Telugu OTT | ఓటీటీలోకి తెలుగు ఫ్యామిలీ డ్రామా మూవీ – ఆస్తి కోసం తండ్రి మీదే కొడుకు కేసు వేస్తే!
తెలుగు మూవీ సన్ ఆఫ్ ఓటీటీలో రిలీజైంది. సోమవారం నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. సాయి సింహాద్రి, మీరా రాజ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో సీనియర్ కథానాయకుడు వినోద్ కుమార్ కీలక పాత్రలో కనిపించారు.
Telugu OTT | లేటెస్ట్ తెలుగు ఫ్యామిలీ డ్రామా మూవీ సన్ ఆఫ్ ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. సాయి సింహాద్రి హీరోగా నటిస్తూ ఈ సినిమాను నిర్మించారు. సీనియర్ కథానాయకుడు వినోద్ కుమార్ కీలక పాత్రలో నటించగా... మీరా రాజ్ హీరోయిన్‌గా కనిపించింది.
ఆహా ఓటీటీలో...
సన్ ఆఫ్ సోమవారం ఆహా ఓటీటీలో రిలీజైంది. మేకర్స్ సడెన్‌గా ఈ మూవీని ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఫిబ్రవరి నెలాఖరున థియేటర్లలోకి వచ్చిన ఈ చిన్న సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
తండ్రీకొడుకుల ఎమోషన్ ఆధారంగా వాస్తవ ఘటనల స్ఫూర్తితో దర్శకుడు బాతుల సతీష్ఈ సినిమాను తెరకెక్కించారు. వెంకట్రావుకు (వినోద్ కుమార్) కొడుకు ఆనంద్ (సాయి సింహాద్రి) అంటే ప్రాణం. భార్య చనిపోవడంతో కష్టపడి కొడుకును పెంచి పెద్దచేస్తాడు. తండ్రి గారాబం కారణంగా ఆనంద్ జులాయిగా మారతాడు. చదువు అబ్బదు. చిన్ననాటి స్నేహితురాలు అనును (మీరా రాజ్) ప్రేమిస్తాడు ఆనంద్. అతడికి ఉన్న ఆస్తి చూసి అను తండ్రి వారికి పెళ్లికి ఒప్పుకుంటాడు. కానీ వెంట్రావు మాత్రం కొడుకు పెళ్లికి అడ్డు చెబుతాడు. ఎంగేజ్‌మెంట్ రోజే కొడుకును దారుణంగా అవమానిస్తాడు వెంకట్రావు. దాంతో ఆనంద్ ఆస్తిలో వాటా కోసం కన్న తండ్రిపైనే కేసు వేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? తండ్రితో పాటు జీవితం విలువను ఆనంద్ ఎలా తెలుసుకున్నాడు? తన తప్పును సరిదిద్దుకున్నాడా? లేదా? అన్నదే ఈ మూవీ కథ. ఈ సినిమాకు రిషి మ్యూజిక్ అందించాడు.
హీరోగా....తెలుగులో
ఒకప్పడు తెలుగులో హీరోగా మామగారు, మౌనపోరాటం, సీతారత్నం గారి అబ్బాయితో పాటు పలు సూపర్ హిట్ సినిమాలు చేశాడు వినోద్ కుమార్. తెలుగులోనే కాకుండా కన్నడంలో స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాడు.
సంబంధిత వార్తలు

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026

Samantha | అందుకే రిస్క్ తీసుకున్నా – ప్రొడ్యూసర్‌గా మారడంపై సమంత కామెంట్స్
మే 19, 2026

Ram Charan | బుచ్చిబాబు ఇచ్చిన గిఫ్ట్ – చేతి గాయంపై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మే 18, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



