త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RV Karnan | కేబీఆర్ ఫ్లైఓవ‌ర్‌ పనుల్లో మరింత వేగం పెంచండి : కమిషనర్ ఆర్‌వీ క‌ర్ణన్

KBR Park Fly over works | కేబీఆర్ పార్క్ (KBR Park) ఫ్లైఓవర్ (Fly over) పనుల్లో మ‌రింత వేగం పెంచాల‌ని కమిషనర్ ఆర్ వీ కర్ణన్ (RV Karnan) అధికారుల‌ను ఆదేశించారు. బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని పార్క్ హయత్ హోటల్ వద్ద జరుగుతున్న కేబీఆర్ పార్క్ ప్యాకేజ్ ఫ్లైఓవర్ పనులను కమిషనర్ చీఫ్ ఇంజినీర్‌ సహదేవ్ రత్నాకర్ తో కలిసి ఆయ‌న‌ సోమవారం పరిశీలించారు.

S

News | Published On Mar 30, 2026, 3.13 pm IST

RV Karnan | కేబీఆర్ ఫ్లైఓవ‌ర్‌ పనుల్లో మరింత వేగం పెంచండి : కమిషనర్ ఆర్‌వీ క‌ర్ణన్
Advertisement

త్రినేత్ర.న్యూస్‌: కేబీఆర్ పార్క్ (KBR Park) ఫ్లైఓవర్ (Flyover) పనుల్లో మ‌రింత వేగం పెంచాల‌ని కమిషనర్ ఆర్ వీ కర్ణన్ (RV Karnan) అధికారుల‌ను ఆదేశించారు. బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని పార్క్ హయత్ హోటల్ వద్ద జరుగుతున్న కేబీఆర్ పార్క్ ప్యాకేజ్ ఫ్లైఓవర్ పనులను కమిషనర్ చీఫ్ ఇంజినీర్‌ సహదేవ్ రత్నాకర్ తో కలిసి ఆయ‌న‌ సోమవారం పరిశీలించారు. దీనిపై క్షేత్రస్థాయిలో కమిషనర్ సమీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మొత్తం 6 పియర్ ఫౌండేషన్‌ల తవ్వకాలు పూర్తయ్యాయని, అందులో 3 పియర్‌లకు పీసీసీ బెడ్ పనులు పూర్తయ్యాయని అధికారులు కమిషనర్ కు తెలిపారు. రాఫ్ట్ ఫౌండేషన్‌ల కోసం స్టీల్ ఫ్యాబ్రికేషన్ పనులు మంగళవారం ప్రారంభం కానున్న‌ట్లు వివ‌రించారు. పనుల్లో మరింత వేగం పెంచేందుకు ఎంఈఐఎల్ (మెగా) సంస్థ అదనంగా మెషిన్ , మ్యాన్ పవర్ ను సమకూర్చుకోవాలని కమిషనర్ ఆదేశించారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా పనులు సాగుతున్న తీరుపై కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్ర తనిఖీలో కమిషనర్ వెంట ఈఈ (ప్రాజెక్ట్స్), డీఈఈ, ఏఈఈ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు ఉన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement