త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS Women Leaders | బండి భ‌గీర‌థ్‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోండి.. మ‌హిళా క‌మిష‌న్‌కు బీఆర్ఎస్ మ‌హిళా నేతల విన‌తి

BRS Women Leaders | బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడు బండి సాయి భగీరథ్‌పై పోక్సో (POCSO) చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మ‌హిళా నేత‌లు కోరారు. కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులపై కూడా విచారణ జరపాలని క‌మిష‌న్‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

S

News | Published On May 11, 2026, 3.07 pm IST

BRS Women Leaders | బండి భ‌గీర‌థ్‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోండి.. మ‌హిళా క‌మిష‌న్‌కు బీఆర్ఎస్ మ‌హిళా నేతల విన‌తి
Advertisement

BRS Women Leaders | త్రినేత్ర‌.న్యూస్: బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడు బండి సాయి భగీరథ్‌పై పోక్సో (POCSO) చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మ‌హిళా నేత‌లు కోరారు. ఈ మేర‌కు వారు తెలంగాణ రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్‌కు సోమ‌వారం మ‌ధ్యాహ్నం విన‌తిప‌త్రం అంద‌జేశారు. కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులపై కూడా విచారణ జరపాలని క‌మిష‌న్‌కు విజ్ఞ‌ప్తి చేశారు. బాధితురాలి కుటుంబాన్ని వేధింపులకు గురిచేయడంపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు వినతిపత్రం అందజేసిన వారిలో తుల ఉమా, రాసూరి సునీత‌, సుమిత్ర ఆనంద్ త‌దిత‌ర మహిళా నేతలు ఉన్నారు.

స్పందించిన బాల‌ల హ‌క్కుల క‌మిష‌న్‌...

పేట్ బ‌షీరాబాద్ పోలీస్ స్టేష‌న్ లో బండి భ‌గీర‌థ్ మీద‌ న‌మోదైన ఫోక్సో కేసుపై తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (TSCPCR) చైర్‌పర్సన్‌ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి స్పందించారు. న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ నుంచి వివ‌రాలు తెప్పించుకుని విచార‌ణ కోసం ప్ర‌త్యేక బెంచ్ ఏర్పాటు చేశారు.

సిట్ ఏర్పాటు..

మ‌రోవైపు బండి సంజయ్ కుమారుడి కేసులో మహిళా ఐపీఎస్ పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. కూకట్ పల్లి డీసీపీ రితిరాజ్ కు విచారణ బాధ్యతలు అప్పగించారు.

Advertisement
Advertisement