త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suicide | కుమార్తెల‌ను బావిలోకి తోసిన త‌ల్లి.. ఆపై తానూ ఆత్మ‌హ‌త్య‌!

మహబూబ్‌నగర్‌ (Mahaboobnagar) జిల్లా భూత్పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ త‌ల్లి, ఇద్ద‌రు కుమార్తెలు ఆత్మ‌హ‌త్య‌ (Suicide) కు పాల్పడ్డారు. గ్రామస్థులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. కుటుంబ కలహాలతోనే వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

S

News | Published On Mar 12, 2026, 3.56 pm IST

Suicide | కుమార్తెల‌ను బావిలోకి తోసిన త‌ల్లి.. ఆపై తానూ ఆత్మ‌హ‌త్య‌!
Advertisement

- మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా వెల్కిచ‌ర్ల‌లో ఘ‌ట‌న‌

త్రినేత్ర‌.న్యూస్‌: మహబూబ్‌నగర్‌ (Mahaboobnagar) జిల్లా భూత్పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఏం క‌ష్ట‌మొచ్చిందో ఏమో ఓ త‌ల్లి, ఇద్ద‌రు కుమార్తెలు ఆత్మ‌హ‌త్య‌(Suicide) కు పాల్పడ్డారు. భూత్పూర్ మండలం వెల్కిచ‌ర్ల గ్రామం(Velkicherla village) లో ఈ విషాదం చోటుచేసుకుంది.
ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలిలా ఉన్నాయి. గురువారం ఉదయం జంగమ్మ (42) (Jangamma) తన ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి సమీపంలోని వ్యవసాయ పొలం వద్దకు వెళ్లింది. జ్యోతి (15), శైలజ (13)ను తొలుత బావి (Well) లోకి తోసేసి, అనంతరం తాను కూడా అందులో దూకింది. కాగా ఆమె కుమారుడు తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. గ్రామంలోకి చేరుకొని జ‌రిగిన విష‌యాన్ని ఇరుగు పొరుగువారికి చెప్పాడు. దీంతో హుటాహుటిన గ్రామస్థులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. కుటుంబ కలహాలతోనే వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement