వారు అంకితభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

Advertisement
Advertisement