Harishrao | సింగరేణిలో టెండర్ల దందా.. కమీషన్ల కోసమే కాంగ్రెస్ దోపిడీ
సింగరేణి (Singareni) ఓవర్ బర్డెన్ (ఓబీ) టెండర్లలో రేవంత్ రెడ్డి (Revanthreddy) సర్కార్ సాగిస్తున్న దోపిడీ బట్టబయలైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు (Harishrao) అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 'సైట్ విజిట్ సర్టిఫికెట్' (site visit certificate) ముసుగులో కాంట్రాక్టర్ల రింగ్ ఏర్పాటు చేసి సింగరేణిని ఎలా లూటీ చేస్తున్నారో ఆధారాలతో బయటపెట్టినట్లు పేర్కొన్నారు.
- కమీషన్ల కోసమే శ్రీరాంపూర్ టెండర్ ఏడుసార్లు వాయిదా
- సైట్ విజిట్ సర్టిఫికెట్ ముసుగులో మోసం
-12% నెగెటివ్ బిడ్‌తో బయటపడ్డ అసలు రంగు
- ఇది ప్రజల, బీఆర్ ఎస్ పోరాట ఫలితమే
- మాజీ మంత్రి హరీశ్‌రావు
త్రినేత్ర.న్యూస్: సింగరేణి (Singareni) ఓవర్ బర్డెన్ (ఓబీ) టెండర్లలో రేవంత్ రెడ్డి (Revanthreddy) సర్కార్ సాగిస్తున్న దోపిడీ బట్టబయలైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు (Harishrao) అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 'సైట్ విజిట్ సర్టిఫికెట్' (site visit certificate) ముసుగులో కాంట్రాక్టర్ల రింగ్ ఏర్పాటు చేసి సింగరేణిని ఎలా లూటీ చేస్తున్నారో ఆధారాలతో బయటపెట్టినట్లు పేర్కొన్నారు. ఇది బీఆర్ఎస్ (BRS) పోరాట ఫలితమేనని చెప్పారు. శ్రీరాంపూర్ (Srirampur) SRP OC-II టెండర్ ఫైనాన్షియల్ బిడ్ల అసలు బాగోతం బయటపడిందన్నారు. టెక్నికల్ బిడ్ అయిన తర్వాత ఫైనాన్షియల్ బిడ్ ను ఏడుసార్లు వాయిదా వేయడంపై కార్మికులను చైతన్యపరిచినట్లు వివరించారు. ఎట్టకేలకు పారదర్శకంగా బిడ్లు తెరిచేసరికి ఈ టెండర్ ఏకంగా మైనస్ 12 శాతం (–12%) వద్ద ముగిసిందన్నారు.
తమ వారికే దక్కేలా..
సీఎం బావమరిది సృజన్ రెడ్డి (Srujanreddy) సిండికేట్ ను బద్దలు కొడితే పోటీ ఎలా ఉంటుందో, ధరలు ఎలా దిగొస్తాయో ఈ టెండర్ (Tender) ద్వారా నిరూపితమైందన్నారు. గతంలో ఓబీ టెండర్లు పారదర్శకంగా ఆన్‌లైన్‌లో జరిగేవని గుర్తు చేశారు. అప్పట్లో –7% నుంచి –20% తక్కువకే పనులు పూర్తయ్యి, సంస్థకు వందల కోట్లు ఆదా అయ్యేవన్నారు. సర్టిఫికేట్ నిబంధనతో ఎవరెవరు టెండర్ వేస్తున్నారో తెలుసుకొని అధికార పార్టీ నేతలు తమ వారికే టెండర్లు దక్కేలా సిండికేట్ ఏర్పాటు చేయడానికి ఇది బ్రహ్మాస్త్రంగా మారిందన్నారు. ఈ కమీషన్ల కక్కుర్తి వల్ల ఓబీ పనుల్లో తీవ్ర జాప్యం జరిగి సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి (Coal production) పడిపోయిందని చెప్పారు.
సమగ్ర విచారణ జరపాలి..
బొగ్గు గని కార్మికులు ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తూ ఏటా ఎంతో ఆశగా ఎదురుచూసే దసరా బోనస్ లాభాల వాటా శాతానికి కోత పడే ప్రమాదం ఉందని ఆవేదన చెందారు. టెండర్లలో పారదర్శకత పాటించి సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల సిండికేట్ బాగోతంపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. ఈ సంస్థను రాజకీయ కమీషన్లకు అడ్డాగా మారిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇది తెలంగాణ (Telangana) ప్రజల విజయమని, బీఆర్ఎస్ పోరాట ఫలితమన్నారు. వనరులను కాపాడేది, కాంట్రాక్టర్ల కమీషన్లను కాపాడేదెవరో ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



