త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy, Ministers | మేడిగ‌డ్డ బ్యారేజీని ప‌రిశీలించిన‌ సీఎం రేవంత్, మంత్రులు

CM Revanth Reddy, Ministers | కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం పునరాభివృద్ధి పనులకు భూమిపూజ అనంత‌రం సీఎం రేవంత్‌రెడ్డి మంత్రుల‌తో క‌లిసి మేడిగ‌డ్డ బ్యారేజీ (Medigadda Barrage)కి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, NDSA చైర్మన్ అనిల్ జైన్, ఉన్నతాధికారులతో క‌లిసి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు.

S

News | Published On Apr 20, 2026, 6.34 pm IST

CM Revanth Reddy, Ministers | మేడిగ‌డ్డ బ్యారేజీని ప‌రిశీలించిన‌ సీఎం రేవంత్, మంత్రులు
Advertisement

CM Revanth Reddy, Ministers: త్రినేత్ర‌.న్యూస్‌: కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం పునరాభివృద్ధి పనులకు భూమిపూజ అనంత‌రం సీఎం రేవంత్‌రెడ్డి మంత్రుల‌తో క‌లిసి మేడిగ‌డ్డ బ్యారేజీ (Medigadda Barrage)కి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, NDSA చైర్మన్ అనిల్ జైన్, ఉన్నతాధికారులతో క‌లిసి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద పియర్స్ 20, 21, 22 వద్ద బోర్ రిగ్స్ ద్వారా జియో టెక్నికల్, జియో ఫిజికల్, జీపీఆర్, శాంపిల్స్ సేకరణను పరిశీలించారు.

 

520 బోర్ రిగ్స్ ద్వారా శాంపిల్స్ సేకరించి CWPRS కు పంపనున్న అధికారులు తెలిపారు. అక్కడ ల్యాబ్ లో పరీక్షల అనంతరం బ్యారేజ్ డ్యామేజీపై పూర్తి అవగాహన రానున్న‌ట్లు చెప్పారు. డ్రోన్ బేస్డ్ GPR టెస్ట్ కు సంబంధించిన వివ‌రాల‌ను అధికారులు ముఖ్యమంత్రికి వివ‌రించారు. ఈ టెస్ట్ ద్వారా 20 నుంచి 30 మీటర్ల లోతు వరకు పియర్స్ వద్ద నేల స్వభావానికి సంబంధించి ఫలితాలను తెలుసుకోవచ్చని చెప్పారు. బ్యారేజ్ వద్ద సీకేంట్ పైల్స్ కు సంబంధించి ప్యారలల్ క్రాస్ హోల్ సెస్మిక్ టెస్ట్ వివరాలను సీఎంకు వివ‌రించారు.

అంత‌కుముందు కాళేశ్వరంలో రూ.198 కోట్లతో కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం పునరాభివృద్ధి పనులతో పాటు కాళేశ్వరం బస్ స్టేషన్ కు సీఎం రేవంత్‌ శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి ప‌నుల శంకుస్థాప‌న త‌ర్వాత సీఎం, మంత్ర‌లు కాళేశ్వరం నుంచి మేడిగడ్డకు చేరుకున్నారు.

 

Advertisement
Advertisement