త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Mallu Ravi | కవితకు పార్టీ పెట్టే హక్కుంది: కాంగ్రెస్ ఎంపీ మ‌ల్లు ర‌వి వ్యాఖ్య‌

MP Mallu Ravi | క‌విత(Kavitha)కు పార్టీ పెట్టే హ‌క్కు ఉంద‌ని.. కానీ సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)ని, కాంగ్రెస్‌ను విమ‌ర్శించే హ‌క్కు లేద‌ని ఎంపీ మ‌ల్లు ర‌వి వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ పై చేసిన వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

S

News | Published On Apr 26, 2026, 4.11 pm IST

MP Mallu Ravi | కవితకు పార్టీ పెట్టే హక్కుంది: కాంగ్రెస్ ఎంపీ మ‌ల్లు ర‌వి వ్యాఖ్య‌
Advertisement

MP Mallu Ravi | త్రినేత్ర‌.న్యూస్‌: క‌విత(Kavitha)కు పార్టీ పెట్టే హ‌క్కు ఉంద‌ని.. కానీ సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)ని, కాంగ్రెస్‌ను విమ‌ర్శించే హ‌క్కు లేద‌ని ఎంపీ మ‌ల్లు ర‌వి వ్యాఖ్యానించారు. తండ్రి బిడ్డలు ఏమైనా మాట్లాడుకోవచ్చని.. సీఎం రేవంత్ పై చేసిన వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఆ త‌ర్వాతే ప్రజల్లోకి వెళ్లాల‌న్నారు. ఈ మేర‌కు ఆయ‌న ఆదివారం గాంధీ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ కర్కోటకుడు, హిట్లర్ పరిపాలన జరుగుతుందన్న‌ కవిత వ్యాఖ్యల‌ను తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు.

మీ మీటింగ్ వ‌చ్చినోళ్ల‌ను అడుగు..

తెలంగాణలో రామ రాజ్యం నడుస్తుంటే కవితకు హిట్లర్ రాజ్యం ఎలా కనిపిస్తుంది? కవిత మీటింగ్ కు వచ్చిన ప్రజలను అడిగితే తెలుస్తుంది. బీఆర్ఎస్, టీఆర్ఎస్ లో పదేండ్లు కీలక పదవులు అనుభవించింది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయి జైల్ కు పోయినప్పుడు బీఆర్ఎస్ వాళ్లు సరిగా స్పందించలేదని ఆమె బయటకు వచ్చింది. పది సంవత్సరాలు అధికారంలో ఉండి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఎందుకు కల్పించలేదు? మేము ఉచిత బస్ ప్రయాణం కల్పింస్తున్నాం అని మ‌ల్లు మండిప‌డ్డారు.

తెలంగాణ 50 ఏండ్లు వెన‌క్కి..

మీరు ముక్క బియ్యం ఇస్తే మేము సన్న బియ్యం ఇస్తున్నాం. మీ క్యాబినెట్ లో మహిళలకు ఎందుకు చోటు కల్పించలేదని మీ తండ్రిని ఎందుకు ప్రశ్నించలేదు? మీరు అధికారంలోకి వచ్చాక తెలంగాణను 50 ఏండ్లు వెనక్కి తీసుకెళ్లారు. అన్నీ అప్పులు చేశారు. అవి ఇప్పుడు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఒక్కొక్క‌టిగా తీర్చుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇప్పుడిప్పుడే రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నం. ప్రాధాన్య క్ర‌మంలో హామీలు అమ‌ల‌వుతున్నాయి. మ‌ల్లీ కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు అని మ‌ల్లు ర‌వి అన్నారు.

Advertisement
Advertisement