MLA Kotta Prabhakar Reddy | మైకును నేలకేసి కొట్టిన ఎమ్మెల్యే.. ప్రజాపాలన కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత
MLA Kotta Prabhakar Reddy | సిద్దిపేట జిల్లా దుబ్బాక (Dubbaka) నియోజకవర్గంలో శనివారం ఏర్పాటు చేసిన ప్రజాపాలన (Praja Palana) కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మైకును నేలకేసి కొట్టడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
MLA Kotta Prabhakar Reddy | త్రినేత్ర.న్యూస్: సిద్దిపేట జిల్లా దుబ్బాక (Dubbaka) నియోజకవర్గంలో శనివారం ఏర్పాటు చేసిన ప్రజాపాలన (Praja Palana) కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మైకును నేలకేసి కొట్టడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..
దుబ్బాక ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లడుతుండగా అధికారులు మైకు కనెక్షన్‌ను తొలగించారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ప్రభాకర్‌రెడ్డి రెండు మైకులను నేలకేసి కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వెంటనే వడ్లు కొనాలి..
అనంతరం ఎమ్మెల్యేతో సహా బీఆర్ఎస్ శ్రేణులంతా నిరసనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. వద్దురా నాయనా.. ఈ కాంగిరేసు పాలన, సీఎం డౌన్.. డౌన్ అంటూ నినదించారు. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లడుతూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. వడ్ల కొనుగోలును వెంటనే ప్రారంభించాలని నేలపై కూర్చొని నిరసనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
దుబ్బాక ప్రజాపాలన కార్యక్రమంలో ఉద్రిక్తత
కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని నిలదీసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతుండగా మైకులు కట్ చేసిన అధికారులు
దీంతో మైకులను నేలకేసి కొట్టి.. వడ్ల… pic.twitter.com/jX0Zunv6aN
— Telugu Scribe (@TeluguScribe) May 2, 2026
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



