CM Revanth Reddy | రెవెన్యూ డివిజన్లలో ప్రజావాణి పెట్టండి.. ప్రజలకు సేవలు చేరువ చేయండి: అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
CM Revanth Reddy | రెవెన్యూ డివిజన్ల(Revenue divisions)లో ప్రజావాణి (Prajavani)పెట్టి ప్రజలకు సేవలను మరింత చేరువ చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. తరువాత దశలో మండల స్థాయి (Mondal level)కి విస్తరించాలని సూచించారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: రెవెన్యూ డివిజన్ల(Revenue divisions)లో ప్రజావాణి (Prajavani)పెట్టి ప్రజలకు సేవలను మరింత చేరువ చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం ఉదయం ఎంసీహెచ్ఆర్డీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. దూర ప్రాంతాల నుంచి ప్రజలు హైదరాబాద్ కు, జిల్లా కేంద్రానికి వచ్చే బదులు ప్రజావాణి సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్నారు. వెంటనే రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి ప్రారంభించాలని చెప్పారు. తరువాత దశలో మండల స్థాయి(Mondal level)కి విస్తరించాలని సూచించారు.
పురోగతిని అర్జీదారునికి తెలియజేయాలి..
రాష్ట్రంలో ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పకడ్బందీగా అమలు చేయాలి. ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలి. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అన్ని స్థాయిల్లో అధికారులకు పూర్తి అధికారాలు ఇవ్వాలి. ప్రజలు ఇచ్చే ప్రతి ఫిర్యాదును నమోదు చేయాలి. సంబంధిత విభాగాలకు పంపించి, పరిష్కార పురోగతిని అర్జీదారునికి తెలియజేయాలి. ఫిర్యాదుల పరిష్కారానికి నిర్ణీత గడువులు పెట్టండి. ఎట్టిపరిస్థితుల్లో ఆలస్యం కావొద్దు. ఫిర్యాదుల నమోదు, ట్రాకింగ్, పరిష్కారానికి ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫాం అభివృద్ధి చేయాలి. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో రియల్ టైమ్ మానిటరింగ్ ఉండాలి అని సీఎం సూచించారు.
ఆటో ఎస్కలేషన్ వ్యవస్థను అమలు చేయండి..
ప్రతి స్థాయిలో ప్రజావాణికి ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి జిల్లాలోనూ, ప్రతి శాఖలో ప్రత్యేక ప్రజావాణి విభాగాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఒకస్థాయిలో పరిష్కారం కాకపోతే, పైస్థాయి అధికారికి అర్జీ అందేలా ఆటో ఎస్కలేషన్ వ్యవస్థను అమలు చేయాలని చెప్పారు. అవసరమైతే అప్పీల్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు.
కింది స్థాయిలో కొన్నింటికి పరిష్కారం..
జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పెండింగ్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. డ్యాష్‌బోర్డ్ ద్వారా పరిష్కార పురోగతి తెలుసుకునే వీలుండాలని, ఎక్కడైనా ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులనే బాధ్యులను చేయాలని చెప్పారు. ప్రజావాణి సేవలను వికేంద్రీకరించటంతో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో పెండింగ్ అర్జీల సంఖ్య తగ్గుతుందని, కింది స్థాయిలోనే కొన్ని పరిష్కరించే వీలుంటుందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుసటి రోజే 2023, డిసెంబర్ 8న ప్రజావాణి కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. ప్రతి మంగళవారం, శుక్రవారం మహాత్మా జ్యోతిభా ఫూలే ప్రజా భవన్‌లో ప్రజావాణి అమలవుతోంది. అన్ని విభాగాలకు చెందిన అధికారులు అక్కడికక్కడే ప్రజలు ఇచ్చే అర్జీలు, దరఖాస్తులను స్వీకరించి వేగవంతంగా వాటిని పరిష్కరించే చర్యలు చేపడుతున్నారు. జిల్లా స్థాయిలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతి వారం ప్రజావాణి నిర్వహిస్తూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



