త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

18,139 మెగావాట్ల కు చేరుకున్న Telangana current డిమాండ్

తెలంగాణ రాష్ట్రం మరోసారి తన అప్రతిహత ప్రగతిని చాటుకుంది , రాష్ట్ర విద్యుత్ సంస్థలు మంగళవారం ఉదయం 11:01 గంటలకు నమోదైన 18,139 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్‌ను ఎటువంటి అంతరాయం లేకుండా సమర్థవంతంగా నిర్వహించాయి, ఇది రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక గరిష్ట డిమాండ్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు .

a

News | Published On Mar 3, 2026, 5.16 pm IST

18,139 మెగావాట్ల కు చేరుకున్న Telangana current డిమాండ్

సంక్షిప్త సారాంశం

మ‌ధ్య‌ప్ర‌దేశ్(19వేల మెగావాట్లు), రాజ‌స్థాన్ (19,600-20,600 మెగావాట్లు)కు ద‌గ్గ‌ర‌గా తెలంగాణ(18,139 మెగావాట్లు) గ‌రిష్ట డిమాండ్‌ను న‌మోదు చేయ‌డం అభివృద్ధికి చిహ్న‌మ‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి కొనియాడారు. భూభాగం, జనాభా పరంగా చిన్నదైనా తెలంగాణ తన సామర్థ్యాన్ని చాటింద‌ని చెప్పారు. పంజాబ్, హర్యానా, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి పారిశ్రామిక రాష్ట్రాల కంటే ఎక్కువ గరిష్ట డిమాండ్‌ను మ‌న రాష్ట్రం నమోదు చేసిందనీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

విద్యుత్ వాడ‌కంలో తెలంగాణ రికార్డు
18,139 మెగావాట్ల కు చేరుకున్న డిమాండ్
రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యధికం
భవిష్యత్తు విద్యుత్ అవసరాలకు సిద్ధంగా ఉన్నాం
తెలంగాణ విద్యుత్ సంస్థలకు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు

త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ (Telangana) రాష్ట్రం మరోసారి తన అప్రతిహత ప్రగతిని చాటుకుంది , రాష్ట్ర విద్యుత్ సంస్థలు మంగళవారం ఉదయం 11:01 గంటలకు నమోదైన 18,139 మెగావాట్ల గరిష్ట (Highest) విద్యుత్ (Power) డిమాండ్‌ (demand)ను ఎటువంటి అంతరాయం లేకుండా సమర్థవంతంగా నిర్వహించాయి, ఇది రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక గరిష్ట డిమాండ్ అని డిప్యూటీ సీఎం (deputy CM)  భట్టి విక్రమార్క మల్లు (Mallu Bhatti vikramarka) తెలిపారు . రాష్ట్ర విద్యుత్ సంస్థ చరిత్రలోనే గరిష్ట డిమాండ్ ను ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తిచేసి నాణ్యతతో కూడిన విద్యుత్ సరఫరా చేసిన విద్యుత్తు రంగంలోని ఉన్నతాధికారులు, యావత్ సిబ్బందికి డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం  ఓ ప్రకటన విడుదల చేశారు.

ఈ మైలురాయి తెలంగాణ ఆర్థిక వృద్ధి, కార్యనిర్వహణ సామర్థ్యం, మరియు అద్భుత సమన్వయానికి నిదర్శనం. తెలంగాణ కేవలం సమకాలీన అవసరాలను తీర్చడం మాత్రమే కాదు, రాబోయే వేసవి గరిష్ట డిమాండ్‌లకు ముందస్తు ప్రణాళికలతో పూర్తిగా సిద్ధంగా ఉంది. బలమైన గ్రిడ్ వ్యవస్థ, ముందుచూపు ప్రణాళిక, సమన్వయంతో ఉన్న వ్యవస్థ మన బలం.. అని ప్రకటనలో పేర్కొన్నారు. భౌగోళికంగా చిన్న రాష్ట్రం అయినప్పటికీ, పెద్ద రాష్ట్రాల గరిష్ట లోడ్లను సమానంగా లేదా అధిగమించే స్థాయికి చేరుకున్నాం అని హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రగతి పారిశ్రామిక, వ్యవసాయ, పట్టణాభివృద్ధిలో మన వేగాన్ని స్పష్టం చేస్తోంది అన్నారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌ల స్థాయికి డిమాండ్

మ‌ధ్య‌ప్ర‌దేశ్(Madhypradesh 19వేల మెగావాట్లు), రాజ‌స్థాన్ (Rajasthan 19,600-20,600 మెగావాట్లు)కు ద‌గ్గ‌ర‌గా తెలంగాణ(18,139 మెగావాట్లు) గ‌రిష్ట డిమాండ్‌ను న‌మోదు చేయ‌డం అభివృద్ధికి చిహ్న‌మ‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి కొనియాడారు. భూభాగం, జనాభా పరంగా చిన్నదైనా తెలంగాణ తన సామర్థ్యాన్ని చాటింద‌ని చెప్పారు. పంజాబ్, హర్యానా, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి పారిశ్రామిక రాష్ట్రాల కంటే ఎక్కువ గరిష్ట డిమాండ్‌ను మ‌న రాష్ట్రం నమోదు చేసిందనీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

2023-24: గరిష్ట డిమాండ్15,623 మెగావాట్లు (08.03.2024)
2024–25: గరిష్ట డిమాండ్: 17,162 మెగావాట్లు(20.03.2025)
2025–26 : (మునుపటి గరిష్టం): 17,162 మెగావాట్లు
2026 (ప్రస్తుతం): 18,139 మెగావాట్లు(03.03.2026)

ట్యాగ్స్:

Advertisement
Advertisement