త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TPCC Chief Mahesh Kumar Goud | 2023 సీన్ రిపీట‌వ్వాలి.. రాహుల్‌ను ప్ర‌ధానిని చేయాలి: కాంగ్రెస్ శ్రేణుల‌కు మ‌హేశ్ కుమార్ గౌడ్ పిలుపు

TPCC Chief Mahesh Kumar Goud | రాష్ట్రంలో 2023 సీన్ రిపీట్ అవ్వాల‌ని, కేంద్రంలో కాంగ్రెస్ ను గెలిపించి రాహుల్‌(Rahul)ను ప్ర‌ధానిని చేయాల‌ని టీపీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్ కాంగ్రెస్ శ్రేణుల‌(Congress cadre) కు పిలుపునిచ్చారు. క్షేత్ర స్థాయిలో పార్టీ పటిష్టంగా ఉండాలంటే ఈరోజు నుంచే బీఎల్ఏ (BLA, బూత్ లెవెల్ ఏజెంట్) కార్యక్రమం మొదలుపెట్టాల‌ని సూచించారు.

S

News | Published On Apr 27, 2026, 3.53 pm IST

TPCC Chief Mahesh Kumar Goud | 2023 సీన్ రిపీట‌వ్వాలి.. రాహుల్‌ను ప్ర‌ధానిని చేయాలి: కాంగ్రెస్ శ్రేణుల‌కు మ‌హేశ్ కుమార్ గౌడ్ పిలుపు
Advertisement
  • పార్టీ పటిష్ఠత‌కు బీఎల్ఏలు కీల‌కం
  • ఈ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాము
  • త్వ‌ర‌లో కార్పొరేషన్ పదవుల భర్తీ ఉంటుంది
  • కాంగ్రెస్ నాయ‌కుల‌తో టీపీసీసీ చీఫ్ మ‌హెశ్‌కుమార్‌గౌడ్

TPCC Chief Mahesh Kumar Goud | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో 2023 సీన్ రిపీట్ అవ్వాల‌ని, కేంద్రంలో కాంగ్రెస్ ను గెలిపించి రాహుల్‌(Rahul)ను ప్ర‌ధానిని చేయాల‌ని టీపీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్ కాంగ్రెస్ శ్రేణుల‌(Congress cadre) కు పిలుపునిచ్చారు. సోమ‌వారం ఇందిరా భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన సంఘ‌ట‌న్ సృజ‌న్ అభియాన్ స‌మీక్షా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. పార్టీ క్యాడ‌ర్‌ భ‌విష్య‌త్ కార్య‌క్ర‌మాల‌పై దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో పార్టీ పటిష్టంగా ఉండాలంటే ఈరోజు నుంచే బీఎల్ఏ (BLA, బూత్ లెవెల్ ఏజెంట్) కార్యక్రమం మొదలుపెట్టాల‌ని సూచించారు.

80 శాతం స‌మ‌యం పార్టీకి కేటాయించాలి..

తెలంగాణ‌కు రూ. 5 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు రావడం ఆషామాషీ విషయం కాదు. తెలంగాణలో అత్యధిక పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు గెలవాలి. బీఎల్ఏ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బీఎల్ఏ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ లేదు. త్వరలోనే తీపి కబురు వినిపిస్తాం. అదేంటంటే కార్పొరేషన్ పదవుల భర్తీ ప్ర‌క్రియ చేప‌ట్ట‌బోతున్నం. మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిరంతరం పార్టీ కోసం పనిచేయాలి. 80 శాతం సమయాన్ని పార్టీకి కేటాయించేలా ప్ర‌ణాళిక‌లు ర‌చించుకోండి. మీ అందరి కర్తవ్యం పార్టీ నిర్మాణమే అని టీపీసీసీ చీఫ్ సూచించారు.

సెక్యుల‌ర్ ఓట్లపై బీజేపీ కుట్ర‌...

బీజేపీ కుటిల యత్నంలో భాగంగానే సెక్యులర్ ఓట్లు తొలగించేందుకు పన్నాగం ప‌న్నుతోంది. తెలంగాణలో అడ్డదారుల‌ ద్వారా ఓట్లు తొలగించేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేని విధంగా తెలంగాణ‌లో పథకాల‌ను అమ‌లు చేస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమ‌మే ధ్యేయంగా ప్రజాపాలన సాగుతోంది. అందరి ధ్యేయం కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. రాహుల్ గాంధీ ప్రధాని కావడం అని మ‌హేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జి మీనాక్షి న‌ట‌రాజ‌న్‌, బ‌ల్మూరి వెంక‌ట్‌, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement