త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | మ‌హిళ‌ల‌కు వంద శాతం సబ్సిడీతో కుట్టు మిషన్లు: పొన్నం

Ponnam Prabhakar | మ‌హిళ‌ల‌కు వంది శాతం స‌బ్సిడీతో కుట్టు మిష‌న్లు (stitching machines) మంజూరు చేస్తామ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ పేర్కొన్నారు. నియోజ‌క‌వ‌ర్గానికి 1000 మంది అతివ‌ల‌కు కుట్టు మిష‌న్లు మంజూరు చేసేందుకు ప్ర‌భుత్వవ నిర్ణ‌యం తీసుకుంద‌న్నారు.

S

News | Published On Apr 26, 2026, 4.36 pm IST

Ponnam Prabhakar | మ‌హిళ‌ల‌కు వంద శాతం సబ్సిడీతో కుట్టు మిషన్లు: పొన్నం
Advertisement

Ponnam Prabhakar | త్రినేత్ర‌.న్యూస్‌: మ‌హిళ‌ల‌కు వంది శాతం స‌బ్సిడీతో కుట్టు మిష‌న్లు (stitching machines) మంజూరు చేస్తామ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ పేర్కొన్నారు. నియోజ‌క‌వ‌ర్గానికి 1000 మంది అతివ‌ల‌కు కుట్టు మిష‌న్లు మంజూరు చేసేందుకు ప్ర‌భుత్వవ నిర్ణ‌యం తీసుకుంద‌న్నారు. ఈ పథకం అమలుపై బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ బాలమయాదేవి, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు, ఇతర అధికారులతో మంత్రి పొన్నం ఆదివారం సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు.

ఆటోమేటిక్ కుట్టు యంత్రాల‌ సరఫరా..

రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన బీసీ మహిళలకు టైలరింగ్ ఆధారిత స్వయం ఉపాధి కల్పిస్తామ‌ని చెప్పారు. వారి ఉత్పాదకతను పెంచి, టైలరింగ్ వ్యాపార అవకాశాలను విస్తరించుకునేందుకు తోడ్పాటునందిస్తామ‌ని తెలిపారు. స్వయం సమృద్ధిగల పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఆటోమేటిక్ కుట్టు యంత్రాలను సరఫరాకు ఉత్తర్వులు జారీ చేశామ‌న్నారు. త్వరలోనే వాటికి అప్లికేషన్ తీసుకొని జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ జరుగుతుందని వివ‌రించారు.

నియోజ‌క‌వ‌ర్గానికి వెయ్యి మందికి...

ముఖ్యమంత్రి సూచనల‌ మేరకు బలహీన వర్గాల మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం. నియోజకవర్గానికి వెయ్యి మంది మహిళలకు చొప్పున స్వయం ఉపాధి పెంచుకొని ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. బలహీన వర్గాల శాఖ పక్షాన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు, స్కిల్ డెవల‌ప్‌మెంట్ వంటి కార్యక్రమాలు చేయడానికి శాఖ ప్రణాళికలు చేస్తుంది అని పొన్నం తెలిపారు.

Advertisement
Advertisement