త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar Zoom Meeting | ఆర్టీసీ డిపోల్లో గ్రీవెన్స్ పెట్టండి.. ప్ర‌తి రెండో మంగ‌ళ‌వారం స‌మ‌స్య‌లు వినండి: జూమ్ మీటింగ్‌లో మంత్రి పొన్నం

Ponnam Prabhakar Zoom Meeting | డిపోల్లో ప్రతి రెండో మంగళవారం ఆర్టీసీ (TRC) సిబ్బంది సమస్యలు వినడానికి అన్ని డిపోల్లో గ్రీవెన్స్ (Grievance) ఏర్పాటు చేయాయాల‌ని.. డిపో మేనేజర్లు ఇతర సిబ్బంది అందుబాటులో ఉండాలని ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ సూచించారు.

S

News | Published On May 2, 2026, 2.58 pm IST

Ponnam Prabhakar Zoom Meeting | ఆర్టీసీ డిపోల్లో గ్రీవెన్స్ పెట్టండి.. ప్ర‌తి రెండో మంగ‌ళ‌వారం స‌మ‌స్య‌లు వినండి: జూమ్ మీటింగ్‌లో మంత్రి పొన్నం
Advertisement
  • సిబ్బంది స‌మ‌స్య‌ల‌ను ఆ వెంట‌నే ప‌రిష్క‌రించాలి
  • దురుసు ప్ర‌వ‌ర్త‌న ప‌నికి రాదు, ప్రేమ‌తో ప‌నులు చేయించాలి
  • సంస్థలో ఇంటర్నల్ ఎటాక్ అనేది ప్రమాదకరం
  • అంద‌రం క‌లిసి ప‌ని చేద్దాం
  • ఆర్టీసీ ఉన్న‌తాధికారుల జూమ్ మీటింగ్‌లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ సూచ‌న‌

Ponnam Prabhakar Zoom Meeting | త్రినేత్ర‌.న్యూస్‌: డిపోల్లో ప్రతి రెండో మంగళవారం ఆర్టీసీ (TRC) సిబ్బంది సమస్యలు వినడానికి అన్ని డిపోల్లో గ్రీవెన్స్ (Grievance) ఏర్పాటు చేయాయాల‌ని.. డిపో మేనేజర్లు ఇతర సిబ్బంది అందుబాటులో ఉండాలని ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ సూచించారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో శ‌నివారం ఆయ‌న జూమ్ సమావేశం నిర్వ‌హించారు. శుక్ర‌వారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో జరిగిన సమావేశంలో లేవనెత్తిన అంశాలపై అధికారులకు మంత్రి పొన్నం దిశా నిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌లు సూచ‌న‌లిచ్చారు.

స‌త్సంబంధాలు క‌లిగి ఉండాలి..

ఆర్టీసీ అధికారులు కిందిస్థాయి సిబ్బంది, ప్రయాణికులతో సానుకూలంగా ఉండాలి. సిబ్బందితో వేధింపులు లేకుండా ప్రేమతో, సానుకూల దృక్పధంతో డివిజన్ స్థాయి అధికారులు పనులు చేయించాలి. ఆర్టీసీ అధికారులు కింది స్థాయి డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది పట్ల దురుసుగా కాకుండా స్నేహపూర్వకంగా మెల‌గాలి. డిపో మేనేజర్లు, ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులతో సత్సంబంధాలు కలిగి ఉండాలి అని పొన్నం సూచించారు.

న‌ష్టాల్లో ఉన్న డిపోల అధికారులు స‌మీక్షించుకోవాలి..

మే 17 లోపు ఆయా డిపోల్లో, బస్ స్టేషన్లలో కార్మికులకు మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలి. టాయిలెట్స్, మంచి నీటి సౌకర్యం, ప్లాంటేషన్, పరిశుభ్రత పాటించాలి. 2023, డిసెంబర్ 9 నుంచి ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం తీసుకొచ్చాం. ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, నారాయణఖేడ్, బాన్సువాడ, ఇల్లందు వంటి కొన్ని డిపోలు నష్టాల్లో ఎందుకు నడుస్తున్నాయో ఆర్ఎంలు, డిపో మేనేజర్ లు సమీక్షించుకోవాలి అని చెప్పారు.

టిక్కెట్ కు సంబంధించి ఇబ్బందులు ఏర్ప‌డితే చర్యలు తీసుకోండి. సిబ్బంది గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు. సంస్థలో ఇంటర్నల్ ఎటాక్ అనేది ప్రమాదకరమైన విషయం. ఆర్టీసీ డిపో మేనేజర్లు గ్రామ సర్పంచ్ నుండి మొదలు ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంచి ప్రజా సంబంధాలు కొన‌సాగించాలి. ఏదైనా సమస్య మీ స్థాయిలో పరిష్కారం కాకపోతే ఆర్టీసీ ఎండీ స్థాయిలో పరిష్కారం చేద్దాం.

ప్ర‌భుత్వ స్థ‌లాల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిద్దాం..

సిబ్బంది పట్ల సానుకూలంగా ఉండాలి. మంత్రి నుండి సిబ్బంది వరకు అందరం కలిసి పని చేద్దాం. పెండింగ్ షాప్ లు ఏవైనా ఉంటే జూన్ వరకు క్లియర్ కావాల్సిందే. ఎక్కడెక్కడ పెండింగ్ లో ఉందో చూడండి. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల‌ సమస్యను పరిష్కరించండి. ఆర్టీసీ సమ్మెలో డిమాండ్ చేసిన కార్మికుల సమస్యలను పరిష్కారం చేస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో మంచి ఫలితాలను సాధించే దిశగా ముందుకు వెళ్దాం అని పొన్నం కోరారు.

ఈ జూమ్ సమావేశంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఈడీలు , ఆర్ఎంలు, వివిధ విభాగాల హెచ్‌వోడీ, డీఎంలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement