SIR | జూన్ 25 నుంచి ఎస్‌ఐఆర్: సీఈవో సుదర్శన్‌రెడ్డి
SIR | రాష్ట్రంలో వచ్చే నెల 15 నుంచి ఎస్‌ఐఆర్ ప్రక్రియ మెుదలవుతుందని సీఈవో సుదర్శన్‌రెడ్డి (CEO Sudarshan Reddy) తెలిపారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరి వివరాలను వెరిఫికేషన్ చేస్తామన్నారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు తెలపవచ్చని వివరించారు.
- ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ
- అక్టోబర్ 1న తుది జాబితా విడుదల
SIR | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో వచ్చే నెల 15 నుంచి ఎస్‌ఐఆర్ ప్రక్రియ మెుదలవుతుందని సీఈవో సుదర్శన్‌రెడ్డి (CEO Sudarshan Reddy) తెలిపారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరి వివరాలను వెరిఫికేషన్ చేస్తామన్నారు. బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫామ్‌లు ఇస్తారని చెప్పారు. ప్రతి ఓటర్‌కు రెండు ఎన్యుమరేషన్ ఫామ్‌లు ఇస్తారని.. ఒకటి పూర్తి చేసి మళ్లీ తిరిగి తమకు ఇవ్వాలని సూచించారు. మరొక ఎన్యుమరేషన్ ఫామ్‌ను ఓటరు దగ్గరే అక్‌నాలెడ్జ్ ఫామ్‌గా భద్రపరచుకోవాలని పేర్కొన్నారు. పూర్తి చేసిన ఎన్యుమరేషన్ ఫామ్‌లు సేకరించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు తెలపవచ్చని వివరించారు. వాటిని పరిష్కరించాక అక్టోబర్ 1న ఓటర్ల తుది జాబితాను ప్రచురిస్తామని తెలిపారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితా ప్రకారం 3.36 కోట్ల మంది ఉన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో 350 మంది ఓటర్ల వివరాలను బూత్ లెవెల్ ఆఫీసర్లు నమోదు చేయనున్నారు. ప్రతీ 10 మంది బీఎల్‌ఓలకు ఒక సూపర్‌వైజర్ ఉంటారు. రోజూ సేకరించిన సమాచారాన్ని ఓటర్లు ఎన్యూమరేషన్ ఫామ్‌లలో భర్తీ చేసిన తర్వాత ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ రూపంలోకి అప్‌లోడ్ చేస్తారు. మండలస్థాయిలో తహసీల్దారు అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌గా, ఈఆర్వోగా రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు ఉంటారు. జిల్లాస్థాయిలో ఎలక్షన్ ఆఫీసర్‌గా కలెక్టర్ వ్యవహరిస్తారు.
35,985 మంది బీఎల్‌వోలు, 25,886 మంది బీఎల్‌ఏలు సర్ ప్రక్రియలో పాల్గొంటారు. మొత్తం 33 జిల్లాల్లోని 13 కార్పొరేషన్లు, 129 పట్టణాలు, 12,769 గ్రామపంచాయతీల వివరాలను విభాగాల వారీగా అధికారులు గుర్తించి పెట్టుకున్నారు. రాష్ట్రంలోని సుమారు 83.04 లక్షల కుటుంబాల వద్ద వెళ్లి బీఎల్‌వోలు సర్వే నిర్వహిస్తారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా జనగణనతోపాటు సర్ నిర్వహించడం ఇదే మొదటిసారి. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2002లో ఎస్ఐఆర్ సర్వే జరిగింది.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



